Friday, 4 February 2022

Thank You Movie : స్పీడు మీదున్న నాగ చైతన్య..రష్యాకు ‘థాంక్యూ’ చెప్పేశారు!

నేటి త‌రం అక్కినేని క‌థానాయ‌కుల్లో ఒక‌రైన నాగ చైత‌న్య ఏక ధాటిగా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఆయ‌న గట్టిగానే ప‌ట్టు ప‌ట్టాల‌ని, అక్కినేని అభిమానుల‌ను అల‌రించాల‌ని డిసైడ్ అయిన‌ట్లు ఉన్నారు. అందుకు వ‌రుస సినిమాల‌ను పూర్తి చేస్తూ వ‌స్తున్నారు.లేటెస్ట్‌గా ‘థాంక్యూ’ సినిమా షూటింగ్‌ను నాగ చైత‌న్య అండ్ టీమ్ పూర్తి చేసింది. గ‌త కొన్ని రోజుల నుంచి థాంక్యూ సినిమాకు సంబంధించిన మెయిన్ టీమ్ ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో షూటింగ్ చేస్తూ వ‌స్తున్నారు. మైన‌స్ 14 డిగ్రీల చ‌లిలో క‌ష్ట‌ప‌డి చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. మాస్కో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో ఎంటైర్ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని నాగ చైత‌న్య త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. కుదిరితే ఇదే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న టాక్‌. ALSO READ : ఇప్ప‌టికే బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చ‌ద్దా’లో ఆమిర్ ఖాన్‌తో క‌లిసి నాగ చైత‌న్య న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు థాంక్యూ సినిమాను కూడా పూర్తి చేసేశారు. మ‌నం త‌ర్వాత డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్‌తో నాగ చైత‌న్య క‌లిసి చేసిన సినిమా ఇది. బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌ను అందించారు. ఇందులో చైత‌న్య మూడు లుక్స్‌లో క‌నిపిస్తారు. యంగ్, మ‌ధ్య వ‌య‌స్కుడు స‌హా మ‌రో లుక్‌లో చైత‌న్య క‌నిపిస్తార‌ని స‌మాచారం. రీసెంట్‌గా గ‌డ్డం పెంచి క‌ళ్ల‌ద్దాలు వేసుకున్న లుక్‌ను కూడా చైత‌న్య షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖ‌న్నాతో పాటు అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది ‘లవ్ స్టోరి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ‘థాంక్యూ’ సినిమాతో నెక్ట్స్ రేంజ్ హిట్ అందుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీని తర్వాత.. డిజిటల్ మాధ్యమంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శతక్వంలోనే, హారర్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయబోతున్నారు. ఇందులో నాగ చైత‌న్య జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మూడు సీజ‌న్స్‌గా రూపొంద‌నున్న ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మించ‌నుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/1KAyln6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....