Showing posts with label IFTTT. Show all posts
Showing posts with label IFTTT. Show all posts

Saturday, 7 November 2020

ఇవి రాస్తే డ్రై స్కిన్ అస్సలు ఉండదు..

వేడిగా, పొడిగా ఉండే ప్రదేశాల్లో నివసించడం, వేడి వేడి నీటితో స్నానం చేయడం, హార్ష్ గా ఉండే సోప్స్ వాడడం వంటివన్నీ కి దారితీస్తాయి. అయితే, అదృష్టవశాత్తూ, ఈ డ్రై స్కిన్ సింప్టమ్స్ ని తగ్గించి మాయిశ్చర్ ని రిస్టోర్ చేసేందుకు కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవేమిటో చూసేయండి మరి. 1. కొబ్బరి నూనె కొబ్బరి నూనె వల్ల స్కిన్ స్మూత్ గా హైడ్రేటెడ్ గా తయారవుతుంది. కొబ్బరి నూనెని రోజూ వాడవచ్చు. శరీరం లోని సెన్సిటివ్ పార్ట్స్ లో కూడా కొబ్బరి నూనె వాడవచ్చు. అలాగే, కంటి కిందా, నోటి చుట్టూతా కూడా యూజ్ చేయవచ్చు. కొబ్బరి నూనె వాడకం లో ఉన్న ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే కొబ్బరి నూనెని ఇంక దేనితోనూ కలపక్కర్లేదు. కొబ్బరి నూనె మృదువుగా ఉంటుంది కాబట్టి రోజూ వాడినా ఏ ప్రాబ్లమ్ రాదు. 2. పెట్రోలియం జెల్లీ కొన్ని స్టడీస్ ప్రకారం పెట్రోలియం జెల్లీ పెద్ద వారిలో స్కిన్‌ని హీల్ చేయగలదు. పెట్రోలియం జెల్లీనే మినరల్ ఆయిల్ అని కూడా అంటారు. ఇది స్కిన్ మీద ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇందు వల్ల తేమ లోపలే ఉండిపోతుంది. ఫలితంగా డ్రై పాచెస్ హీల్ అవుతాయి. 3. ఓట్‌మీల్ బాత్ ఇరిటేట్ అయ్యి ఉన్న స్కిన్ కి ఓట్‌మీల్ బాత్ సాధారణంగా యూజ్ చేసే రెమెడీ. తాతమ్మల కాలం నించీ వాడుతున్న చిట్కా ఇది. దురదగా ఉన్నప్పుడు ఇది బాగా పని చేస్తుంది. అయితే, ఓట్‌మీల్ బాత్ తీసుకున్న తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ బాత్ కోసం ఓట్‌మీల్ ని మెత్తని పొడి లా చేయండి. ఇప్పుడు ఈ పొడిని వెచ్చని నీటిలో కలపండి. ఆ నీటితో స్నానం చేయండి. 4. యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 మీ స్కిన్ డ్రై అవుతోందంటే అర్ధం మీ బాడీ రిపెయిర్ చేస్తున్న దాని కంటే ఫాస్ట్ గా మీ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయని అర్ధం. కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యని నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బ్లూ బెర్రీలు, టమాటాలు, క్యారెట్లు, బీన్స్, బఠానీలు, పప్పులు వంటివి తీసుకోవడం మేలు చేస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్ వంటి ఫిష్ కూడా తీసుకోవచ్చు. 5. గ్లోవ్స్ వాతావరణం లో మార్పులకి త్వరగా ఎఫెక్ట్ అయ్యేది చేతులే. డిటర్జెంట్స్ వద్ద నుండి నీటి మార్పు వరకు అన్నీ ఈ మార్పుల్లో ఉంటాయి. అందుకే, నీటిలో చేతులు పెట్టేటప్పుడు గ్లోవ్స్ వేసుకునే అలవాటు చేసుకోండి. 6. గోరు వెచ్చని నీరు వేడి నీటితో స్నానం ఎంత హాయిగా ఉన్నా స్కిన్ కి అది మంచిది కాదు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. అలాగే మాయిశ్చరైజ్ చేసి, స్కిన్‌ని రిపెయిర్ చేస్తాయని చెప్పే సోప్స్ పడకపోతే ఆపోజిట్ ఎఫెక్ట్ ఉండవచ్చు. అలాగే, హార్ష్ కెమికల్స్ లేకుండా, ఫ్రాగ్రెన్స్ లేకుండా, స్కిన్ మీద మృదువుగా ఉండే సోప్స్ ని ఎంచుకోండి. 7. బట్టలు చలికాలం లో ఒంటికి పట్టినట్లు ఉండే బట్టలు వేసుకుంటాం చలికి తట్టుకోడానికి. కానీ, అవి పడకపోతే హఠాత్తుగా డ్రై స్కిన్ సమస్య రావచ్చు. అలాంటప్పుడు కొద్దిగా లూజ్ గా ఉండే బట్టలే వేసుకోండి. 8. మాయిశ్చరైజర్డ్రై స్కిన్ నుండి రిలీఫ్ పొందటానికి మాయిశ్చరైజర్ అవసరం. మాయిశ్చరైజ్ చేయడాన్ని మీ రొటీన్ లో భాగం చేసుకోండి. అలాగే, బయటకు వెళ్తున్నప్పుడు సన్‌స్క్రీన్ ఉన్న మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. 9. తేనె డ్రై స్కిన్‌ని ట్రీట్ చేయడానికి తేనె కూడా మంచి ఆప్షనే. తేనె లో ఎన్నో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. తేనెకి యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తేనె తో ఫేస్ మాస్క్ వేసుకుని గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఓట్స్ తో కలిపి కూడా తేనె వాడవచ్చు. 10. లిప్ బామ్ మీకు బాగా సరిపోయే లిప్ బామ్ ని యూజ్ చేయండి. లిప్ బామ్ అప్లై చేసిన తరువాత మీకు దురదగా ఉన్నా, టింగ్లింగ్ గా అనిపించినా, ఏదో కుట్టినట్లు అనిపించినా వెంటనే ఆ లిప్ బామ్ వాడడం ఆపేసి వేరేది తీసుకోండి. 11. అలో వెరా అలో వెరా లో స్కిన్ హైడ్రేషన్ కి సహకరించే గుణాలు ఉన్నాయి. స్కిన్ పైన అప్లై చేసినప్పుడు అలో వెరా ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా ఫార్మ్ అవుతుంది. ఇది ఒక వైపు నుండి స్కిన్ ని హైడ్రేట్ చేస్తూ రెండవ వైపు నుండి స్కిన్ కి ఇంకా డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది. 12. పాల మీగడ డ్రై గా అయిపోయిన స్కిన్ కి పాల మీగడ బాగా పని చేస్తుంది. ఒక టీ స్పూన్ పాలలో, రెండు టీ స్పూన్ల పాల మీగడ, కొద్దిగా నిమ్మరసం కలపండి. మరీ ముద్దగా కాకుండా కొద్దిగా పల్చగా ఉండేలా కలపండి. డ్రై పాచెస్ మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పూర్తిగా ఇంకిపోయేవరకూ వదిలేయండి. స్నానానికి ముందు ఇలా చేస్తే కన్వీనియెంట్ గా ఉంటుంది. 13. అవకాడో అవకాడో డ్రై స్కిన్ నుండి రిలీఫ్ ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మీరు చేయవలసిందల్లా బాగా పండిన అవకాడో గుజ్జుని తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి డ్రై పాచెస్ మీద అప్లై చేయండి. ఒక పది నిమిషాల తరువాత స్నానం చేసేయండి. 14. ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలం గా ఉంటుంది. ఇది డ్రై స్కిన్ కి మంచి ల్యూబ్రికేటర్ లా పని చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ ని కొద్దిగా వెచ్చబెట్టి మీ స్కిన్ ని మసాజ్ చేసుకోండి. ఆ తరువాత స్నానం చేసేయండి. మీ స్కిన్ సాఫ్ట్ గా స్మూత్ గా తయారవుతుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3p7fYJy

Saturday, 31 October 2020

స్కిన్ టైప్‌ని బట్టి టోనర్ ఎంచుకోవడమెలా..

మీకు స్కిన్ కేర్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆల్రెడీ సీటీఎం రొటీన్ గురించి తెలిసే ఉంటుంది. సీటీఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఇది చాలా ఈజీగా ఫాలో అవ్వగలిగే మూడు స్టెప్స్ ఉన్న రొటీన్. ఈ రొటీన్ ప్రతి రోజూ ఫాలో అయితేనే దాని బెనిఫిట్స్ మనం పొందగలం. అయినా, చాలా మంది క్లెన్సింగ్ చేస్తారు, మాయిశ్చరైజ్ చేస్తారు, కానీ టోనింగ్ మర్చిపోతారు. క్లెన్స్ చేశాక టోనింగ్ కూడా చేస్తేనే మాయిశ్చరైజర్ బెనిఫిట్స్ పొందగలరు. కానీ, టోనర్ సెలెక్ట్ చేసుకోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. మీ కి తగిన టోనర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. మీ స్కిన్ ఎర్రబడుతూ, డ్రై పాచేస్ వస్తూ, ఇరిటేషన్, పీలింగ్, క్రాకింగ్ ఉంటే, దురద ఉంటే మీది డ్రై స్కిన్ అయ్యి ఉండే ఛాన్స్ ఎక్కువ. మీ స్కిన్ షైనీగా మెరుస్తూ ఉండి, టిష్యూతో తుడిస్తే టిష్యూ మీద ఆయిల్ వస్తే మీది ఆయిలీ స్కిన్. మీ టీ జోన్ మాత్రం ఆయిలీ గా ఉంటే మీది కాంబినేషన్ స్కిన్. స్కిన్ టైప్‌ని బట్టి టోనర్.. మీది డ్రై స్కిన్ అయితే ఆల్కహాల్ బేస్డ్ టోనర్స్‌కి దూరంగా ఉండాలి. కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, క్రీం బేస్ కానీ ఉన్న హైడ్రేటింగ్ టోనర్ తీసుకోండి. ఆయిలీ స్కిన్ అయితే మీరు అప్లై చేసుకున్నాక మీకు హెవీగా అనిపించకూడదు. అలాగే స్టికీగా కూడా ఉండదు. ఇన్‌గ్రీడియెంట్స్ లో ఆయిల్ లేని రిఫ్రెషింగ్, మరియు జెంటిల్ టోనర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఇన్‌గ్రీడియెంట్స్‌లో శాలీసిలిక్ ఆసిడ్ ఉన్న టోనర్‌ని చూజ్ చేసుకోవాలి. ఎస్ఎల్ఎస్, పారాబెన్స్ ఉన్న టోనర్స్ నుండి దూరంగా ఉండాలి. మీది యాక్నే ప్రోన్ స్కిన్ అయితే ఆల్కహాల్ లేని టోనర్ ని ఎంచుకోండి. అలాగే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ ఉన్న టోనర్స్ మృదువుగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందు వల్ల ఎలాంటి ఫ్లేకీనెస్ లేకుండా స్కిన్ గ్లోయీగా క్లీన్ గా ఉంటుంది. టోనర్ అప్లై చేసిన మొదటి రెండు, మూడు సెకన్లు కొద్దిగా టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుందంటే టోనర్‌లో పీహెచ్ లెవెల్ సరిగ్గా ఉందని అర్ధం, అంటే, కొద్దిగా ఎసిడిక్‌గా ఉందన్నమాట. ఈ ఎసిడిక్ క్వాలిటీ సెన్సిటివ్ స్కిన్‌కి కూడా జెంటిల్ గానే ఉంటుంది. యాక్నే ప్రోన్ స్కిన్ వారికి శాలీసిలిక్ ఆసిడ్ ఉన్న టోనర్ రికమెండ్ చేసినా సెన్సిటివ్ స్కిన్ వారికి మాత్రం ఈ ఇన్‌గ్రీడియెంట్ కొద్దిగా హార్ష్ గా, ఇరిటేటింగ్ గా ఉంటుంది. మరి ఏం ఉండాలి..
  • విచ్ హ్యాజిల్ - ఈ పూల మొక్కని ఎప్పటి నుండో స్కిన్ కేర్ లో యూజ్ చేస్తున్నారు. ఇందువల్ల స్కిన్ టోన్ ఒకేలా ఉంటుంది, నాచురల్ ఆయిల్స్ బ్యాలెన్స్ అవుతాయి, పోర్స్ అన్‌క్లాగ్ అవుతాయి.
  • గ్రీన్ టీ - గ్రీన్ టీ తాగడానికి మాత్రమే కాదు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన స్కిన్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
  • అలో వెరా - అలో వెరా స్కిన్ ని చల్లబరుస్తుంది. టోనర్ లో ఇది ఉంటే హైడ్రేటింగ్ గా ఉంటుంది. టెంపరరీ డిస్‌కంఫర్ట్, రెడ్‌నెస్ ని తగ్గిస్తుంది.
  • టీ ట్రీ ఆయిల్ - ఇది కూడా పోర్స్ ని అన్‌క్లాగ్ చేయడానికే వాడతారు. అసలు పోర్స్ కనబడకుండా చేయగలదీ టీ ట్రీ ఆయిల్.
  • రోజ్ వాటర్ ఆయిల్ - ఇది నాచురల్ గా ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ ని టైట్ చేస్తుంది.
బెనిఫిట్స్.. టోనర్ వాడడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవి: 1. పోర్స్ ని చిన్నగా కనబడేలా చేస్తుంది. ఫలితంగా మీ స్కిన్ స్మూత్ గా, మంచి పాలిష్డ్ లుక్ తో ఉంటుంది. స్కిన్ కి మంచి మెరుపుని ఇస్తుంది. 2. టోనర్స్ పొల్యూషన్ నుండీ, ఇతర వాతావరణ పరిస్థితుల నుండీ స్కిన్ ని కాపాడేటట్లుగా ఫార్మ్యులేట్ చేస్తారు. 3. ఫేషియల్ టోనర్ స్కిన్ ని రిజువినేట్ చేస్తుంది. స్కిన్ కి టైట్, ఫర్మ్ లుక్ ని ఇస్తుంది. రోజూ రెండు సార్లు టోనర్ వాడి చూడండి, ఎఫెక్ట్ ఇమ్మీడియెట్ గా మీకే తెలుస్తుంది. 4. మీ డైలీ రొటీన్ ని మొదలు పెట్టడానికీ, కంప్లీట్ చేయడానికీ సీటీఎం మంచి ఆప్షన్. అది ఎమేజింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. 5. స్కిన్ ని చల్లబరుస్తుంది. ఎలాంటి ఎర్రదనమైనా తగ్గిస్తుంది. 6. ఆయిల్, మేకప్ రిమూవ్ చేయడనికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ ని నాచురల్ గా క్లీన్ చేస్తుంది. 7. ఫేషియల్ టోనర్ వలన స్కిన్ మంచి హైడ్రేటింగ్ గా ఉంటుంది. పైగా ఇది మాయిశ్చర్ రిటెయిన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఇంక మీకు సరిపోయే ఫేషియల్ టోనర్ ని తెచ్చుకుని మీ స్కిన్ కి మంచి గ్లో ని ఇవ్వండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2HLXHQK

Sunday, 25 October 2020

ఉల్లిపాయ రసం రాస్తే జుట్టు పెరుగుతుందా..

