Monday, 14 February 2022

Mahesh Babu : మ‌హేష్ కోసం జ‌క్క‌న్న మైండ్ బోయింగ్ ప్లాన్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత మూవీని పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళితో చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. ప్ర‌ముఖ నిర్మాత దుర్గారావు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. మ‌హేష్ సినిమా అంటే ఎక్స్‌పెక్టెష‌న్స్ ఓ రేంజ్‌లో ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక మ‌హేష్‌కి తోడుగా రాజ‌మౌళి యాడ్ అయితే ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్ పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటాయి. డౌటే లేదు. మ‌రో వైపు ఇప్పుడు ఇది పాన్ ఇండియా రేంజ్ మూవీగా రూపొంది,పాన్ వ‌రల్డ్ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ కోసం ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ మూవీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసింది. అదేంటంటే.. ఈ సినిమాను రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. క‌థ‌లో చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర ఒక‌టి ఉంటుంది. న‌ల‌బై నిమిషాల పాటు ఆ పాత్ర సినిమాలో క‌నిపిస్తుంద‌ట‌. అలాంటి పాత్ర‌ను ఓ బ‌డా హీరోతో చేయించాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారు. రాజ‌మౌళి త‌లుచుకుంటే బాలీవుడ్ హీరోలు సైతం ఆయ‌న సినిమాలో న‌టించ‌డానికి రెడీ అంటారు. మ‌రి రాజ‌మౌళి ఈ కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ హీరోను తీసుకుంటాడా? లేక టాలీవుడ్‌లో అగ్ర హీరోకే అగ్ర పీఠం ఇస్తాడా? అని చూడాలి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రో వైపు మ‌హేష్ సినిమా కోసం క‌థ‌, క‌థ‌నం సిద్ధం చేస్తున్నారు. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే స‌ర్కారు వారి పాట చిత్రాన్ని పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే, ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త్రివిక్ర‌మ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోతాడు. రాజ‌మౌళి సినిమా స్టార్ట్ అయ్యే లోపు ఈ సినిమాను పూర్తి చేయాల‌నేది మ‌హేష్ టార్గెట్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/pgY932P

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....