Saturday, 12 February 2022

గుండె పగిలింది.. వాడు ఇలాంటివాడని అనుకోలేదు: తమన్ ఎమోషనల్ కామెంట్స్

'' సాంగ్ లీక్‌పై ఎమోషనల్ అయ్యారు. చాలా బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఫిబ్రవరి 14న ‘కళావతి’ అనే పాట రిలీజ్ కావాల్సింది. కానీ ఈ పాటను లీకేజీ రాయుళ్లు ముందుగానే రిలీజ్ చేసేశారు. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్‌లో తన ఆవేదన తెలియపరుస్తూ ఆడియో క్లిప్స్‌ పోస్ట్ చేశారు. "చాలా బాధగా ఉంది మనసైతే.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంతో కష్టం.. ఆరు నెలలుగా ఈ వీడియో కోసం ఎంతో కష్టపడ్డాం. కరోనా సమయంలో కూడా రాత్రి పగలు టీమ్ అందరం కలిసి ఎంతో కష్టపడ్డాం. ఈ సాంగ్ షూట్ చేసినప్పుడు ఎనిమిది తొమ్మిది మందికి పాజిటివ్ కూడా వచ్చింది. అయినా కూడా ఈ సాంగ్ కోసం కష్టపడి పనిచేశాం. కానీ ఎవడో చాలా ఈజీగా ఈ పాటను నెట్‌లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. హార్ట్‌ బ్రేకింగా ఉంది'' అని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణం నేపథ్యంగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/aq89Upc

No comments:

Post a Comment

Need A Good Laugh? Watch This Film This Weekend

'Often, the actors and technicians would be rolling in laughter during the shooting. I remember our brilliant cinematographer laughed so...