ఉల్లిపాయలకు కన్నీళ్లకు అవినాభావ సంబంధం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనలో చాలామంది నోటి దుర్వాసన సమస్య వల్లనో లేదా కన్నీళ్లను అవాయిడ్ చేయాలనుకోవడం వల్లనో ఉల్లిపాయను పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. కానీ మీకో విషయం తెలుసా? ఉల్లిపాయ కేవలం ఆహారానికి టేస్ట్ ను యాడ్ చేయడమే కాదు మరింకెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుందని? ఆనియన్ కంటే ఇంకా మెరుగైనది ఏదీ అంటే ఆనియన్ జ్యూస్ అనే చెప్పుకోవాలి. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆనియన్ జ్యూస్ అలాగే దాని ద్వారా లభించే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండేందుకు మనం రకరకాల జ్యూస్ లను మనం మన డైట్ లో భాగంగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. ఐతే, మీరెప్పుడైనా ఆనియన్ జ్యూస్ గురించి విన్నారా? జ్యూస్ ల విషయానికి వస్తే చాలా మంది తాజా కూరగాయలు ఆలాగే పండ్ల రసాల గురించే ఆలోచిస్తారు. ఆనియన్ అనేది మనకు దృష్టిలోకే రాదు. ఐతే, ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్ అలిసిన్ అనేది ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, ఆనియన్ జ్యూస్ అనేది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కార్డియో వాస్క్యులార్ రిస్కులను తగ్గిస్తుంది. యూరినరీ డిజార్డర్స్ ను ట్రీట్ చేస్తుంది. ఇక్కడితో ఆనియన్ జ్యూస్ కి సంబంధించిన లాభాల జాబితా పూర్తవలేదు. దీని నుంచి లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ అద్భుతమైన వెజిటబుల్ లో సల్ఫర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, విటమిన్ ఏ, బీ, సి మరియు ఈ అలాగే శక్తివంతమైన క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఎన్నో ఇతర ఫ్లెవనాయిడ్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఆనియన్ జ్యూస్ ను ఇంట్లోనే ఎలా తయారుచేయాలి? ఆనియన్ జ్యూస్ ను సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇది రాకెట్ సైన్స్ ఏ మాత్రం కాదు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆనియన్ ను పీల్ చేయండి. 2. రన్నింగ్ వాటర్ లో ఆనియన్ ను శుభ్రంగా కడగండి. ఈ స్టెప్ అనేది వెజిటబుల్ ను శుభ్రం చేయడానికి హెల్ప్ చేస్తుంది. 3. తాజా పేపర్ టవల్ తీసుకుని ఆనియన్ పై ఉన్న తడిని తుడవండి. 4. ఇపుడు ఆనియన్ ను పదునైన కత్తి సహాయంతో తరగాలి. 5. ఇప్పుడు ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో పెట్టి డివైస్ ను ఆన్ చేయాలి. ఒక్కొక్కటిగా ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో వేయాలి. జ్యూస్ వస్తుంది. 6. ఇప్పుడు జ్యూసర్ ను శుభ్రంగా కడగాలి. వేడి నీళ్లతో కడగాలి. కొద్ది నిమిషాలు స్క్రబ్ చేయాలి. అపుడే, ఆనియన్స్ యొక్క ఘాటైన వాసన పూర్తిగా తొలగిపోతుంది. 7. ఫ్రెష్ ఆనియన్ జ్యూస్ ను గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అవసరానికి తగినట్టుగా వాడాలి. స్కిన్ కేర్ కోసం ఆనియన్ జ్యూస్ ను ఎలా వాడాలి? నేచురల్ ప్రోడక్ట్స్ ను ఉపయోగించి పర్ఫెక్ట్ స్కిన్ ను పొందవచ్చు. ఆనియన్ జ్యూస్ ఈ విషయంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ మరియు శనగపిండితో ఫేస్ మాస్క్:కావలసిన పదార్థాలు:
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ తాజా ఉల్లిరసం
  • 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి
  • అర టీస్పూన్ పాలు
  • చిటికెడు నట్ మెగ్
  • 2-3 డ్రాప్స్ మీ ఫేవరేట్ ఎసెన్షియల్ ఆయిల్
  • కాటన్ బాల్
ప్రాసెస్:1. ఈ ఫేస్ మాస్క్ ను ప్రిపేర్ చేయడానికి పైన చెప్పబడిన పదార్థాలన్నిటినీ ఓ ప్లాస్టిక్ బౌల్ లోకి తీసుకోండి. 2. చిక్కటి పేస్ట్ అయ్యేవరకు బాగా మిక్స్ చేయండి. ఇందులో కొంత పాలను కలపడం ద్వారా ఫేస్ మాస్క్ వంటి కన్సిస్టెన్సీ వస్తుంది. 3. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను మీకు నచ్చినది యాడ్ చేయండి. ఆనియన్స్ యొక్క స్ట్రాంగ్ ఆరోమాను ఇలా తగ్గించవచ్చు. 4. ముఖాన్ని క్లీన్సింగ్ చేసుకోండి. ఆ తరువాత, ఈ ఫేస్ మాస్క్ ను ఈవెన్ గా ముఖంపై అప్లై చేయండి. 5. ఈ ప్యాక్ ను 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచండి. లేదా పూర్తిగా డ్రై అయ్యేవరకు అలాగే ఉంచండి. 6. కాటన్ బాల్ ను పాలలో ముంచి దీంతో సున్నితంగా సర్కులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ స్కిన్ పై మాస్క్ ను తుడిచేయండి. ఈ ఎక్స్ఫోల్లియేటింగ్ ప్యాక్ ను వారానికి ఒకసారి వాడితే మీ చర్మం త్వరలోనే కాంతివంతంగా మారుతుంది. హెయిర్ లాస్ ను కంట్రోల్ చేసే ఆనియన్ జ్యూస్ మరియు తేనె మాస్క్:కావాల్సిన పదార్థాలు:
  • పావు కప్పుడు తాజా ఆనియన్ జ్యూస్
  • 1 టేబుల్ స్పూన్ తేనె
  • షవర్ క్యాప్
  • ప్లాస్టిక్ బౌల్
ప్రాసెస్: 1. పైన చెప్పిన పదార్థాలన్నిటినీ ప్లాస్టిక్ బౌల్ కి తీసుకోవాలి. పేస్ట్ లా కలుపుకోవాలి. 2. ఈ పేస్ట్ ను నేరుగా స్కాల్ప్ కు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఫింగర్ టిప్స్ ను ఉపయోగించి మసాజ్ చేసుకోవాలి. 3. ఈ మిశ్రమాన్ని తలపై అరగంటపాటు ఉంచాలి. రాత్రిపూట అప్లై చేస్తే రాత్రంతా తలపై ఉంచవచ్చు. షవర్ క్యాప్ వేసుకుని ఈ మిశ్రమాన్ని కవర్ చేయాలి. 4. గోరువెచ్చటి నీటితో అలాగే తేలికపాటి షాంపూతో ఈ మిశ్రమాన్ని కడగాలి. 5. ఈ టెక్నీక్ ను వారానికి రెండు సార్లు వాడాలి. హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆరోగ్యం విషయంలో ఆనియన్ జ్యూస్ ను ఎలా వాడాలి? 1. చెవి నొప్పి: ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ జ్యూస్ అలాగే ఒక కాటన్ బాల్ ను తీసుకోండి. కాటన్ బాల్ ను ఆనియన్ జ్యూస్ లో ముంచి చెవిలో ఆనియన్ డ్రాప్స్ ను రిలీజ్ చేయండి. రోజుకు రెండు సార్లు ఈ ప్రాసెస్ ను ఫాలో అయితే చెవి నొప్పి తగ్గుతుంది. 2. దగ్గు: రెండు టేబుల్ స్పూన్ల ఆనియన్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఒక టీ స్పూన్ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోండి. ఈ మిశ్రమం మూడు నాలుగు రోజులపాటు ఉంటుంది. గొంతు నొప్పి అలాగే దగ్గు నుంచి రిలీఫ్ అందించేందుకు ఈ మిశ్రమం హెల్ప్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ ద్వారా ఇలా అనేక లాభాలను పొందవచ్చు. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2IY5RGa

Saturday, 24 October 2020

లిప్ బామ్, లిప్ సీరమ్ మధ్య తేడా ఏమిటీ? ఎలా తయారు చేసుకోవాలి?

లికాలం కూల్ కూల్‌గా భలే బావుంటుంది కానీ, చర్మానికి మాత్రం ఈ కాలం అస్సలు మంచిది కాదు. చర్మ సౌందర్యంపై శ్రద్ధ పెట్టేవారు ఈపాటికే వింటర్ ఎస్సెన్షియల్స్ తెచ్చేసుకుని ఉంటారు. అయితే, ఈ కాలం చర్మానికి మాత్రమే కాదు, పేదాలకు కూడా మంచిది కాదు. ఈ కాలంలో పెదవులు పొడిబారిపోతాయి. పగులుతూ ఉంటాయి. దీంతో చాలామంది రాసేస్తుంటారు. అయితే, ఆ బామ్ ఎంతో సేపు పనిచేయదు. అందుకే, మీ వద్ద లిప్ బామ్‌తోపాటు కూడా దగ్గర ఉంచుకోండి. ఇంతకీ లిప్ బామ్‌కు, లిప్ సిరమ్‌కు తేడా ఏమిటీ? లిప్ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలి? లిప్ బామ్: 1. ముఖం మీద చర్మంతో పోల్చితే పెదవుల మీద స్కిన్ పలచగా ఉంటుంది. అందుకని లిప్స్ డ్రై అయిపోకుండా లిప్ బామ్ రక్షిస్తుంది. 2. లిప్ బామ్ వాడడం వల్ల లిప్స్ యూత్‌ఫుల్‌గా కనపడతాయి. 3. ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ సన్‌ రేస్ నుంచి రక్షణ కల్పిస్తాయి. లిప్ సీరమ్: లిప్ బామ్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. సీరం మీ లిప్ సమస్యలను టార్గెట్ చేస్తే బామ్ మాయిశ్చర్‌ను లాక్ చేస్తుంది. లిప్స్ లోపల సెబేకియస్ గ్లాండ్స్ అసలు ఉండవు. దీనివల్ల లోపల నుంచి ఎలాంటి నేచురల్ ఆయిల్స్ ఉత్పత్తి కావు. దీని వల్ల పెదాలు త్వరగా పొడిబారిపోతాయి. లిప్ బామ్స్ మాయిశ్చరైజ్ చేస్తాయి. కానీ, అవి కూడా వెంటనే డ్రై అయిపోతాయి. మాటి మాటికీ వాటిని పెదాలకు అప్లై చేస్తుండాలి. లిప్ సీరమ్స్ అలా కాదు, అవి లాంగ్ టెర్మ్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఎందుకంటే, లిప్ బామ్ పైపైనే ప్రొటెక్షన్ ఇస్తుంది. లిప్ సీరమ్ లోపలి నుంచి సమస్యను పరిష్కరిస్తుంది. అంతేగాక సీరమ్స్ ఫైన్ లైన్స్‌‌ను తగ్గిస్తాయి. Read Also: లిప్ సీరమ్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. హోమ్ మేడ్ లిప్ సీరమ్ తయారీ: ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి రోల్-ఆన్-నాజిల్ ఉన్న ఒక చిన్న బాటిల్‌లో వేయండి. రాత్రి నిద్రకి ముందు ఈ సీరమ్ అప్లై చేయండి. పొద్దున్న ఫేస్ వాష్ చేసుకున్నాక కూడా మీకు కావాలనుకుంటే అప్లై చేయవచ్చు. కానీ, ఇది చాలా థిక్‌గా ఉంటుంది. ఇందులోని పసుపు లిప్స్‌ను మళ్ళీ సరైన రంగులోకి లోకి తెచ్చేస్తాయి. నెయ్యి చలి కాలంలో కావాల్సిన పోషణ అందిస్తుంది. లిప్స్ స్క్రబ్ చేసుకున్న వెంటనే ఈ సీరమ్ అప్లై చేయడం ఇంకా మంచిది. Read Also: ఈ జాగ్రత్తలు పాటించండి: 1. లిప్ స్క్రబ్ తరువాత లిప్ సీరమ్ అప్లై చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోయి లిప్ సీరమ్ ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతుంది. 2. హోమ్ మేడ్ లిప్ సీరమ్ కడిగి ఆరబెట్టిన క్లీన్ కంటెయినర్ లోనే స్టోర్ చేసుకోవాలి. 3. ప్రిసైజ్ అప్లికేషన్ కోసం లిప్ బ్రష్ యూజ్ చేయవచ్చు. 4. సీరమ్ అప్లై చేసిన తరువాత బామ్ అప్లై చేయడం మర్చిపోకండి. 5. ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటాయి. 6. ఈ సీరమ్ ని కొద్ది కొద్దిగానే తయారు చేసుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3jn0q0d

Monday, 19 October 2020

బియ్యం నీరు వాడితే జుట్టు పెరుగుతుందా..

అందరూ తరచుగా చర్మ సంరక్షణ గురించి మాట్లాడుకుంటారు, చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండటానికి చిట్కాల పాటిస్తారు. మీ జుట్టు రాలినపుడు, ఏవైనా జుట్టు సమస్యలు కలిగినపుడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ మీరు మీ జుట్టు సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారా? మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. ఇక్కడ మేము పేర్కొన్న సులభమైన కొరియన్ చిట్కాతో మీ జుట్టును సంరక్షించుకోండి. మీరు బియ్యం నీటి స్ప్రేను ఎలా తయారు చేయాలంటే.. అర కప్పు ఆర్గానిక్ బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ తీసుకొని బాగా కడగాలి. శుభ్రపరిచిన బియ్యాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని, 2 కప్పుల నీటిలో సుమారు రెండు గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడు బియ్యాన్ని వడకట్టి, గాలి చొరబడని డబ్బాలో లేదా సీసాలో బియ్యం నీటిని నిల్వ చేయండి. ఆ బియ్యం నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. దీన్ని స్ప్రే బాటిల్‌ లో పోసి, దానిలో ఒక టీస్పూన్ ఆముదంను కూడా కలపండి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తల మీద స్ప్రే చేసి, మసాజ్ చేయండి. మంచి ఫలితాల కోసం రాత్రంతా వదిలేయండి. కానీ గుర్తుంచుకోండి, మీకు ఏదైనా ఫలితం కనిపించాలంటే మీరు రెగ్యులర్‌గా దీన్ని అప్లై చేయాలి. బియ్యం నీటి వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు.. బియ్యం నీరు మీ తలని లోతుగా శుభ్రపరుస్తుంది. జిడ్డు లేకుండా చేస్తుంది. అంతే కాదు, పొడి, చిక్కు పడే జుట్టు ఉన్నవారికి ఇది గొప్ప కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది స్ప్లిట్ ఎండ్స్ ను కూడా తగ్గిస్తుంది. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఒక్క బియ్యం నీటితో అటు మీ చర్మాన్ని, ఇటు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి బియ్యం నీటిని రెగ్యులర్ గా ఉపయోగించండి. బియ్యం నీటిలో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, సిల్కీగా తయారవుతుంది. బియ్యం నీరు చుండ్రును కూడా తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. బియ్యం నీటిలో పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మాంగనీస్ మరియు ఎక్కువ ఫైబర్ ఉంటాయి. అంతే కాదు బియ్యం నీటితో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. బియ్యం నీరు ముఖ రంధ్రాలను తగ్గించి మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ బియ్యం నీటిని క్రమం తప్పకుండా వాడితే ప్రకాశవంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమల నివారణకు కూడా బియ్యపు నీటిని వాడవచ్చు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3lWVMYk

Saturday, 12 September 2020

వీర్యంతో ఫేషియల్.. సినీ తారల సీక్రెట్ చెప్పిన బ్యుటీషియన్!

వీర్యంతో ఫేషియల్.. సినీ తారల సీక్రెట్ చెప్పిన బ్యుటీషియన్!


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3hp97pB

ఫేస్‌ని అందంగా మార్చే యాంటీ ఏజింగ్ లోషన్ ఇంట్లోనే చేసుకోండిలా..

వయసు, జీవన శైలి ప్రభావాల దృష్ట్యా చర్మం మీద ముడతలు, చారలు కనిపిస్తూ కొంచం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అధికంగా కెమికల్ ఉత్పత్తుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. కానీ, కెమికల్ ఉత్పత్తులు తాత్కాలిక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఆ ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయన్న గ్యారెంటీ లేదు. కావున ఇంట్లోనే మనకు సులభంగా లభించే పదార్ధాలతోనే తయారు చేసుకుని ఉపయోగించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. యాంటీ ఏజింగ్ లోషన్ తయారీ విధానం : కావలసిన పదార్ధాలు :
  • అలోవేరా జెల్ 3 స్పూన్లు
  • విటమిన్ ఈ కాప్సూల్స్ 3
  • రోజ్ వాటర్ 2 స్పూన్లు
  • గ్లిజరిన్ ఒక స్పూన్.
  • ఎసెన్షియల్ ఆయిల్ 4 చుక్కలు.
ఇక్కడ అలోవేరా జెల్ లో విటమిన్ ఎ, సి తోపాటు యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి డ్రైస్కిన్, మొటిమల సమస్యతో బాధపడేవారికి ఉత్తమంగా సహాయం చేస్తాయి. విటమిన్ ఈ కాప్సూల్స్ చర్మాన్ని ఎండ ప్రభావం నుండి సంరక్షించడమే కాకుండా, చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచేలా చూస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా, చర్మం మీద ఆయిల్ (జిడ్డు), మురికిని తొలగించి హైడ్రేట్ గా ఉంచి పిహెచ్ వాల్యూని పునరుద్దరిస్తుంది. ఇక గ్లిజరిన్ ముడతలు, ఫైన్ లైన్స్ తొలగించడంలో సహాయం చేస్తుంది. తయారీ విధానం.. ఇప్పుడు పదార్దాలన్నింటినీ ఒక బౌల్లో తీసుకుని జెల్ లా వచ్చేలా కలపండి. ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ జెల్ ను ఒక కంటైనర్లోనికి తీసుకోండి. దీనిని రూమ్ టెంపరేచర్లో 2 నుండి 3 రోజుల వరకు ఉంచవచ్చు. ముఖాన్ని శుభ్రపరచిన తర్వాత, ఈ యాంటీ ఏజింగ్ లోషన్ ను ముఖానికి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు ముఖం మీద కింద నుండి పైకి మసాజ్ చేసినట్లుగా అనుసరించండి. నుదురుతోపాటుగా ముడతలుగా కనిపించిన ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇంట్లోనే తయారు చేయగలిగే ఈ యాంటీ ఏజింగ్ లోషన్, అన్నిరకాల చర్మాలకు సరిపోతుంది. ముడతలు లేని నిగారింపు కూడిన చర్మాన్ని అందివ్వడంలో మీకు సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం తరచూ అనుసరించండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2RlIWpa

Wednesday, 9 September 2020

షీ బటర్, కొకో బటర్ రెండింటిలో ఏది స్కిన్‌కి మంచిది..

