సీనియర్ నటుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. దేశ భక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్‌గా రూపొందిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో శనివారం రోజు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి మాట్లాడిన తీరు స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఈ సినిమాలో మోహన్ బాబు నాక్కూడా ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు అని చెబుతూ మోహన్ బాబుపై పాజిటివ్ కామెంట్స్ చేశారు పోసాని. ''మీ గురించి తెలియనివారు పరిశ్రమలో లేరు. పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీరు తెలుసు. వెండితెరపై ఎంత స్పష్టంగా మాట్లాడతారో రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటారు. అందుకే మీ గురించి పొగడడం తప్పే. కానీ మీలాంటి వాళ్ళే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప సక్సెస్ అయితే ఇండస్ట్రీకి లాభం. జూనియర్ ఆర్టిస్టుల నుంచి కంపెనీ ఆర్టిస్టుల దాకా అందరికీ మంచిది. అదే శుభం.. లాభం. కాబట్టి మీరు నటుడిగానే కాకుండా లక్ష్మి ప్రసన్న బ్యానర్‌పై సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీస్తే చాలామందికి అన్నం పెట్టిన వాళ్లవుతారు. దేవుడికి దండం పెట్టడం చాలా ఈజీ.. పేదలకు అన్నం పెట్టడం చాలా కష్టం. ఆ రెండో తరగతి మీరు. ఇకపోతే మంచు విష్ణు ఆరడుగుల జెండా ఏం కాదు అలాగే పెద్ద గొప్పవాడేం కాదు. మనిషి లక్షణం ఉన్న మామూలు మనిషి. అందుకే 'మా' ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలిచాడు. మోహన్ బాబు ఫ్యామిలీలో మంచు విష్ణుతో పాటు అందరూ చాలా సామాన్యమైన మనుషులు'' అని అన్నారు పోసాని కృష్ణ మురళి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/WVFkvUd
No comments:
Post a Comment