అనేక స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో షీ బటర్, కోకో బటర్స్ మెయిన్ ఇంగ్రిడియెంట్స్‌గా ఉంటాయి. ఈ రెండూ మెయిన్ ఇంగ్రిడియెంట్స్ గా కలిపి తయారైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు బటర్ వెరైటీస్ బ్యూటీ రొటీన్ కు మంచి ఎడిషన్ అని చెప్పొచ్చు. అయినా ఈ రెండిటి మధ్య గల తేడాలను తెలుసుకోవడం మంచిదే. మరి డిఫరెన్సెస్ ను ఎలా ఐడెంటిఫై చేయాలి? షీ బటర్, కోకో బటర్ ద్వారా డ్రై స్కిన్ కు మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అందుతాయి. ఈ రెండు రకాల బటర్స్ డ్యామేజ్ అయిన డ్రై స్కిన్ ను మృదువుగా చేసి హీల్ చేస్తాయి. అందులో సందేహం లేదు. కానీ, ఈ రెండిటిలో వాటికంటూ కొన్ని ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన బెనిఫిట్స్ కూడా ఇవి అందిస్తాయి. షీ బటర్, కోకో బటర్ మధ్య తేడాలు.. అనేక స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో షీ బటర్, కోకో బటర్ ప్రధానమైన ఇంగ్రేడియెంట్స్ గా ఉంటాయి. ఈ రెండూ మెయిన్ ఇంగ్రేడియెంట్స్ గా కలిపి తయారైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు బటర్ వెరైటీస్ బ్యూటీ రొటీన్ కు మంచి ఎడిషన్ అని చెప్పొచ్చు. అయినా ఈ రెండిటి మధ్య గల తేడాలను తెలుసుకోవడం మంచిదే. మరి డిఫరెన్సెస్ ను ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ రెండు బటర్స్ లో అద్భుతమైన స్కిన్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయని, ఐతే, ఈ రెండిటి మధ్య కొద్దిపాటి తేడాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కోకో బటర్ ఎక్కడ పుట్టింది. దీని లక్షణాలేంటి?
  • థియోబ్రోమో కోకో ఎల్ ట్రీ నుంచి కోకో బటర్ వస్తుంది. ఇది సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలో ట్రాపికల్ రీజన్స్ లో లభ్యమవుతుంది.
  • కోకో బీన్ నుంచి కోకో పౌడర్ ను వేరు చేసిన తరువాత మిగిలిన దాన్ని కోకో బటర్ గా సేకరిస్తారు. కోకో బటర్ అనేది ఒక రకమైన ఫ్యాట్. కోకో బీన్స్ నుంచి ఇది లభిస్తుంది. కోకో ప్లాంట్ నుంచి బీన్స్ ను తీసుకుని రోస్ట్ చేసి స్ట్రిప్ చేసి దాన్లోనుంచి ఫ్యాట్ కంటెంట్ ను సెపరేట్ చేస్తారు. అదే కోకో బటర్. మిగిలినవాటిని కోకో పౌడర్ లా ప్రాసెస్ చేస్తారు.
  • కోకో బటర్ లో ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవేంటంటే, ఒలిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్ అలాగే స్టీరిక్ యాసిడ్.
  • కోకో బటర్ ఓ ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటుంది. ఇంచుమించు చాక్లెట్ వంటి సువాసన. టెక్స్చర్ ఫర్మ్ గా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ లో కరిగిపోదు.
షీ బటర్ ఎక్కడ పుట్టింది. దీని లక్షణాలేంటి?
  1. మరోవైపు షీ బటర్ ఆఫ్రికన్ షీ ట్రీ నుంచి వస్తుంది. దీని పేరు విటలారియా పరాడొక్సా. ఈ షీ ట్రీ ఫ్రూట్ గుజ్జులో ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని సేకరించి షీ బటర్ లా తయారుచేస్తారు.
  2. షీ బెటర్ టెక్స్చర్ సాఫ్ట్ గా ఉంటుంది. స్ప్రెడబుల్ కన్సిస్టెన్సీ లో ఉంటుంది. షీ బటర్ లో ఒలిక్ మరియు స్టియరిక్ వంటి సాచురేటెడ్ యాసిడ్స్ లభిస్తాయి. ఇంకా ఇందులో లినొలిక్ యాసిడ్, అరాచిదిక్ యాసిడ్, పాల్మీటిక్ యాసిడ్ లభిస్తాయి.
  3. ఇందులో విటమిన్ ఏ మరియు ఈ అధికంగా లభిస్తాయి. ఇవే ఈ బటర్ కు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ను అందిస్తాయి.
  4. ఇక సువాసన విషయానికి వస్తే షీ బటర్ మైల్డ్ గా పరిమళాలను వెదజల్లుతుంది. ఐతే, ఈ పరిమళాలను మరింత పెంచేందుకు మీరు ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ను కూడా యాడ్ చేయవచ్చు.
వీటిలో ఏది మీ స్కిన్ కు మంచిది? ఈ రెండిటిలో ఏది బెటర్ అన్న విషయం మీ స్కిన్ కేర్ నీడ్స్ పై ఆధారపడి ఉంటుంది. షీ మరియు కోకో బటర్ ఈ రెండిట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్కిన్ మాయిశ్చర్ ను నిలిపి ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. అలాగే, ఇవి డ్రై మరియు ఇరిటేటెడ్ స్కిన్ కు మంచి రిలీఫ్ అందిస్తాయి. ఐతే, ఈ రెండూ కూడా వేరు వేరు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ను అందిస్తాయి. కోకో బటర్ బెనిఫిట్స్: కోకో బటర్ లోని ఫ్యాట్స్ అనేవి అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కలిగినవి. ఇవి స్కిన్ లోని తేమను నిలిపి ఉంచుతాయి. స్కిన్ స్ట్రాటమ్ కార్నియం లిపిడ్స్ ను భర్తీ చేస్తాయి. ఇవి పాల్మీటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్ అలాగే ఒలియాక్ యాసిడ్ ను దాదాపు పోలి ఉంటాయి. ఈ స్కిన్ స్ట్రాటమ్ కార్నియం అనేది స్కిన్ బారియార్ అని చెప్పుకోవచ్చు. స్కిన్ బారియర్ అనేది కెమికల్స్, అలర్జెన్స్, టాక్సిసిటీ, ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ వంటి వాటి నుంచి స్కిన్ ను కాపాడుతుంది. అలాగే ఇంటర్నల్ గా హోమియోస్టాసిస్ ను మెయింటెయిన్ చేస్తూ వాటర్ లాస్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఈ కోకో బటర్ స్కిన్ ను ప్రీమెచ్యూర్ డేమేజ్ మరియు ఏజింగ్ నుంచి కాపాడుతుంది. స్కిన్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తుంది. షీ బటర్ బెనిఫిట్స్:
  • షీ బటర్ లో లినోలీక్ యాసిడ్ ఉంటుంది. షీ బటర్ ను స్కిన్ పై అప్లై చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఈ యాసిడ్ ను స్కిన్ సెల్స్ స్వంతంగా తయారుచేసుకోలేవు.
  • షీ బటర్ లో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఈ షీ బటర్ కు మెడిసినల్ ప్రాపర్టీస్ ను అందిస్తాయి.
  • షీ బటర్ లో ముఖ్యమైన విటమిన్స్ ఉంటాయి. ఇవి డేమేజైన స్కిన్ ను రిపెయిర్ చేస్తాయి.
  • ఎండవల్ల కుమిలిపోయిన చర్మాన్ని నార్మల్ గా చేస్తాయి, స్కిన్ లో కొలాజెన్ ప్రొడక్షన్ ను బూస్ట్ చేస్తాయి అలాగే కొలాజెన్ లాస్ ను తగ్గిస్తాయి.
ఐతే, షీ బటర్ యొక్క కెపాసిటీపై ఈ చెట్టు పెరిగిన ప్రదేశం ప్రభావం పడుతుందా లేదా అన్న విషయంపై కెమికల్ అనాలిసిస్ అవసరమంటున్నారు నిపుణులు. ఈ షీ బటర్ అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. స్కాల్ప్, స్కిన్ అలాగే హెయిర్ కు ప్రయోజనకారిగా ఉంటుంది. డ్రై స్కిన్ త్వరగా రికవర్ అవడానికి షీ బటర్ తోడ్పడుతుంది. ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ ను తగ్గిస్తుంది. అటోపిక్ డెర్మటైటిస్ నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు, ఇది స్కిన్ పోర్స్ ను బ్లాక్ చేయదు. కోకో బటర్ ఐతే స్కిన్ పోర్స్ ను బ్లాక్ చేస్తుంది. ఈ కోకో బటర్ అలాగే షీ బటర్ అనేవి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో చక్కగా కలిసిపోతాయి. అయినా ఈ రెండిటిలో ఏది స్కిన్ కేర్ కి మంచిది అంటే మాత్రం షీ బటర్ అని చెబుతున్నారు నిపుణులు.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3k606no

Monday, 7 September 2020

నెయిల్ పాలిష్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా..

ప్రస్తుత సమయం కొంచెం క్రియేటివ్ గా ఆలోచించేందుకు సపోర్ట్ చేస్తోంది. సెల్ఫ్ కేర్ కూడా అందులో ముఖ్యమే. నేచురల్ వేస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హోమ్ బేస్డ్ రెమెడీస్ నే ప్రయత్నించడం అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా బ్యూటీ రొటీన్ లో కూడా నేచురల్ ప్రాసెస్ ను ఫాలో అవడం మంచిదే. నిజానికి హెయిర్ అలాగే స్కిన్ కేర్ విషయంలో నేచురల్ మెథడ్స్ ఫాలో ఐతే వచ్చే రిజల్ట్స్ గొప్పగా ఉంటాయి. ఇప్పుడు మనం ఓ సరికొత్త డిఐవై గురించి తెలుసుకుందాం. నెయిల్ పెయింట్ ను ఇంట్లోనే తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. బయటికి వెళ్లి కెమికల్స్ తో నిండిన కొనే బదులు ఇంట్లోనే ఒకటి తయారుచేసేసుకోండి. నిజానికిది ఎంతో సింపుల్. మరి ప్రాసెస్ లోకి వెళ్లిపోదామా...! 1. నేచురల్ నెయిల్ పెయింట్ కావలసిన పదార్థాలు
  • బెల్లం - 50 గ్రాములు
  • మెహందీ లేదా హెన్నా పౌడర్ - 1 టీస్పూన్
  • లవంగాలు - 20 గ్రాములు
ప్రాసెస్: బెల్లాన్ని పౌడర్ లా మార్చేవరకు గ్రైండ్ చేయండి. ఆ తరువాత ఒక బౌల్ లోకి బెల్లం పౌడర్ ను తీసుకోండి. మధ్యలో కాస్తంత ఖాళీను క్రియేట్ చేసి అందులో లవంగాలను పెట్టండి. ఇప్పుడు ఇంకొక బవుల్ ను వీటిపైన ఉంచి వీటిని గ్యాస్ స్టవ్ పై పెట్టండి. వేడి ఎక్కనివ్వండి. దాదాపు 10 నిమిషాల్లో ఆవిరి రావడాన్ని గమనిస్తారు. ఆ తరువాత ఇది వాటరీగా మారుతుంది. ఇప్పుడు ఈ వాటరీ మిక్స్ కు కాస్తంత హెన్నా పౌడర్ ను కలపండి. దీన్ని నెయిల్స్ కు కోటింగ్ గా అప్లై చేయవచ్చు. కాస్తంత చల్లారాక నెయిల్ కోట్ గా ఈ మిశ్రమాన్ని వాడండి. కాటన్ బాల్ ను ఉపయోగించి నెయిల్ కోట్ అప్లై చేసుకోవచ్చు. ఇది గోర్లపై చాలా కాలం ఉంటుంది. ఈ నేచురల్ నెయిల్ పెయింట్ బెనిఫిట్స్ ఏంటి? నెయిల్ పాలిషెస్ అనేవి కొన్ని రోజుల తరువాత పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతాయి. నెయిల్స్ పై అనీవెన్ గా ఉంటాయి. ఈ నేచురల్ నెయిల్ పెయింట్ కనీసం రెండు వారాల పాటు ఉంటుంది. దానంతటదే పోతుంది. చాలాసార్లు నెయిల్ పాలిష్ లో ఉండే కెమికల్ కంపొషిషన్స్ వల్ల స్కిన్ యొక్క నేచురల్ కలర్ దెబ్బతింటుందని. బెల్లం, లవంగాలు అలాగే హెన్నా వంటివి నెయిల్స్ ను ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి నెయిల్స్ ను హెల్తీగా ఉంచుతాయి. హెన్నాను నెయిల్స్ పై అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు? హెయిర్ ని కలర్ చేసుకోవడానికి హెన్నాని ఎక్కువగా వాడతారు. ఇది నెయిల్స్ కు కూడా మంచిదే. మరోవైపు, ఇది నెయిల్స్ ను దృఢపరిచి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. 1. హెన్నాను వాటర్ తో కలిపి పేస్ట్ లా తయారుచేసి నెయిల్స్ పై అప్లై చేసి అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత ఎండిపోయిన హెన్నాను రిమూవ్ చేయాలి. గోర్లు బలహీనంగా, చిట్లినట్టుగా ఉంటే హెన్నా అనేది మంచి రెమెడీ. నెయిల్స్ పై హెన్నాను అప్లై చేసి అలాగే ఉంచితే నెయిల్స్ స్ట్రాంగ్ గా అలాగే హెల్తీగా మారతాయి. ఇందులో కేరాటిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి, నెయిల్స్ డేమేజ్ అవకుండా ఈ పదార్థం కాపాడుతుంది. 2. నెయిల్స్ ను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల నెయిల్స్ డేమేజ్ అవుతాయి. క్యూటికల్స్ లోపలికి బాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తుంది. దాంతో, నెయిల్స్ సహజ రంగును కోల్పోతాయి. మాటిమాటికీ క్రాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి, హెన్నా అనేది మంచి రెమెడీ. ఇది బాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను అరికట్టేందుకు హెల్ప్ చేస్తుంది. 3. హెన్నా అనేది నేచురల్ ప్రోడక్ట్. కాబట్టి ఇది నెయిల్స్ కు ఎటువంటి డేమేజ్ కలిగించదు. పైగా హెన్నా వల్ల నెయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నెయిల్ పాలిష్ కంటే ఎక్కువ కాలం నెయిల్స్ పై మన్నుతుంది. అంటే, నెయిల్ కేర్ కోసం మీరు తక్కువ సమయాన్ని కేటాయిస్తే చాలు నెయిల్ హెల్తీగా అలాగే కాంతివంతంగా మారతాయి. నేచురల్ హెన్నా డై అనేది పురాతన కాలం నుంచి ఆచరణలో ఉన్న బ్యూటీ సీక్రెట్. ఇండియాతో పాటు మిడిల్ ఈస్ట్ కు చెందిన మహిళలు దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. హెన్నాతో నెయిల్ పెయింట్ గురించి తెలుసుకుంటే మీరు నెయిల్ పాలిష్ లపై ఖర్చు చేసే మొత్తాన్ని తగ్గించుకోగలరు. 2. నేచురల్ నెయిల్ పెయింట్ కావలసిన పదార్థాలు:
  • నేచురల్ హెన్నా పౌడర్
  • నిమ్మరసం
  • ఆపిల్ సైడర్ వినేగార్
స్టెప్ 1: హెన్నా పేస్ట్ ను కలపండి: ఒక టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ ను చిన్న బవుల్ లోకి తీసుకోండి. అందులోకి కాస్తంత నిమ్మరసాన్ని పిండండి. పేస్ట్ లా తయారుచేయండి. పొటాటోస్ ను మ్యాష్ చేస్తే వచ్చే కన్సిస్టెన్సీలా ఈ పేస్ట్ తయారవ్వాలి. ఈ బవుల్ ను ప్లాస్టిక్ వ్రాప్ తో కవర్ చేయండి. ఫ్రిడ్జ్ లో ఆరు నుంచి పన్నెండు గంటలపాటు అలాగే ఉంచండి. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. ఈ మిశ్రమం డార్కర్ షేడ్ లోకి వచ్చిందంటే పేస్ట్ రెడీ అయిందని అర్థం. స్టెప్ 2: నెయిల్స్ మరియు క్యూటికల్స్ ను ప్రిపేర్ చేసుకోండి: నెయిల్స్ ను మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి. క్యూటికల్స్ ను జెంటిల్ గా వెనక్కి పుష్ చేయండి. నెయిల్స్ ను వాష్ చేయండి. ఆపిల్ సైడర్ వినేగార్ లో ముంచిన కాటన్ బాల్ తో వైప్ చేసి నెయిల్స్ పై ఉన్న ఆయిల్ లేదా డర్ట్ ను రిమూవ్ చేయండి. స్టెప్ 3: హెన్నా పేస్ట్ ను అప్లై చేయండి: నెయిల్ బ్రష్ ను ఉపయోగించి నెయిల్ పై ఈ హెన్నా పేస్ట్ ను అప్లై చేయండి. వివిధ లేయర్స్ అప్లై చేస్తే మంచిది. స్టెప్ 4: వెయిట్ చేయండి: ఈ పేస్ట్ 30 నిమిషాల పాటు డ్రై అవ్వాలి. డార్కర్ కలర్ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువసేపు ఈ పేస్ట్ ఆరాలి. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. స్టెప్ 5: మేకోవర్ ను రివీల్ చేయండి: హెన్నా పేస్ట్ ను రిమూవ్ చేయడానికి నిమ్మరసంలో లేదా ఆపిల్ సైడర్ వినేగార్ లో ముంచిన కాటన్ బాల్ ను వాడాలి. సో ఈ నేచురల్ నెయిల్ పెయింట్స్ నెయిల్ హెల్త్ ను ఎంతో ఇంప్రూవ్ చేస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/33bSlFk

Friday, 4 September 2020

రోజుకి 10 నిమిషాలు చేస్తే చాలు.. మొటిమలు, మచ్చలు దూరం..

ప్రతి ఒక్కరూ తమ చర్మం మిలమిలా మెరవాలనే కోరుకుంటారు. రోజంతా తాజాగా ఉండాలని ఆశిస్తారు. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలో హోమ్ కేర్ కి అలాగే హోమ్ రెమెడీస్‌కి బాగా గిరాకీ పెరిగింది. బ్యూటీ సెలూన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లోనే బ్యూటీకి సంబంధించిన కేర్ తీసుకుంటున్నారు. ఈ సమయంలో చాలామంది గమనించిన విషయం ఏంటంటే హోమ్ కేర్ వల్ల చర్మం మరింత ఫ్రెష్ గా తాజాగా ఉంటోందని. కాబట్టి, స్కిన్ కేర్ విషయంలో హోమ్ రెమెడీస్ పైనే ఫోకస్ పెడుతున్నారు. బేసిక్ ఫేషియల్ గైడ్ 1. మొదట మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయండి. ఇందుకోసం మీకు కాస్తంత బియ్యం పిండి అలాగే కొంత మిల్క్ క్రీమ్ అవసరపడుతుంది. ఈ రెండూ ముఖంపై గ్లో తేవడానికి వండర్స్ చేస్తాయి. ఇవి మంచి ఫేస్ స్క్రబ్ లా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ రైస్ ఫ్లోర్ ను తీసుకుని కాస్తంత మిల్క్ క్రీమ్ ను కలపండి. ఆ తరువాత ముఖంపై అలాగే మెడపై ఈ మిశ్రమంతో సర్క్యూలర్ మోషన్‌లో మసాజ్ చేయండి. 2. మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఫేసియల్ క్రీమ్‌ను అప్లై చేయాలి. మిల్క్ క్రీమ్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. చిటికెడు పసుపును అలాగే శనగపిండిని కలపండి. ఈ పేస్ట్ కొంచెం చిక్కగా ఉండటం వల్ల ముఖంపై ఈవెన్ గా మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా పింపుల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో కూడా మసాజ్ చేయాలి. ఇది ముఖంపై నుంచి అదనపు నూనెను గ్రహిస్తుంది. స్కిన్ ను హైడ్రేటెడ్ గా అలాగే క్లీన్ గా ఉంచుతుంది. 3. ఇక మూడవ స్టెప్ గురించి తెలుసుకుందాం. ఇది ఫేస్ ప్యాక్ లో చివరి స్టెప్. ఇందులో మిల్క్ క్రీమ్ ను కాస్తంత తేనెతో కలపండి. ముఖంపై అప్లై చేసుకోండి. స్కిన్ పై ఇది సెటిల్ అవనివ్వండి. కొన్ని నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయండి. సెలూన్ వంటి గ్లోను మీరు మీ ముఖంపై గమనిస్తారు. ఈ హోమ్ ఫేసియల్ అనేది అన్ని రకాల స్కిన్ టైప్స్ కు బాగా సూట్ అవుతుంది. స్కిన్ ప్రాబ్లెమ్స్ నుంచి మీకు రిలీఫ్ అందిస్తుంది. సన్ బర్న్, యాక్నే, పెయిన్ ఫుల్ పింపుల్స్, క్లాగ్ ఐన పోర్స్, డల్ లేదా లైఫ్ లెస్ స్కిన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ వంటి సమస్యలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. దీన్ని ఈ రోజే ప్రయత్నించి చూడండి. రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. ఐతే, ఇంట్లోనే ఫేసియల్ చేసుకుంటున్నప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ ను అవాయిడ్ చేయాలి. అవేంటంటే... ఎక్స్ఫోలియేషన్ అనే ప్రక్రియ ద్వారా చర్మంపై పేరుకుని ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించవచ్చు. దానివల్ల, లోలోపల దాగున్న చర్మ సౌందర్యం వెలుగులోకి వస్తుంది. ఐతే, ఎక్స్ఫోలియేషన్ సమయంలో చాలా మంది ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. 1. ప్రెజర్ ఎక్కువగా పెట్టడం: ఎక్స్ఫోలియేషన్ ప్రక్రియను చేత్తో చేసినా లేదా రొటేటింగ్ బ్రష్ తో చేసినా ప్రెజర్ ఎక్కువగా పెట్టకూడదు. ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల స్కిన్ డేమేజ్ అవుతుంది. స్క్రబ్ లేదా టూల్ ను మీరు రఫ్ గా వాడితే స్కిన్ పై లేయర్ డేమేజ్ అయ్యే ప్రమాదం ఉంది. 2. అతిగా ఎక్స్ఫోలియేట్ చేయడం: వయసుతో పాటు పర్యావరణ ప్రభావం వల్ల స్కిన్ స్వంతంగా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాబట్టి, ఈ డెడ్ స్కిన్ సెల్స్ చర్మంపై పేరుకుని పోతాయి. చర్మ రంధ్రాలు బ్లాకవుతాయి. కాబట్టి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించేందుకు ఎక్స్ఫోలియేషన్ హెల్ప్ చేస్తుంది. ఐతే అతిగా చేస్తే ప్రమాదకరం. తరచూ ఎక్స్ఫోలియేషన్ చేయకూడదు. ఎక్స్ఫోలియేషన్ చేసాక రికవర్ అవడానికి స్కిన్ కు కొంతసమయం పడుతుంది. ఆ గ్యాప్ ఇవ్వకపోతే స్కిన్ డేమేజ్ అవుతుంది. అతిగా ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల చర్మంపై రెడ్ నెస్, ఇరిటేషన్ అలాగే ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది. రానురాను కాంప్లెక్షన్ డ్రైగా అలాగే ఫ్లేకీగా మారిపోతుంది. టోన్ అన్‌ ఈవెన్ అవుతుంది. రాష్ వంటి టెక్స్చర్ డెవెలప్ అవుతుంది. బ్రేకవుట్స్ వస్తాయి. 3. హార్ష్ ప్రోడక్ట్స్ ను వాడటం: చాలామందికి స్క్రబ్స్ ను సరైన విధంగా ఎలా వాడాలో తెలియదు. ఎంత మేరకు స్క్రబ్ ను వాడాలి, ఎటువంటి ఎక్సోఫ్లియేటర్ ను వాడాలి అన్న విషయంపై సరైన అవగాహన ఉండదు. జెంటిల్ స్క్రబ్స్ నే వాడాలి. హోమ్ మేడ్ ఐతే మరీ మంచిది. 4. సరైన ఎక్స్ఫోలియేటర్ ను వాడకపోవడం: వాతావరణంలోని మార్పుల బట్టి స్కిన్ కేర్ విషయంలో మరింత శ్రద్ద వహించాలి. అన్నిటికీ ఒకే మందు పనికిరాదు. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. వయసును, ఏజ్ ను అలాగే రొటీన్ ను దృష్టిలో పెట్టుకుని స్కిన్ కేర్ లో మార్పులూ చేర్పులూ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి స్కిన్ టైప్ డిఫెరెంట్. ఓకే ఎక్స్ఫోలియేటర్ అందరికీ ఒకేలా రిజల్ట్ ఇవ్వదు. అలాగే, ఒక సీజన్ లో వర్క్ చేసిన ఎక్స్ఫోలియేటర్ వేరే సీజన్ లో కూడా అదే విధమైన రిజల్ట్స్ ఇస్తుందనలేము. సీజన్ బట్టి మీ స్కిన్ కండిషన్ బట్టి ఎక్స్ఫోలియేటర్స్ ను ఎంచుకోవాలి. 5. మాయిశ్చరైజర్ అప్లై చేయకపోవడం: ఎక్స్ఫోలియేషన్ అనే ప్రక్రియ స్కిన్ పైపొరపై పేరుకుని ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. కాబట్టి, ఎక్స్ఫోలియేషన్ తరువాత స్కిన్ సెన్సిటివ్ గా ఉంటుంది. పొల్యూషన్ కు గురయ్యే రిస్క్ ఉంది. కాబట్టి, ఎక్స్ఫోలియేషన్ తరువాత స్కిన్ పై నేచురల్ మాయిశ్చరైజర్స్ ను అప్లై చేయండి. కొబ్బరి నూనె ఐతే మరీ మంచిది. అలాగే, మాయిశ్చరైజింగ్ విషయంలో కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవేంటంటే, స్కిన్ ఆయిలీగా ఉంది కదా అని మాయిశ్చరైజర్ ను వాడటాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఆలా చేయకూడదు. ఆయిలీ స్కిన్ కి కూడా మొయిశ్చరైజర్ అవసరం ఉంది. కఠినమైన క్లీన్సర్స్ ను వాడి మాయిశ్చరైజర్ వాడకపోతే స్కిన్ తనలో తేమను రిటెయిన్ చేయడానికి మరింత ఆయిల్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలోవెరా అనేది ఇటువంటి సమయంలో హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. జిడ్డు లుక్ ఉండదు. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. సరైన ప్రాసెస్ లో ఇంట్లో స్కిన్ కేర్ తీసుకుంటే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తోనే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2Z5Ro0m

Tuesday, 1 September 2020

ఈ సింపుల్‌ టిప్స్‌‌తో మీరు కొరియన్స్‌లా మెరిసిపోతారు..

ఒకవేళ మీరు బ్యూటీపై అంత ఇంట్రెస్ట్ కనబరిచేవారు కాకపోయినా కూడా మీరు ఎమల్షన్ అనే పదాన్ని వినేవుంటారు. కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎమల్షన్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొరియన్ గ్లాస్ స్కిన్ రొటీన్ స్టెప్స్ గ్లాస్ స్కిన్ రొటీన్ లో మచ్చలేని గ్లాస్ లైక్ స్కిన్ కోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ను ఫాలో అవుతారు. మీ స్కిన్ టైప్ ను దృష్టిలో ఉంచుకుని ప్రోడక్ట్స్ ను వాడాలి. డబల్ క్లెన్సింగ్ చేయాలి. సెరమ్, లోషన్, మాయిశ్చర్ మరియు మిస్ట్ ను వాడాలి. ఈ బ్యూటీ రొటీన్ అనేది ఎక్కువగా స్కిన్ లోని పీహెచ్ లెవెల్స్ ను బాలన్స్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. స్కిన్ హైడ్రేటింగ్ పై ఫోకస్ పెడుతుంది. 1. డబుల్ క్లెన్సింగ్: ఏషియన్ స్కిన్ కేర్ లో డబుల్ క్లెన్సింగ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. స్కిన్ కేర్ రొటీన్ లో ముఖ్యంగా రాత్రి పూట స్కిన్ పై పేరుకుని ఉన్న మేకప్ ను డర్ట్ అలాగే గ్రీజ్ ను తొలగించడం ఉంటుంది. ఈ మెథడ్ లో ముందుగా మేకప్ ను ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ తో రిమూవ్ చేస్తారు. ఆ తరువాత ముఖాన్ని వాష్ చేయాలి. వాటర్ బేస్డ్ ఫేస్ వాష్ ను వాడాలి. ముఖం డ్రై గా ఉండదు. మేకప్ రిమూవర్ ను వాడాలి. ఇవన్నీకూడా మీ స్కిన్ టైప్ కి సూటయ్యేవి మీరు ఎంచుకోవాలి. అప్పుడే, స్కిన్ లోని నేచురల్ బాలన్స్ ను రక్షించుకోగలరు. 2. టోనింగ్: ట్రెడిషనల్ టోనర్స్ ను చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఐతే, కొరియన్ స్కిన్ కేర్ టోనర్స్ అనేవి రిఫ్రెషింగ్ అలాగే మాయిశ్చరైజింగ్ కి తోడ్పడే ఇంగ్రిడియెంట్స్ ను ఫోకస్ చేసి ఉంటాయి. ఉదాహరణకు, గ్రీన్ టీ, జింసెంగ్ అలాగే ఫ్లోరల్ వాటర్ వంటి వాటిని టోనర్స్ లో వాడతారు. వీటిని బేస్ హైడ్రేషన్ కోసం అప్లై చేస్తారు. ఆ తరువాత అప్లై చేసేవాటి సుగుణాలు స్కిన్ కి రీచ్ అయ్యేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. క్లెన్సింగ్ వల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి. జెంటిల్ నాన్ ఆల్కహాలిక్ టోనర్స్ తో పోర్స్ క్లోజ్ అవుతాయి. స్కిన్ మృదువుగా మారుతుంది. 3. ఎసెన్స్: కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎసెన్స్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సెరమ్స్ కు తక్కువ కాన్సన్ట్రేటెడ్ వెర్షన్ గా ఎసెన్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇవి లైట్ వెయిట్ గా ఉంటాయి. నీళ్లలా ఉంటాయి. పిగ్మెంటేషన్ అలాగే స్కిన్ రెడ్ నెస్ వంటి సమస్యలకు పరిష్కారంగా వీటిని వాడతారు. ఏ ఎసెన్స్ కైనా మెయిన్ ఇంగ్రిడియెంట్ వాటర్ అనే చెప్పుకోవాలి. ఇదే కొరియన్ స్కిన్ బ్యూటీలో ముఖ్యమైన స్టెప్. 4. సెరమ్: ఈ పాయింట్ వద్ద స్కిన్ కేర్ రొటీన్ సీరియస్ గా మారుతుంది. సెరమ్ స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది. అదే సమయంలో స్కిన్ టోన్ ను కూడా ఈవెన్ గా మారుస్తుంది. ఫైన్ లైన్స్ ను తగ్గిస్తుంది. స్కిన్ పై మాయిశ్చర్ ను రోజంతా బాలన్స్ చేస్తుంది. మాయిశ్చర్ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్న సెరమ్ ని వాడండి. వాటిలో హ్యాలురోనిక్ యాసిడ్ మరియు విటమిన్ ఈ ఉండేలా చూసుకోవాలి. 5. మాయిశ్చరైజర్: మాయిశ్చరైజింగ్ అనేది ముఖ్యమైన స్కిన్ కేర్ యాక్టివిటీ. దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు. ఐతే, ల్యూమినెసెంట్ లుక్ కోసం ట్రై చేస్తున్నట్టయితే లైట్ వెయిట్ గా ఉంటూ మ్యాగ్జిమమ్ మాయిశ్చర్ ని ఇచ్చే ప్రోడక్ట్స్ ను వాడాలి. కొన్నిసార్లు, రోజంతా స్కిన్ ను హైడ్రేటెడ్ గా ఉంచడం స్కిన్ కేర్ రొటీన్ ముఖ్య ఉద్దేశ్యం. మీ స్కిన్ టైప్ కు తగిన మాయిశ్చరైజర్ ను వాడడం అవసరం. దానివల్ల బ్రేకవుట్స్ వంటి సమస్యలు రావు. స్కిన్ ప్రశాంతంగా ఉంటుంది. 6. ఐ క్రీమ్: గ్లాస్ స్కిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఒక్క రోజులో రిజల్ట్ వచ్చేస్తుందని అనుకోకూడదు. కొంచెం సమయం పడుతుంది. ముఖ్యంగా కంటి కింద డ్రై ప్యాచెస్ అలాగే ఐ బ్యాగ్స్ ఉంటే గ్లాస్ స్కిన్ లుక్ ను అచీవ్ చేయలేరు. ఐ క్రీమ్ లేదా సెరమ్ ను వాడి ఐ ఏరియాను నరిష్ చేయాలి. ఎందుకంటే కంటి చుట్టూ ఉన్న ప్రాంతం ముఖంలోని మిగతాది ప్రదేశాల కంటే సెన్సిటివ్ గా ఉంటుంది. 7. మాస్క్ : కొరియన్ బ్యూటీ అనేది ఎన్నో స్కిన్ కేర్ టిప్స్ మరియు ట్రిక్స్ ను అందిస్తుంది. ఐతే, ప్రస్తుతం ప్రపంచంలోని బ్యూటీ పై ఫోకస్ పెట్టేవారందరూ ఫేస్ ప్యాక్స్ పై మోజు చూపిస్తున్నారు. నిజానికి, ఫేస్ ప్యాక్స్ తో అలసిన చర్మం జీవాన్ని తెచ్చుకుంటుంది. మాయిశ్చర్ ను తిరిగి భర్తీ చేసుకుంటుంది. కాబట్టి, మీ స్కిన్ కు ఎటెన్షన్ ను అందించండి. ఇవి కొరియన్ గ్లాస్ స్కిన్ రోటీన్ స్టెప్స్. ఇప్పుడు మనం ఎమల్షన్ గురించి తెలుసుకుందాం. ఎమల్షన్ అంటే ఏంటి? ఎమల్షన్ అంటే రెండు ద్రవపదార్థాలు కలిపే ప్రాసెస్. సాధారణంగా ఈ రెండూ కూడా వాటంతట అవి బ్లెండ్ అవ్వవు. మాయిశ్చర్ లాగానే ఎమల్షన్ నుంచి బెనిఫిట్స్ అందుతాయి. ఐతే, ఎమల్షన్ అనేది టెక్స్చర్ అలాగే ఫార్ములాలో తేలిగ్గా ఉంటుంది. ఐతే, మాయిశ్చర్ అందించే బెనిఫిట్స్ నే అందిస్తుంది. అంటే హైడ్రేషన్ ను లాక్ చేయడం స్కిన్ పై డ్రైనెస్ ఉండకుండా చేయడం వంటివన్నమాట. ఐతే, దీని అప్లికేషన్ అనేది ఒక స్టెప్ కాదు. రెండు స్టెప్స్ మధ్య వచ్చే ప్రాసెస్ ఇది. సెరమ్ అలాగే మాయిశ్చర్ అప్లికేషన్ మధ్య దీనిని వాడతారు. సెరమ్ అంత చిక్కగా ఉండదు అలాగే మాయిశ్చర్ కంటే లైటర్ గా ఉంటుంది కాబట్టి దీన్ని సెరమ్ తరువాత అప్లై చేసి మాయిశ్చర్ కంటే ముందు వాడతారు. ఎమల్షన్స్ ప్రతి స్కిన్ టైప్ కు సూట్ అవుతాయి. ఎక్కువగా పింపుల్స్ సమస్య ఎదురయ్యే ఆయిలీ స్కిన్ పై బాగా వర్క్ చేస్తాయి. ఇది హైడ్రేషన్ ను ఇన్స్టెంట్ గా అందిస్తుంది. కాంబినేషన్ అలాగే డ్రై స్కిన్ కలిగినవారు కూడా హైడ్రేషన్ బెనిఫిట్స్ ను దీనివల్ల పొందుతారు. ఈ ఎమల్షన్ ను ముఖంపై కొన్ని పాయింట్స్ పై వాడవచ్చు. కాంబినేషన్ స్కిన్ కలిగిన వారు ఆయిలీగా ఉన్న టీ జోన్ పై వాడవచ్చు. నార్మల్ స్కిన్ కలిగిన వారు బేసిక్ ఎమల్షన్ ను వాడవచ్చు. అందులో హ్యాలురోనిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే, లోపల నుంచి స్కిన్ గ్లో అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు ఎమల్షన్ ను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎమల్షన్ ప్రాముఖ్యత అర్థమైందా? మీ స్కిన్ టైప్ ఏంటి? ఎమల్షన్ ను మీ బ్యూటీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకున్నారా?


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3bhllPE

Saturday, 29 August 2020

ఈ ఈజీ హెయిర్ మాస్క్‌తో మీ జుట్టు బలంగా పెరుగుతుంది..

వీకెండ్స్ టైం లో స్కిన్ కేర్, హెయిర్ కేర్ మీద ఎక్కువ సమయం కేటాయించి రిఫ్రెష్ అవ్వడానికి వీలు కుదురుతుంది. ఫేస్ పాక్స్, హెయిర్ మాస్క్స్, బాడీ కేర్... వీటిని ఎంజాయ్ చేయడానికి సరైన టైం వీకెండే. ఈ సారి మీరు ట్రై చేయడానికి మీకు ఒక పరిచయం చేస్తున్నాం. ట్రై చేసి చూడండి. జుట్టు బాగా ఒత్తుగా షైనీ గా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, డాండ్రఫ్ వంటివి సామాన్యం గా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే. ఇవేమీ మ్యానేజ్ చేయలేని ప్రాబ్లంస్ కావు. అయితే, ఈ రెమిడీస్ కి చాలా టైం పట్టేస్తుంది అనుకుంటే మీ కోసం ఇక్కడొక సింపుల్ హెయిర్ మాస్క్ ఉంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీనే. అంతే, కాదు హెయిర్ కేర్ కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా మీతో పంచుకుంటున్నాం. అవేమిటో చదివేయండి మరి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు: * కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు * పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు * మూడు, నాలుగు - విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ (మీ జుట్టు పొడవుని బట్టి) హెయిర్ మాస్క్ వేసే పద్ధతి * ఒక బౌల్ తీసుకుని అందులో పదార్ధాలన్నీ వేసి జాగ్రత్తగా కలపండి. * ఈ పేస్ట్ ని డైరెక్ట్ గా స్కాల్ప్ కి అప్లై చేసి పది, పహిహేను నిమిషాలు మసాజ్ చేయండి. * ఒక షవర్ కాప్ పెట్టుకుని రాత్రంతా అలా వదిలేయండి. షవర్ కాప్ అందుబాటులో లేకపోతే మెత్తటి టవల్ చుట్టి నిద్రపోండి. * తెల్లవారిన తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేసి కండిషనర్ అప్లై చేయండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల లాభాలేమిటి? జుట్టు కుదుళ్ళు బలంగా ఉండాలంటే వాటికి కొబ్బరి నూనె తాలూకు పోషణ కంపల్సరీ. అప్పుడే జుట్టు ఒత్తుగా షైనీ గా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ నీ, జుట్టు పల్చబడడాన్నీ కూడా తగ్గిస్తుంది. దీన్ని పెరుగుతో కలపడం వల్ల స్కాల్ప్ కూల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. ఇక, విటమిన్ ఈ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. మనందరికీ హెయిర్ వాష్ ఎలా చేయాలో తెలుసు. ముందు ఆయిల్ మసాజ్, తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం, ఆ తరువాత కండిషనర్ అప్లై చేయడం, మళ్ళీ నీటితో హెయిర్ వాష్ చేసుకోవడం. అయితే, దీన్ని రివర్స్ చేసే ప్రాసెస్ కూడా ఒకటి ఉంది. దాన్నే రివర్స్ హెయిర్ వాష్ అంటారు. ఇందులో ముందు హెయిర్ కండిషన్ చేశాక షాంపూ చేస్తారు. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తున్నా కూడా జుట్టు నిర్జీవం గా కనపడే వారికి ఈ రివర్స్ హెయిర్ వాష్ బెస్ట్ ఆప్షన్. ముందే చెప్పినట్లుగా ఈ పద్ధతిలో ముందు కండిషనర్ అప్లై చేయాలి. అయితే, స్కాల్ప్ కి మాత్రం కండిషనర్ అప్లై చేయకూడదు. కేవలం జుట్టుకి మాత్రమే ఇలా చేయాలి. చేసిన తరువాత మొత్తం వాష్ చేసేయకుండా కేవలం కొద్ది గా వాటర్ మాత్రం చల్లి ఇంక షాంపూ చేసేసుకోండి. బాగా నురగ వచ్చేలా చేసి మీ తలస్నానాన్ని ఎంజాయ్ చేయండి. కొంత మందికి కండిషనర్ వాడడం ఇష్టముండదు. జుట్టు బరువుగా ఉంటుంది అంటారు వీరు. ఈ టెక్నిక్ తో మీ హెయిర్ హెల్దీ గా, లైవ్లీ గా కనపడుతుంది. ఒక్కొక్కసారి హడావిడిలో కండిషనర్ అప్లై చేశాక కంప్లీట్ గా దాన్ని వాష్ చేయకపోతే కండిషనర్ జుట్టు మీద ఉండిపోతుంది. ఈ టెక్నిక్ తో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే, ఇక్కడ కండిషన్ చేశాక షాంపూ చేస్తున్నారు కదా; దాంతో పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి మరి. ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ చేస్తే మంచిదా, లేదా నైట్ చేయాలా అని సందేహం కూడా రావచ్చు. అసలు హెయిర్ వాష్ ఎప్పుడు చేయాలి, పొద్దున్నా, సాయంత్రమా? పొద్దున్న తొందరగా ఆరుతుంది, సాయంత్రమైతే తీరుబడిగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఏది మంచిదో చూద్దాం రండి. రాత్రి పూట హెయిర్ వాష్ చేసుకుంటే నాచురల్ గా జుట్టు ఆరబెట్టుకోడానికి వీలుంటుంది. అదే పొద్దున్నైతే అంత టైం ఉండదు కాబట్టి హీటింగ్ టూల్స్ వాడాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఇలా హీటింగ్ టూల్స్ వాడడం మంచిది కాదు, అందుకే రాత్రి పూటే హెయిర్ వాష్ చేసుకోవడం మంచిది అని కొంత మంది అంటారు. రాత్రి హెయిర్ వాష్ చేస్తే ఎక్కువ సేపు తడిగా ఉంటుంది. తడి జుట్టు తో నిద్ర పోతే హెయిర్ కీ, హెల్త్ కీ కూడా మంచిది కాదు అని ఇంకొంత మంది అంటారు. ఒక్కొక్కరి జుట్టూ ఒక్కో తీరులో ఉంటుంది. మీ హెయిర్ కి ఏది సరిపోతుందో మీకే తెలుస్తుంది. అయితే, పొద్దున వాష్ చేస్తే జుట్టు నాచురల్ గా ఆరడానికి టైం ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవాలి. రాత్రి హెయిర్ వాష్ చేస్తే జుట్టు ఆరాక, చిక్కు తీసుకుని, ప్రాపర్ గా జుట్టు ని టై చేసుకుని అప్పుడు నిద్రకి ఉపక్రమించాలి. వారం లో ఒక సారి పొద్దూన్నా, ఒక సారి రాత్రీ హెయిర్ వాష్ చేస్తే మీకే తెలుస్తుంది, మీ హెయిర్ కి ఏది బాగా సూట్ అవుతుందో.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/34Ljrps

ఐబ్రోస్ ఒత్తుగా, నల్లగా మారాలంటే ఇలా చేయండి చాలు..

కళ్ళను మరింత అందంగా హైలైట్ చేయడానికి ఐ బ్రోస్ ఎంతో హెల్ప్ చేస్తాయి. కాబట్టి, ఐ బ్రోస్ గురించి కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఐ బ్రోస్ ను ఇంపార్టెంట్ ఫేషియల్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్స్ కు అలాగే ఎక్స్ప్రెషన్స్ లో ఐ బ్రోస్ గొప్ప రోల్ ప్లే చేస్తాయి. ఈ ఐబ్రోస్ అనేవి మీ లుక్ ను ఎలివేట్ చేయడానికి ఎంత హెల్ప్ చేస్తాయో వీటి గురించి శ్రద్ధ తీసుకోకపోతే లుక్ ను పాడుచేస్తాయి. ఐబ్రోస్ ను రెగ్యులర్ గా ట్రిమ్ చేసుకోవాలి. అలాగే, షేప్ చేసుకోవాలి. కాఫీ: మీ ఐబ్రోస్ లైట్ కలర్ లో ఉన్నట్టయితే వాటికి డార్క్ లుక్ ఇవ్వడానికి కాఫీ టింట్ హెల్ప్ చేస్తుంది. కాఫీ పౌడర్ అనేది ఐబ్రోస్ కు బ్రౌనర్ షేడ్ ను ఇస్తుంది. కాఫీపౌడర్ అలాగే పెట్రోలియం జెల్లీను తీసుకోండి. కాస్తంత కొబ్బరినూనె కూడా అవసరం. వీటన్నిటినీ బౌల్ లో బాగా కలపండి. థిక్ జెల్ గా అయ్యేవరకు కలపండి. ఇప్పుడు ఇంకో కంటైనర్ లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసి గంటపాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి. ఐబ్రోకు డార్క్నెస్ ను ఇచ్చే సొల్యూషన్ రెడీ ఐపోయినట్టే. ఇప్పుడు దీన్ని అప్లికేటర్ సహాయంతో ఐబ్రోస్ హెయిర్ పై అప్లై చేయండి. హెన్నా హెన్నాతో కూడా ఐబ్రోస్ ను హైలైట్ చేసుకోవచ్చు. కొంతమంది జెట్ బ్లాక్ కలర్ ను ప్రిఫర్ చేయకపోతే నేచురల్ బ్లాక్ షేడ్ కోసం హెన్నాను ప్రిఫర్ చేస్తారు. హెన్నా వల్ల ఐబ్రోస్ థిక్ గా కనిపిస్తాయి. ఈ రెమెడీ కోసం హెన్నాపౌడర్ తో పాటు కొంత నిమ్మరసం అవసరమవుతుంది. 10 నుంచి 15 రోజులవరకు దట్టమైన ఐబ్రో లుక్ ను అందించేందుకు ఈ రెండు పదార్థాలు హెల్ప్ చేస్తాయి. ఆ తరువాత మీరు మళ్ళీ ప్రాసెస్ ను రిపీట్ చేయాలి. రెండు టీస్పూన్స్ హెన్నాను ఒక బౌల్ లో కలపాలి. ఆ తరువాత కొన్ని చుక్కల నిమ్మరసాన్ని మిక్స్ చేయాలి. పేస్ట్ ను తయారుచేయాలి. ఐబ్రోస్ పై అప్లై చేయాలి. నలభై నిమిషాల తరువాత వాష్ చేయాలి. హెన్నా స్కిన్ పై మరకలు కలిగించకుండా ఉండాలంటే ఐబ్రో ఏరియా చుట్టూ టేప్ తో కవర్ చేయండి. ఐ బ్రోస్ పేస్ట్ ను వాచ్ చేసేశాక ఈ టేప్ ను రిమూవ్ చేయండి. యాక్టివేటెడ్ చార్కోల్: ఐబ్రోస్ ను మరింత దట్టంగా మార్చేందుకు ఇది ఒక ప్రభావవంతమైన ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. మీకు కావాల్సినదల్లా చార్కోల్ క్యాప్సూల్. అలాగే కొంత కోకో పౌడర్. అలోవెరా జెల్ కూడా అవసరమే. యాక్టివేటెడ్ చార్కోల్ క్యాప్సూల్ ను ఒక బౌల్ లోకి తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ కోకో పౌడర్ అలాగే ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ను తీసుకోండి. దట్టంగా పేస్ట్ లా మార్చండి. వీటిని ఒక బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయండి. ఇది కొన్నివారాల వరకు అలాగే ఉంటుంది. ఈ సమయంలో దీన్ని కనీసం ఐదు సార్లు వాడవచ్చు. నేచురల్ రెమెడీస్ఐబ్రోస్ దట్టంగా మారేందుకు కొన్ని రెమెడీస్ ను పాటించవచ్చు. అవేంటంటే...1. క్యాస్టర్ ఆయిల్: ఇది పాత పద్దతే. కానీ ఎంతో ప్రభావవంతమైనది. ఐబ్రోస్ థిక్ గా మారేందుకు హెల్ప్ చేస్తుందిది. ఇందులో ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే మినరల్స్ లభిస్తాయి. హెయిర్ ఫాలికల్స్ కు పోషకాలనిస్తాయి. ఐబ్రోస్ రూట్స్ కి క్యాస్టర్ ఆయిల్ ను ప్రతిరోజూ అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. దాంతో, ఐబ్రోస్ థిక్ గా అలాగే స్ట్రాంగ్ గా మారతాయి. కొన్నిచుక్కల క్యాస్టర్ ఆయిల్ ను తీసుకుని ఐబ్రోస్ పై ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి. ముప్పై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత మేకప్ రిమూవర్ తో తుడిచేయాలి. వెచ్చటినీళ్లతో ఫేస్ ను వాష్ చేసుకోవాలి. ఐతే, క్యాస్టర్ ఆయిల్ ను వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 2. కొబ్బరినూనె: కొబ్బరినూనె కండిషనర్ గా అలాగే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. ప్రతి రోజూ కొబ్బరినూనెను ఐబ్రోస్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్ స్ వస్తాయి. వారంలో ఒకటి రెండు సార్లు వాడినా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. దూదిని తీసుకుని కొబ్బరినూనెలో ముంచి దాంతో ఐబ్రోస్ పై ఆయిల్ ను అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఫేస్ ను వాష్ చేసుకోవాలి. 3. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ మరియు ఈ ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ కు హెల్ప్ చేస్తాయి. ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ ను ఫింగర్ టిప్స్ పై పోసి జెంటిల్ గా ఐబ్రోస్ పై మసాజ్ చేయాలి. రెండు గంటల తరువాత వాష్ చేసుకోవాలి. ఇలా రోజులో ఒక్కసారి చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. సరైన ఐబ్రో షేప్ అనేది ఐస్ ను సరిగ్గా ప్రెజంట్ చేయగలవు. మీకు సూట్ అయ్యే షేప్ కాకుండా వేరే ఎదో షేప్ ను మీరు కన్సిడర్ చేస్తే మీ వయసుకంటే ఎక్కువ వయసు కనిపించే అవకాశం ఉంది. అలాగే, కోపంతో పాటు అలసట కలిగిన లుక్ వస్తుంది. ఐతే, ప్రత్యేకంగా ఇదే రైట్ షేప్ అని ఏదీ లేదు. ముఖానికి, అలాగే ఐ షేప్ కు తగినట్టుగా ఐబ్రోస్ ను షేప్ చేసుకోవాలి. ఐబ్రోస్ థిక్నెస్ కూడా మీ లుక్ ను ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొంతమంది తమ ఐబ్రోస్ ను థిక్ గా ఉంచుకోవడాన్ని ప్రిఫర్ చేస్తారు. టైమ్ టు టైమ్ షేప్ చేసుకుంటారు. హెయిర్ గ్రోత్ కూడా కొంచెం దట్టంగా ఉండేలా చూసుకుంటారు. సెలూన్ లో రైట్ టూల్స్ తో ప్రొఫెషనల్స్ హెల్ప్ తో ఈ రిజల్ట్ వస్తుంది. ఐతే, ఇంట్లో కూడా థిక్ లుకింగ్ ఐబ్రో లుక్ ను సొంతం చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కొన్ని టెక్నీక్స్ పై ఫోకస్ పెట్టడం. మరి అవేంటో తెలుసుకుందామా .. ఇలా ఇంట్లోనే ఐబ్రోస్ గురించి కేర్ తీసుకుంటే ఐబ్రోస్ మీ ఫేషియల్ ఫీచర్స్ ను బాగా ఎలివేట్ చేస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2EGIJdg

Monday, 24 August 2020

కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే జట్టు రాలడం తగ్గి.. బాగా పెరుగుతుంది..

హెయిర్ ఫాల్ సమస్య ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. మనలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. అనేక రెమెడీస్ ను ట్రై చేస్తాం. అలాగే వివిధ ఖరీదైన హెయిర్ ప్యాక్స్ ను పాటిస్తాం. హెయిర్ ఫాల్ ను ట్రీట్ చేయడానికి పోషకవిలువలున్న ఆహారం హెల్ప్ చేస్తుందన్న విషయం వాస్తవమే. ఐతే, కొన్ని సార్లు ఈ ఇష్యూ అనేది కుదుళ్ళ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా ఉండేలా కేర్ తీసుకోవాలి. అందుకు ముఖ్యమైన విధానం ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ ను అప్లై చేయడం. ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెమెడీ మీకు ఎంతో హెల్ప్ చేస్తాయి. కావలసిన పదార్థాలు:
  • కొబ్బరినూనె - 2 కప్పులు
  • నువ్వుల నూనె - 1/2 కప్పు
  • క్యాస్టర్ ఆయిల్ - 1/2 కప్పు
  • గుప్పెడు కరివేపాకు
  • ఆమ్లాను కూడా కలపొచ్చు
  • 1 టేబుల్ - మెంతి గింజలు
  • మందార పూలు - 3 నుంచి నాలుగు
  • మందారాకులు - గుప్పెడు
తయారుచేసే విధానం: 1. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపి ఈ మిశ్రమం డార్క్ కలర్ లోకి మారేవరకూ బాయిల్ చేయండి. 2. స్టవ్ ను ఆఫ్ చేసేయండి. 3. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఆ తరువాత గ్లాస్ కంటైనర్ లోకి తీసుకోండి. అప్లై చేసే విధానం ఈ ఆయిల్ ను వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు. రోజూ అప్లై చేసుకున్నా పరవాలేదు. హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టే ఈ పదార్థాల పవర్ ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొబ్బరి నూనె: అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ కు ఒకే ఒక్క సొల్యూషన్ కొబ్బరి నూనె అని చెప్పుకోవచ్చు. జుట్టు పలచనవడం, హెయిర్ ఫాల్ అలాగే డ్రై స్కాల్ప్, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం మాత్రం కొబ్బరి నూనె అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ కు వన్ స్టాప్ సొల్యూషన్ కావచ్చు. కానీ, హెయిర్ ఫాల్ ను తగ్గించడంలో మాత్రం ఇది ఎంతో ప్రత్యేకం. కొబ్బరి నూనె హెయిర్ ఫాల్ ను నిరోధించి హెయిర్ గ్రోత్ హెల్తీగా ఉండేందుకు సపోర్ట్ చేస్తుంది. కొబ్బరి నూనె శరీరం ఉత్పత్తి చేసే నూనెలలాగానే ఉంటుంది. నేచురల్ ఆయిల్ లాగానే స్కాల్ప్ ను పొడిబారకుండా చేస్తుంది. హెయిర్ రూట్స్ ను డేమేజ్ నుంచి రక్షిస్తుంది. 2. నువ్వుల నూనె: రీసెంట్ స్టడీస్ ప్రకారం హెయిర్ ఫాల్ కు నువ్వులనూనె ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. బట్టతలను ప్రివెంట్ చేసే మినాక్సిడిల్ వంటి మెడిసిన్స్ తో సరిసమానంగా నువ్వులనూనె పనిచేస్తుంది. హెయిర్ ను నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో, హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. ఇంకా ఈ నూనె రిలాక్సింగ్ ఆయిల్ లా పనిచేస్తుంది. కాబట్టి, నువ్వులనూనెతో తలను మసాజ్ చేస్తే యాంగ్జైటీ వంటి సమస్యలు తగ్గుతాయి. వాటితో అనుసంధానమై ఉన్న హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మైగ్రైన్ అలాగే ఇన్సోమ్నియాకు ఇది మంచి రెమెడీ. 3. క్యాస్టర్ ఆయిల్: క్యాస్టర్ ఆయిల్ తో మసాజ్ చేస్తే రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి. ప్రపంచవ్యాప్తంగా హెయిర్ ఫాల్ సమస్యతో సతమతమవుతున్నారు. కాబట్టి, పవర్ ఫుల్ రెమెడీస్ లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న క్యాస్టర్ ఆయిల్ రెమెడీ ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. క్యాస్టర్ ఆయిల్ ను తలపై వారానికి ఒకసారి అప్లై చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ను పొందవచ్చు. ఇంకొంక ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే డ్రై స్కాల్ప్ కి కూడా ఇది మంచి మందు. 4. కరివేపాకు: కరివేపాకే కదా అని కొట్టిపారేయకండి. ఇది హెయిర్ కేర్ కు తోడ్పడే పవర్ఫుల్ ఇంగ్రిడియెంట్. హెయిర్ కేర్ రొటీన్ లో కరివేపాకును కూడా భాగం చేసుకుంటే అద్భుతాలు కనిపిస్తాయి. హెయిర్ ప్రాబ్లెమ్స్ దాదాపు తొలగిపోతాయి. దుమ్ము ధూళి కుదుళ్ళలో ఇరుక్కుపోవడంతో రూట్స్ బలహీనపడతాయి, దాంతో దురద అలాగే డాండ్రఫ్ తలెత్తి హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ అలాగే ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తాయి. కరివేపాకు లాభాలను పొందేందుకే మనం ఈ ఇంగ్రిడియెంట్ ను ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారీలో వాడాము. 5. ఆమ్లా: ఆమ్లా ఆయిల్ లో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. హెయిర్ లాస్ తో పాటు డాండ్రఫ్ ను తొలగించేందుకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. హెయిర్ హెల్త్ ను కాపాడేందుకు హెల్ప్ చేసే నేచురల్ ఆయిల్ ఇది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ సమస్యను తగ్గించడంతో పాటు హెయిర్ ఫాల్ కు కూడా ఈ ఆయిల్ చెక్ పెడుతుంది. హెయిర్ ఫాల్ కు ట్రీట్మెంట్ గా ఆమ్లా ఆయిల్ ను వాడితే ప్రయోజనం ఉంటుంది. అందుకే, మనం ఈరోజు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ లో ఆమ్లాను కూడా యాడ్ చేసాము. 6. మెంతి గింజలు: హెయిర్ ఫాల్ ఇష్యూస్ ను సాల్వ్ చేసేందుకు మెంతులనేవి ఎఫెక్టివ్ రెమెడీగా పనిచేస్తాయి. హెయిర్ బాల్డ్ నెస్ అలాగే హెయిర్ తిన్నింగ్ ప్రాబ్లెమ్ ను అరికట్టేందుకు మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, హెయిర్ ఫాల్ కి సంబంధించిన హోమ్ రెమెడీస్ లో మెంతులను ఎక్కువగా వాడతారు. మెంతులలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ కే మరియు విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి పొటాషియం, కేల్షియం మరియు ఐరన్ వంటి మినరల్స్ కు స్టోర్ హౌస్ లా పనిచేస్తాయి. స్కాల్ప్ కు పోషణను అందించేందుకు అలాగే హెయిర్ గ్రోత్ ను పెంపొందించేందుకు ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి. 7. మందార పూలు మరియు ఆకులు: మందార పూలు మరియు ఆకుల విషయానికి వస్తే ఇవి రెండూ హెయిర్ కు తగినంత పోషణనివ్వడంలో తమదైన పాత్ర పోషిస్తాయి. అందుకే, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ లో వీటిని కూడా కలిపాము ఇంకెందుకాలస్యం, ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తో హెయిర్ ఫాల్ ఇష్యూను తరిమేయండి మరి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3gnWJWB

Friday, 21 August 2020

కాలి పగుళ్ళని తగ్గించే ఇంటి చిట్కాలివే..

ఎక్కువ సేపు వేడి నీళ్ళతో స్నానం చేయడం, హార్ష్ గా ఉండే సోప్స్, క్రీంస్ యూజ్ చేయడం, మరీ వేడీగా లేదా మరీ చల్లగా ఉండే వాతావరణం వంటివి పాదాల పగుళ్ళకి దారి తీస్తాయి. కావలసినంత నీరు తాగకపోవడం వలన కూడా ఈ సమస్య వస్తుంది. డయాబెటీస్, పోషకాహార లేమి, ఒబేసిటీ వంటివి కూడా పాదాల పగుళ్ళకి దారి తీస్తాయి. కొబ్బరి నూనె, లేదా వాజలీన్ పట్టించండం జనరల్ గా అందరం ఫాలో అయ్యే పద్ధతులు. కానీ, కిచెన్ లోనే ఉండే ఇంకొన్ని ఇంగ్రేకడియెంట్స్ తో ఈ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేయవచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం. ముందుగా పాదాల వద్దనున్న డెడ్ సెల్స్ ని స్క్రబ్ చేయాలి. దీనికోసం వేడినీటిలో కొంత సోప్ వేసి, ఆ నీటిలో మీ పాదాలు మునిగేటట్లుగా ఉంచండి. మీకు సరిపడే వేడిలో ఉన్న నీరు తీసుకోవడం మర్చిపోకండి. స్కిన్ కొంత సాఫ్ట్ గా అయ్యాక ప్యుమిస్ స్టోన్ తో స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఈ పని రాత్రి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఈ సమస్యకి చెక్ పెట్టచ్చో చూద్దాం. 1. తేనె మీరు స్క్రబ్ చేయడం కోసం పెట్టుకున్న నీటిలో కొంత తేనె కూడా వేసి ఇరవై నిమిషాలు ఉంచి స్క్రబ్ చేయండి. ఆ తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. 2. కోకోనట్ ఆయిల్ మీరు పాదాలని వేడి నీటిలో ఉంచి స్క్రబ్ చేసిన తరువాత పాదాలకి కొబ్బరినూనె బాగా పట్టించి క్లీన్ కాటన్ సాక్స్ వేసుకోండి. పొద్దున్న సాక్స్ తీసేసి పాదాలని నార్మల్ గా వాష్ చేసుకోండి. ఇలాగే వెజిటబుల్ ఆయిల్ తో కూడా చేయవచ్చు. 3. నువ్వుల నూనె మీరు పాదాలను ఉంచే వేడి నీటిలోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి పాదాలు పది నిమిషాలు సోక్ చేయండి. మీ పాదాలకి ఉన్న పగుళ్ళు మరీ డీప్ గా ఉంటే ముందు వాటికి కొంచెం నువ్వుల నూనె పట్టించి అప్పుడు సోక్ చేయండి. 4. ఎప్సం సాల్ట్ మీరు పాదాలను ఉంచే వేడి నీటిలో అర కప్పు ఎప్సం సాల్ట్ వేసి పది నిమిషాలు సోక్ చేసి అప్పుడు ప్యుమిస్ స్టోన్ తో స్క్రబ్ చేయండి. 5. సాల్ట్, గ్లిసరిన్, రోజ్ వాటర్ వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ల గ్లిసరిన్, రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ వేయండి. పదిహేను నిమిషాలు పాదాలు ఇందులో సోక్ చేసిన తరువాత స్క్రబ్ చేసేయండి. 6. అవకాడో, బనానా ఒక పండిన అరటి పండులో సగం అవకాడో గుజ్జు ని కలిపి ఆ పేస్ట్ ని పాదాలకి పట్టించండి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. 7. బియ్యప్పిండి, తేనె రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో ఒక టీ స్పూన్ తేనె, మూడు నాలుగు చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ వేసి పేస్ట్ లా చేయండి. మీ పాదాలు మరీ డ్రై గా ఉంటే ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కానీ కూడా కలుపుకోవచ్చు. వేడి నీటిలో పదినిమిషాలు పాదాలను సోక్ చేసిన తరువాత ఈ పేస్ట్ తో స్క్రబ్ చేయండి. 8. అలోవెరా వేడి నీటిలో మీ పాదాలను పది నిమిషాలు సోక్ చేసిన తరువాత మెత్తటి బట్ట తో అద్ది అలోవెరా జెల్ ని అప్లై చేయండి. సాక్స్ వేసుకుని రాత్రంతా అలా వదిలేయండి. 9. టీ ట్రీ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ తీసుకోండి. ఇందులో ఐదారు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. వేడి నీటిలో పాదాలను సోక్ చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకి పట్టించి సాక్స్ వేసుకుని రాత్రంతా అలా వదిలేయండి. టీ ట్రీ ఆయిల్ ని డైరెక్ట్ గా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. 10. షియా బటర్ వేడి నీటిలో పాదాలను సోక్ చేసి మెత్తటి బట్టతో అద్దిన తరువాత షియా బటర్ ని పాదాలకి పట్టించి బాగా మసాజ్ చేయండి. సాక్స్ వేసుకుని రాత్రంతా అలా వదిలేయండి. 11. ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి లో నాలుగైదు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. ఈ పేస్ట్ ని పాదాలకి పట్టించి అర గంట పాటూ అలా వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తటి బట్ట తో అద్దండి. 12. విటమిన్ ఈ ఆయిల్ నాలుగైదు విటమిన్ ఈ కాప్స్యూల్స్ కి చిన్న రంధ్రం పెట్టి అందులో ఉన్న ఆయిల్ ని ఒక బౌల్ లోకి తీసుకోండి. పగుళ్ళు ఉన్న చోట ఈ ఆయిల్ పట్టించి ఒకటి రెండు నిమిషాలు మసాజ్ చేయండి. ఈ సమస్య తగ్గిన తరువాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మళ్ళీ పాదాల పగుళ్ళు మీ దరికి చేరకుండా చూసుకోవచ్చు. అవేమిటో చూడండి. 1. నీరు బాగా తాగండి. 2. ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు నిలబడకండి. 3. పాడెడ్ సాక్స్ వేసుకోవడం కొంత ఉపయోగకరంగా ఉంటుంది. 4. వారానికి రెండు సార్లైనా ప్యుమిస్ స్టోన్ తో పాదాలను స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ ఏర్పడకుండా ఉంటుంది. 5. రాత్రి మాయిశ్చరైజర్ అప్లై చేసి కాటన్ సాక్స్ వేసుకోవడం కూడా మంచి ఆప్షనే. 6. కంఫర్టబుల్ ఫుట్ వేర్ చాలా హెల్ప్ చేస్తుందని గుర్తు పెట్టుకోండి. 7. మరీ ఎక్కువ సేపు నడిచిన రోజున కంపల్సరీ గా వేడి నీటిలో కొంచెం ఉప్పు కానీ, నిమ్మ రసం కానీ వేసి అందులో పాదాలను సోక్ చేయడం మర్చిపోకండి. 8. పాదాలకి కూడా విశ్రాంతినివ్వాలని గుర్తు పెట్టుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2YppV9p

జుట్టు చివర్లు చిట్లి పోతున్నాయా.. ఇలా చేయండి..

స్ప్లిట్ ఎండ్స్ ఎలా వస్తాయంటే... ఒకప్పుడు జలపాతం లా ఉరికే మీ జుట్టు ఇప్పుడు నిర్జీవం గా కళ లేకుండా కనిపిస్తోందా? జుట్టులో తేమ లేకుండా అయిపోతోందా? అయితే, మీ జుట్టు చివర్లో చిట్లిపోతోందని అర్ధం. పొల్యూషన్ వల్ల స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి కానీ, అది ఒక్కటే కారణం కాదు. హెయిర్‌ని ట్రీట్ చేస్తున్న పద్ధతిని బట్టి కూడా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న రీజన్స్ లో మీరు రిలేట్ అయ్యేదేదైనా ఉందేమో చెక్ చేసుకోండి. 1. జుట్టు బాగా పొడి గా ఉన్నప్పుడు చిక్కు తీయడం 2. జుట్టు బాగా తడి గా ఉన్నప్పుడు చిక్కు తీయడం 3. హెయిర్ కవర్ చేసుకోకుండా ఎండలోకి వెళ్ళటం 4. హెయిర్ స్టైలింగ్ టూల్స్ ని ఎక్కువగా వాడడం 5. హెయిర్ రెగ్యులర్ గా ట్రిం చేసుకోకపోవడం 6. హెయిర్ రెగ్యులర్ గా కండిషన్ చేయకపోవడం 7. రోజూ హెయిర్ వాష్ చేయడం 8. హెయిర్ ని కెమికల్ ట్రీట్మెంట్ కి గురి చేయడం 9. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడడం 10. అన్ హెల్ది డైట్ తీసుకోవడం స్ప్లిట్ ఎండ్స్ ని ఎందుకు ట్రిమ్ చేయాలి? స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేయకుండా ఉండడం మంచిది కాదు. ఎందుకో చూడండి. 1. స్ప్లిట్ ఎండ్స్ వాటంతటవే మాయమైపోవు. స్ప్లిట్ ఎండ్స్ ని రెగ్యులర్ గా ట్రిమ్ చేయకపోతే అవి ఫెదర్స్ గా స్ప్లిట్ అవుతాయి. ఇది హెయిర్ గ్రోత్ ని అడ్డుకుంటుంది. 2. స్ప్లిట్ ఎండ్స్ ఒక కలర్ లో, మామూలు హెయిర్ ఒక కలర్ లో ఉంటాయి. సో, కేర్ తీసుకోకపోతే హెయిర్ కలర్ అన్ ఈవెన్ గా కనపడుతుంది. 3. జుట్టు కి సహజం గా ఉండే గ్లో స్ప్లిట్ ఎండ్స్ వల్ల పోతుంది. ఎన్ని హెయిర్ మాస్క్స్, ఎంత కండిషనింగ్ కూడా ఈ గ్లో ని వెనక్కి తీసుకురాలేదు, మీరు స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేస్తే తప్ప. ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్ ని ఎలా ట్రిమ్ చేయాలో చూద్దాం. స్ప్లిట్ ఎండ్స్ ని ఇంట్లోనే మూడు రకాల పద్ధతుల్లో ట్రిమ్ చేయవచ్చు. దీనికి మీకు కావలసిందల్లా హెయిర్ ట్రిమ్మింగ్ సిజర్స్, దువ్వెన, అంతే. ఇప్పుడు ఒక్కో మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. 1. హెయిర్ ట్విస్టింగ్ మెథడ్ హెయిర్ ట్రిమ్మింగ్ మెథడ్స్ ఇది ట్రెడిషనల్ మెథడ్. దీన్నే ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. జుట్టు పొడిగా ఉన్నప్పుడే ఇది చేయాలి. 1. ముందుగా ఒక ఇంచ్ హెయిర్ ని తీసుకుని కుదుళ్ళ నించి చివరి వరకూ క్లాక్ వైజ్ గా ట్విస్ట్ చేయండి. 2. ఈ ట్విస్ట్ చేసిన సెక్షన్ ని లాగి పట్టుకోండి. 3. ఇప్పుడు ఈ ట్విస్ట్ పొడుగూతా మీకు స్ప్లిట్ ఎండ్స్ బైటికి కనిపిస్తూ ఉంటాయి. 4. పైనించి కింద వరకూ ఇలా స్టిక్ ఔట్ అయిన స్ప్లిట్ ఎండ్స్ ని ట్రిమ్ చేసుకుంటూ రండి. 5. ఇప్పుడు ఇదే సెక్షన్ ని యాంటీ క్లాక్ వైజ్ గా రీ-ట్విస్ట్ చేయండి. 6. ఇప్పుడు కూడా కొన్ని స్ప్లిట్ ఎండ్స్ బయటకి కనిపిస్తాయి. వాటిని ట్రిమ్ చేసేయండి. 7. ఇలా హెయిర్ మొత్తం చేయండి. హెయిర్ స్లైడింగ్ మెథడ్ ఈ మెథడ్ చాలా మందికి తెలియదు. కొద్దిగా అన్ కన్వెన్షనల్ మెథడ్ కూడా. మీది స్ట్రైట్ హెయిర్ కాకపోతే ఈ మెథడ్ లో ముందు హెయిర్ ని స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసే ముందు హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేశాక స్ట్రైట్ చేయడం మర్చిపోకండి. 1. ముందుగా వెడల్పాటి పళ్ళున్న దువ్వెన్న తో జుట్టు జాగ్రత్తగా చిక్కు తీయండి. 2. ఒక ఇంచ్ హెయిర్ ని తీసుకోండి. ఈ హెయిర్ మీ చూపుడు వేలు కిందుగా, మధ్య వేలు పైకి, మళ్ళీ ఉంగరం వేలు కిందగా వచ్చేట్లుగా పట్టుకోండి. అంటే, మీ మధ్య వేలు పైనే జుట్టు కనబడుతూ ఉంటుంది. 3. ఇప్పుడు మీ మధ్య వైలు పైన మీకు కనిపిస్తున్న స్ప్లిట్ ఎండ్స్ ని సిజర్స్ తో ట్రిమ్ చేసేయండి. 4. ఇలా జుట్టు చివరి వరకూ చేయండి. 5. ఇలా హెయిర్ మొత్తం చేయండి. ఎండ్స్ ని ట్రిమ్ చేయడం ఇంత టైం ప్రతి సారీ ఉండక పోవచ్చు. అలాంటప్పుడు ఎండ్స్ ని ట్రిమ్ చేసేయండి. తలస్నానం చేసి రాగానే, జుట్టు ఇంకా తడిగా ఉన్నప్పుడే ఇది చేయాలి. లేదంటే, స్ప్రే బాటిల్ సహాయం తో జుట్టు ని తడిపి అప్పుడు చేయండి. 1. ఒక ఇంచ్ హెయిర్ ని తీసుకోండి. 2. ఈ హెయిర్ ని మీ చూపుడు వేలు, మధ్య వేలు మధ్యలో పట్టుకోండి. 3. అలా వేళ్ళు కిందకి తీసుకొచ్చి ఒక ఇంచ్ పైగా గట్టిగా పట్టుకోండి. 4. ఇప్పుడు జాగ్రత్తగా ఒకటి రెండు అంగుళాల హెయిర్ ని సిజర్స్ తో కట్ చేసేయండి. 5. హెయిర్ మొత్తం ఇలా చేసేయండి. స్ప్లిట్ ఎండ్స్ ని ట్రిమ్ చేయడం ఈజీనే అయినా అవి జుట్టు ఆరోగ్యంగా లేదన్న విషయాన్ని సూచిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రాకుండా చూడచ్చు. 1. హెయిర్ వాష్ కి ముందు కంపల్సరీగా ఆయిల్ అప్లై చేయండి. 2. బ్లో డ్రయ్యర్స్, ఫ్లాట్ ఐరన్స్ లాంటి స్టైలింగ్ టూల్స్ ని వీలున్నంత తక్కువగా యూజ్ చేయండి. ఒకవేళ వాడవలసి వస్తే ముందు హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేయండి. 3. ప్రతి రోజూ హెయిర్ వాష్ చేయకండి. 4. మరీ వేడి నీళ్ళు వాడకండి. 5. జుట్టు ని సహజం గా ఆరనివ్వండి. 6. లీవ్-ఇన్ కండిషనర్ ని అప్లై చేయండి. 7. వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో నే చిక్కు తీసుకోండి. జుట్టు చివరల నించి చిక్కు తీసుకుంటూ పైకి వెళ్ళండి. 8. బయటకి వెళ్తున్నప్పుడు స్కార్ఫ్ కానీ, హ్యాట్ కానీ వాడండి. 9. రెండు వారాలకి ఒకసారి డీప్ కండిషన్ చేయండి 10. సాఫ్ట్ గా ఉండే హెయిర్ బాండ్స్ వాడండి. 11. బాలెన్స్డ్ డైట్ తీసుకోండి. 12. ప్రతి రెండు మూడు నెలలకీ ఒక సారి హెయిర్ ట్రిమ్ చేయండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/32deSRP

Tuesday, 18 August 2020

ఇంట్లోనే దొరికేవాటితోనే మీ తెల్లజుట్టుని నల్లగా మార్చుకోండిలా..

ఒకప్పుడు వయసుతో మాత్రమే తెల్లజుట్టు వచ్చేది. ఇప్పుడు ఉన్న టెన్షన్స్ కీ, పొల్యూషన్ కీ ముప్ఫై రాకముందే హెయిర్ కి కలర్ వేయడం మంచిదా, కొన్నాళ్ళు హెన్నాతో గడపడం మంచిదా అని ఆలోచించేవారు ఎక్కువైపోతున్నారు. బాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఈ సమస్య రాదని అందరూ చెప్తూనే ఉంటారు. కానీ, అన్ని సార్లూ అలా ఫాలో అవ్వడం కుదరకపోవచ్చు కూడా. కానీ, ఈ సమస్యనే పర్టిక్యులర్ గా టార్గెట్ చేసే కొన్ని చిట్కాలున్నాయి. ఈ చిట్కాలకి కావలసిన దినుసులన్నీ కూడా మీ వంటింట్లోనే ఉంటాయి. అవేమిటో చూసేద్దామా మరి. 1. బ్లాక్ టీ ఒక కప్పు నీళ్ళు మరగబెట్టి అందులో రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు వేసి రెండు నిమిషాలు మరిగించండి. ఈ మిశ్రమం చల్లారాక మీ జుట్టుకి పట్టించి ఒక గంట ఆరనివ్వండి. ఆ తరువ చన్నీటితో తలస్నానం చేయండి. షాంపూ చేయకండి. ఇలా రెండు వారాలకి ఒకసారి చేయవచ్చు. బ్లాక్ టీ మీ హెయిర్ కి బ్లాక్ కలర్ ని ఇస్తుంది. అలాగే, డల్ హెయిర్ ని రివైవ్ చేస్తుంది. 2. నిమ్మకాయ, కొబ్బరి నూనె.. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలపండి. దీన్ని స్కాల్ప్ నుండి జుట్టు చివరల వరకూ నెమ్మదిగా పట్టించండి. అలా ముప్ఫై నిమిషాలు వదిలేయండి. సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. దీని వల్ల ఆల్రడీ తెల్లబడిన జుట్టు నల్లగా మారదు కానీ, కొత్త తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది. 3. కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేయండి. పాన్ అడుగున నల్లగా ఏర్పడేవరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత స్కాల్ప్ నుండీ జుట్టు చివర వరకూ నెమ్మదిగా పట్టించండి. ఒక గంట తరువాత సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. కరివేపాకు జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనిన్ని రిస్టోర్ చేస్తుంది. దీని వల్ల జుట్టు బాగా పెరుగుతుంది కూడా. 4. బంగాళా దుంప తొక్కలు.. ఆరు బంగాళా దుంపల నుండి తొక్క తీయండి. ఆ తొక్కల్ని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించండి. ఆ నీరు గంజి లాగా అయ్యేవరకూ మరిగించండి. చల్లారిన తరువాత ఆ నీటిని వడగట్టి తొక్కలు తీసేసి లిక్విడ్ ని ఒక మగ్ లోకి తీసుకోండి. హెయిర్ వాష్ చేసి, కండిషన్ చేసిన తరువాత ఈ లిక్విడ్ ని తల మీద పోయండి. జాగ్రత్తగా జుట్టంతా తడిసేటట్లు పోయండి. ఇంకా తరువాత తల మీద నీరు పోయకండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయవచ్చు. ఈ మిశ్రమం జుట్టుకి పిగ్మెంటేషన్ ని ఇస్తుంది. ఈ పని చేయడం కూడా చాలా సులువు. 5. బ్లాక్ కాఫీ బాగా స్ట్రాంగ్ గా కాచిన కాఫీ డికాషన్ చల్లారిన తరువాత ఒక మగ్ లోకి తీసుకోండి. ఈ కాఫీ ని జుట్టంతా తడిసేటట్లుగా పోయండి. ఇరవై నిమిషాలు ఆగిన తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. షాంపూ చేయకండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కానీ రెగ్యులర్ యూజ్ వల్ల జుట్టు డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. 6. కొబ్బరి నూనె, ఉసిరి పొడి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి వేసి వేడి చేయండి. ఈ పొడి నల్లబడే వరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత ఈ నూనె తో జుట్టు కుదుళ్ళ నుండీ చివరల వరకూ మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేయండి. ఒక గంట అలా వదిలేయండి. లేదా రాత్రంతా కూడా అలాగే ఉంచేయవచ్చు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. ఉసిరికాయ లో ఉండే విటమిన్ సీ, యాంటీ-ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలికిల్స్ దగ్గర ఉండే మెలనిన్ ని ప్రిజర్వ్ చేస్తుంది. దీని వల్ల గ్రేయింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. 7. మిరియాలు ఒక కప్పు పెరుగులో రెండు గ్రాముల నల్ల మిరియాలు వేసి బ్లెండ్ చేయండి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళ నించీ చివరల వరకూ పట్టించండి. ఈ పని చేస్తున్నప్పుడు ఆ చేత్తో కళ్ళు నలుపుకోకండి, కళ్ళు మండుతాయి. ఒక గంట వదిలేసిన తరువాత సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లబడడమే కాక జుట్టు సాఫ్ట్ గా అవుతుంది కూడా. 8. మెంతులు ఒక పాన్ లో అరకప్పు కొబ్బరి నూనె వేసి మరిగించండి. అందులో పావు కప్పు మెంతులు వేసి ఇంకొక ఏడెనిమిది నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. మెంతులు తీసేసి ఆ ఆయిల్ ని ఒక జార్ లోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం నూనె తీసుకుని జుట్టుకి పట్టించండి. రాత్రంతా అలా వదిలేసి పొద్దున్న సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. 9. ఆయిల్స్.. ఇందుకోసం మీరు జొజోబా ఆయిల్, ఆలివ్ ఆయిల్, బ్లాక్ సీడ్ ఆయిల్ లో ఏదైనా ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఆయిల్ ని రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకుని కొద్దిగా వెచ్చబెట్టండి. ఈ గోరు వెచ్చని నూనె తో పదిహేను నిమిషాల పాటూ స్కాల్ప్ అంతా మసాజ్ చేయండి. ఆ తరువాత జుట్టు చివరల వరకూ పట్టించండి. ఇప్పుడు వేడి నీటిలో ముంచి పిండిన టవల్ తో హెయిర్ కవర్ చేసుకోండి. ఇలా ముప్ఫై నిమిషాలు ఉంచండి. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. 10. ఆనియన్ జ్యూస్.. ఒక ఉల్లిపాయ నించి జ్యూస్ తీసి ఒక బౌల్ లో వేయండి. ఈ జ్యూస్ ని స్కాల్ప్ అంతా మసాజ్ చేసి అరగంట వదిలేయండి. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు కుదుళ్ళ నించీ కూడా నల్లబడుతుంది.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2Q35Kte

Sunday, 2 August 2020

ఫేస్ మాస్క్ వాడితే మొటిమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..

మనకి మాస్క్ తెలుసు. అంటే, ఇంతకుముందు తెలియకపోయినా ఇప్పుడు మాస్క్ తెలియని వారూ, మాస్క్ లేని వారూ, మాస్కులు యూజ్ చెయ్యని వారూ ఎవరూ లేరు. డిజైనర్ మాస్కులూ, డ్రెస్ కి మాచ్ అయ్యే మాస్కులూ కూడా వచ్చేసిన రోజులివి. కానీ, ఈ మాస్క్ ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల వచే యాక్నే వస్తుంది. అందుకే సోషల్ మీడియాలో మాస్క్నే అంటున్నారు. ఫేస్ మాస్క్ మన నోరూ, ముక్కూ, బుగ్గలని బాగా కవర్ చేస్తుంది. దాని పని అదే. ఆ ప్రాసెస్ లో మాస్క్ మన స్కిన్ కి హత్తుకుని ఉంటుంది. తల తిప్పినప్పుడూ, కిందకి వంగి లేచినప్పుడూ, తల ఎత్తి చూసినప్పుడూ, హెల్మెట్ పెట్టుకున్నప్పుడూ తీసినప్పుడూ ... ఈ మాస్క్ కదులుతుంది. దానికి తోడు మాస్క్ కి ఉన్న ఎలాస్టిక్ వల్ల స్కిన్ మీద కొంత ప్రెషర్ ఉంటుంది. దాంతో అది స్కిన్ కి రాసుకున్నట్లు అవుతుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల కొంతమంది యాక్నే బారిన పడుతున్నారు. అంతేకాక రీయూజబుల్ మాస్కులని కానీ, కర్చీఫ్స్‌ని ఉతికి మళ్ళీ వాడుతుంటాం కదా. ఎక్కడైనా డిటర్జెంట్ ఉండిపోతే మూడు నాలుగు గంటల పాటూ వేసుకున్న తరువాత అది మనం పీల్చి వదిలిన గాలితో, చెమటతో కలిసి స్కిన్ ని ఇరిటేట్ చేస్తుంది. అయితే, మరి ఈ మాస్క్నే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 1. మీ శరీర తత్వానికి సరిపడే ఫ్యాబ్రిక్ తో చేసిన మాస్క్ వాడాలి. మన వెదర్ ని దృష్టిలో పెట్టుకుని ముఖానికి గాలి తగిలేలాగా ఉండాలి. 2. ఒక మాస్క్ ని మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ వాడకూడదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు ఇంకా ముందే మాస్క్ మార్చుకుంటే మంచిది. మాస్క్ ధరించిన తరువాత ఫేస్ షీల్డ్ పెట్టుకుంటే మాస్క్ ని కదపకుండా ఉండచ్చు. 3. సన్ లైట్ లో చాలా వరకూ క్రిములు పోతాయి. అందుకని వాడిన ప్రతి సారీ మాస్క్ ని ఉతక్కుండా, కనీసం నాలుగు గంటలు ఆ మాస్క్ కి సూర్య రశ్మి తగిలేలా ఉంచితే సరిపోతుంది. కొన్ని మాస్క్ లు పెట్టుకుంటే వాటిని తిప్పి తిప్పి వాడొచ్చు. ఉదాహరణకి, మీ దగ్గర ఐదు మాస్కులు ఉన్నాయనుకోండి. మీరు రోజుకి రెండు మూడు గంటల కంటే ఎక్కువ ఇంటి బయట గడపకపోతే మీకు రోజుకో మాస్క్ సరిపోతుంది. ఇంటికి వచ్చాక ఆ మాస్క్ ని ఎండలో ఆరబెట్టండి. ఆరో రోజున ఇన్ఫెక్షన్స్ గురించి ఎలాంటి భయం లేకుండా మొదటి రోజు వేసుకున్న మాస్క్ వాడుకోవచ్చు. ఈ మాస్క్నే ని ఎలా క్లీన్ చేయాలి? క్లియరసెంట్ అప్లై చేయడం బెస్ట్ పద్ధతి. లేదంటే, గంధం అరగదీసి యాక్నే ఉన్న ప్లేస్‌లో అప్లై చేయండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2Pf41Rk

Tuesday, 28 July 2020

జుట్టు ఊడుతోందా.. అయితే వాల్నట్స్‌తో ఇలా చేయండి..

ఆరోగ్యానికి మంచివి అని చిన్న స్టేట్మెంట్ తో వాల్నట్ గురించి చెప్పేస్తే వాల్నట్ గొప్పతనాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. వాల్నట్స్ హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, మినరల్స్ అలాగే విటమిన్స్ ను ప్రొవైడ్ చేస్తాయి. అంటే, ఇవి ఏ రేంజ్ లో హెల్త్ కు మంచివో అర్థం చేసుకోవచ్చు. వాల్నట్స్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాధించే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. వయసుతో, జెండర్ తో అలాగే కలర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ హెయిర్ ఒత్తుగా అలాగే ఆరోగ్యంగా ఉండాలని కలలు కంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. జుట్టు వాల్యూం తగ్గిపోవడం, లేదా డాండ్రఫ్, లేదా ఇంకేదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కాబట్టి, నేచురల్ పదార్థాలతో రెమెడీ తయారుచేసుకోవడం ఎంతో అవసరం. ఈరోజు అటువంటి ఒక ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం. అదే వాల్నట్ ఆయిల్. ఈ ఆయిల్ లో ఎన్నో థెరపీటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి హెయిర్ కేర్ కు ఇది పెర్ఫెక్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. గుడ్‌న్యూస్ ఏంటంటే, వాల్నట్ ఆయిల్ ను కొనడానికి మీరు ఇంటి నుంచి కాలు బయటపెట్టనవసరం లేదు. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1. కప్ వాల్నట్స్ 2. అరకప్పు వెజిటబుల్ ఆయిల్ ప్రాసెస్: 1. కాస్తంత వాటర్ ను బాయిల్ చేయండి. ఇప్పుడు అందులో కప్పుడు వాల్నట్స్ ను కలపండి. దీన్ని పదినిమిషాల పాటు బాయిల్ చేయండి. 2. ఆ తరువాత వాల్నట్స్ ను బయటికి తీసి చల్లారనివ్వండి. 3. ఈ వాల్నట్స్ ను క్రష్ చేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడవి పౌడరీగా మారతాయి. 4. ఈ పౌడర్ ను వెజిటబుల్ ఆయిల్ కు కలపండి. కలర్ మారగానే ఈ ఆయిల్ యూజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే. 5. ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత మైల్డ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోవాలి. బెనిఫిట్స్ 1. వాల్నట్ ఆయిల్ లో హెయిర్ కేర్ విటమిన్స్ ముఖ్యంగా బయోటిన్ లభ్యమవుతుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో సెలీనియం లభిస్తుంది. ఈ మినరల్ లోపం వల్ల హెయిర్ లాస్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి, వాల్నట్ అనేది ఈ మినరల్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దాంతో, హెయిర్ లాస్ సమస్యను నివారిస్తుంది. భయంకరమైన హెయిర్ ఫాల్ ను ఎక్స్పీరియెన్స్ చేస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆయిల్ లో పొటాషియం ఉంటుంది. ఇది హెయిర్ కు వాల్యూమ్ అందిస్తుంది. రూట్స్ ను బలపరుస్తుంది. 2. ఈ ఆయిల్ విపరీతమైన హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. వాల్నట్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. వాల్నట్స్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి స్కాల్ప్ డేమేజ్ ను అలాగే ఇన్ఫెక్షన్స్ ను అరికడతాయి. స్కాల్ప్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ ఆయిల్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. తద్వారా, హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. 3. ఈ ఆయిల్ రెమెడీని పాటించిన తరువాత పెరిగే హెయిర్ చాలా స్ట్రాంగ్ గా అలాగే థిక్ గా ఉంటుంది. జుట్టు పలచబడే సమస్యను ఈ ఆయిల్ రెమెడీ తగ్గిస్తుంది. హెయిర్ బ్రేకింగ్ సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ కు మంచి పోషణ లభిస్తుంది. ఇంకొక ఆసక్తికర విషయం - వాల్నట్స్ తో కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్ వాల్నట్స్ తో మీరు కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్ ను కూడా తయారుచేసుకోవచ్చు. ఇది మీ హెయిర్ ను డేమేజ్ చేయదు. వాల్నట్ షెల్ తో హెయిర్ కలర్ ను సింపుల్ గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. వాల్నట్స్ యొక్క హార్డ్ షెల్ అనేది స్ట్రాంగ్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. హెయిర్ ను డై చేయాలనుకున్నా నేచురల్ డార్క్ బ్రౌన్ కలర్ ను హెయిర్ కు అందించాలనుకున్నా వాల్నట్ షెల్స్ ను మీరు నిస్సందేహంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం వాల్నట్ డై గురించి తెలుసుకుందాం.
  • పది లేదా పదిహేను వాల్నట్ షెల్స్ ను తీసుకోండి. వాటిని క్రష్ చేయండి. బాయిలింగ్ వాటర్ లో వీటిని కలపండి. ముప్పై నిమిషాల పాటు వీటిని బాయిల్ అవనివ్వండి.
  • ఈ లిక్విడ్ ను చల్లారన్వివండి. షెల్స్ ను వడగట్టండి.
  • మీరు కలర్ చేయాలనుకున్న హెయిర్‌ను సెపరేట్ చేయండి.
  • కాటన్ బాల్ హెల్ప్ తో లిక్విడ్ ను ఆ హెయిర్‌కు అప్లై చేయండి.
  • గంటపాటు హెయిర్ ను అలాగే ఉంచండి. రిలాక్స్ అవ్వండి.
  • మీ హెయిర్ ను కొంత వాటర్ తో వాష్ చేయండి. మైల్డ్ షాంపూను అలాగే కండిషనర్ ను వాడండి.
  • నేచురల్ బ్రౌన్ కలర్ ను ఎంజాయ్ చేయండి.
  • హాట్ వాటర్ తో హెయిర్ ను కనీసం వారంపాటు వాష్ చేయకండి. హాట్ వాటర్ తో వాష్ చేస్తే కలర్ మొత్తం పోతుంది.
  • రోజూ గుప్పెడు వాల్నట్స్ ను తినడం ద్వారా కూడా హెయిర్ లాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. పొడవాటి ఆరోగ్యకరమైన శిరోజాలను కలలోనే కాదు ఇలలో కూడా పొందవచ్చు.
వాల్నట్ ఆయిల్ ను హెయిర్ కు అప్లై చేసుకోవడంతో పాటు వాల్నట్ హెయిర్ మాస్క్ లను కూడా మీ రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్ లో కలిపితే మంచి రిజల్ట్స్ పొందవచ్చు. మీ హెయిర్ ట్రబుల్స్ అన్నిటికీ వాల్నట్స్ గుడ్ బై చెప్పేస్తాయి. సో, ఇంకోసారి మీ హెయిర్ ట్రబుల్స్ మిమ్మల్ని వెక్కిరిస్తే మౌనంగా ఉండొద్దు. వాల్నట్స్ అనే అస్త్రాన్ని వాటిపై ప్రయోగించండి. హెయిర్ ట్రబుల్స్ ఇక మీ వైపుకే చూడడానికి భయపడతాయి. మీ శిరోజాలకు వాల్నట్స్ తో ప్రొటెక్షన్ లేయర్ ను అప్లై చేసుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/39DjfsQ

Friday, 24 July 2020

మెరిసే చర్మం కోసం కుంకుమ పువ్వుతో ఈ మాస్క్ ట్రై చేయండి..

కుంకుమ పువ్వు వంటకాల రుచిని పెంచుతుందని అంటారు, అయితే ఇది మీ అందాన్ని కూడా పెంచుతుంది. వర్షాకాలంలో, మారుతున్న ఉష్ణోగ్రతలు, తేమ, పురుగు, లేదా దోమ కాటులకు మీ చర్మం గురవుతుంది. కాబట్టి చర్మ సంరక్షణ చర్యలలో భాగంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు, DIY లు మీ చర్మ సంరక్షణకి ఎంతగానో సాయపడతాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా వాడే విధంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు, కేసర్ అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్ధం. ఈ కుంకుమ పువ్వుని అనేకరకాల ప్రాడక్ట్స్ లో కూడా ఎక్కువగా ఉపయోస్తారు. ఇపదీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకోండి.. చందనం, కుంకుమపువ్వు మాస్క్ : ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోండి. అన్నిటిని కలిపి మిశ్రమంగా చేసి ముఖం, మెడ భాగాలలో రాయండి. దీనిని అప్లై చేసేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. ముఖంపై మాస్క్ ఆరిన తర్వాత, మీ ముఖాన్ని కడిగండి. మంచి రిజల్ట్ కోసం వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్ వాడండి. కుంకుమ పువ్వు - తేనె ఫేస్ ప్యాక్ : ఈ ఫేస్ ప్యాక్, పొడి చర్మం ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది మీకు ఏ కాలంలో అయినా మృదువైన, తేమతో కూడిన చర్మాన్ని అందిస్తుంది. దీన్ని తయారు చేయడానికి, మీకు, రెండు, మూడు తంతువుల కుంకుమ పువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె అవసరం అవుతుంది. ఒక గిన్నెలో ఈ రెండు పదార్థాలను కలపండి, ఆపై ముఖం మీద అప్లై చేయండి. మెడకి కూడా మాస్క్ వేయండి. కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. మచ్చలేని చర్మం కోసం వారంలో రెండుసార్లు వేసుకోండి. కుంకుమ పువ్వు - పాలు : పాలు మీ చర్మానికి తక్షణ మెరుపుని అందిస్తుంది. ఎండ, పొల్యూషన్, సరిగ్గా లేని లైఫ్ స్టైల్ కారణంగా కోల్పోయిన మీ సహజ కాంతిని తిరిగి పొందాలని అనుకుంటే ఈ ప్యాక్ మీకు హెల్ప్ చేస్తుంది. చిటికెడు కుంకుమ పువ్వు కలిపిన, నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని, కాటన్ బాల్ ఉపయోగించి ముఖం, మెడపై రాయండి. కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచి, ప్యాక్ ఆరిన తర్వాత, సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం రోజు మార్చి రోజు రాయండి. అదే విధంగా రోజు కుంకుమ పువ్వు రేకులు, కొబ్బరి నూనె, రోజ వాటర్‌ని కలిపి దానిని ముఖానికి రాయండి. దీని వల్ల పట్టులాంటి చర్మం మీ సొంతం.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3fYPkh5

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....