Tuesday, 28 July 2020

జుట్టు ఊడుతోందా.. అయితే వాల్నట్స్‌తో ఇలా చేయండి..

ఆరోగ్యానికి మంచివి అని చిన్న స్టేట్మెంట్ తో వాల్నట్ గురించి చెప్పేస్తే వాల్నట్ గొప్పతనాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. వాల్నట్స్ హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, మినరల్స్ అలాగే విటమిన్స్ ను ప్రొవైడ్ చేస్తాయి. అంటే, ఇవి ఏ రేంజ్ లో హెల్త్ కు మంచివో అర్థం చేసుకోవచ్చు. వాల్నట్స్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాధించే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. వయసుతో, జెండర్ తో అలాగే కలర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ హెయిర్ ఒత్తుగా అలాగే ఆరోగ్యంగా ఉండాలని కలలు కంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. జుట్టు వాల్యూం తగ్గిపోవడం, లేదా డాండ్రఫ్, లేదా ఇంకేదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కాబట్టి, నేచురల్ పదార్థాలతో రెమెడీ తయారుచేసుకోవడం ఎంతో అవసరం. ఈరోజు అటువంటి ఒక ఆయిల్ గురించి మనం తెలుసుకుందాం. అదే వాల్నట్ ఆయిల్. ఈ ఆయిల్ లో ఎన్నో థెరపీటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి హెయిర్ కేర్ కు ఇది పెర్ఫెక్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. గుడ్‌న్యూస్ ఏంటంటే, వాల్నట్ ఆయిల్ ను కొనడానికి మీరు ఇంటి నుంచి కాలు బయటపెట్టనవసరం లేదు. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1. కప్ వాల్నట్స్ 2. అరకప్పు వెజిటబుల్ ఆయిల్ ప్రాసెస్: 1. కాస్తంత వాటర్ ను బాయిల్ చేయండి. ఇప్పుడు అందులో కప్పుడు వాల్నట్స్ ను కలపండి. దీన్ని పదినిమిషాల పాటు బాయిల్ చేయండి. 2. ఆ తరువాత వాల్నట్స్ ను బయటికి తీసి చల్లారనివ్వండి. 3. ఈ వాల్నట్స్ ను క్రష్ చేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడవి పౌడరీగా మారతాయి. 4. ఈ పౌడర్ ను వెజిటబుల్ ఆయిల్ కు కలపండి. కలర్ మారగానే ఈ ఆయిల్ యూజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టే. 5. ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత మైల్డ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోవాలి. బెనిఫిట్స్ 1. వాల్నట్ ఆయిల్ లో హెయిర్ కేర్ విటమిన్స్ ముఖ్యంగా బయోటిన్ లభ్యమవుతుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో సెలీనియం లభిస్తుంది. ఈ మినరల్ లోపం వల్ల హెయిర్ లాస్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి, వాల్నట్ అనేది ఈ మినరల్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దాంతో, హెయిర్ లాస్ సమస్యను నివారిస్తుంది. భయంకరమైన హెయిర్ ఫాల్ ను ఎక్స్పీరియెన్స్ చేస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆయిల్ లో పొటాషియం ఉంటుంది. ఇది హెయిర్ కు వాల్యూమ్ అందిస్తుంది. రూట్స్ ను బలపరుస్తుంది. 2. ఈ ఆయిల్ విపరీతమైన హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. వాల్నట్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. వాల్నట్స్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి స్కాల్ప్ డేమేజ్ ను అలాగే ఇన్ఫెక్షన్స్ ను అరికడతాయి. స్కాల్ప్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ ఆయిల్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. తద్వారా, హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. 3. ఈ ఆయిల్ రెమెడీని పాటించిన తరువాత పెరిగే హెయిర్ చాలా స్ట్రాంగ్ గా అలాగే థిక్ గా ఉంటుంది. జుట్టు పలచబడే సమస్యను ఈ ఆయిల్ రెమెడీ తగ్గిస్తుంది. హెయిర్ బ్రేకింగ్ సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ కు మంచి పోషణ లభిస్తుంది. ఇంకొక ఆసక్తికర విషయం - వాల్నట్స్ తో కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్ వాల్నట్స్ తో మీరు కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్ ను కూడా తయారుచేసుకోవచ్చు. ఇది మీ హెయిర్ ను డేమేజ్ చేయదు. వాల్నట్ షెల్ తో హెయిర్ కలర్ ను సింపుల్ గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. వాల్నట్స్ యొక్క హార్డ్ షెల్ అనేది స్ట్రాంగ్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. హెయిర్ ను డై చేయాలనుకున్నా నేచురల్ డార్క్ బ్రౌన్ కలర్ ను హెయిర్ కు అందించాలనుకున్నా వాల్నట్ షెల్స్ ను మీరు నిస్సందేహంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం వాల్నట్ డై గురించి తెలుసుకుందాం.
  • పది లేదా పదిహేను వాల్నట్ షెల్స్ ను తీసుకోండి. వాటిని క్రష్ చేయండి. బాయిలింగ్ వాటర్ లో వీటిని కలపండి. ముప్పై నిమిషాల పాటు వీటిని బాయిల్ అవనివ్వండి.
  • ఈ లిక్విడ్ ను చల్లారన్వివండి. షెల్స్ ను వడగట్టండి.
  • మీరు కలర్ చేయాలనుకున్న హెయిర్‌ను సెపరేట్ చేయండి.
  • కాటన్ బాల్ హెల్ప్ తో లిక్విడ్ ను ఆ హెయిర్‌కు అప్లై చేయండి.
  • గంటపాటు హెయిర్ ను అలాగే ఉంచండి. రిలాక్స్ అవ్వండి.
  • మీ హెయిర్ ను కొంత వాటర్ తో వాష్ చేయండి. మైల్డ్ షాంపూను అలాగే కండిషనర్ ను వాడండి.
  • నేచురల్ బ్రౌన్ కలర్ ను ఎంజాయ్ చేయండి.
  • హాట్ వాటర్ తో హెయిర్ ను కనీసం వారంపాటు వాష్ చేయకండి. హాట్ వాటర్ తో వాష్ చేస్తే కలర్ మొత్తం పోతుంది.
  • రోజూ గుప్పెడు వాల్నట్స్ ను తినడం ద్వారా కూడా హెయిర్ లాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. పొడవాటి ఆరోగ్యకరమైన శిరోజాలను కలలోనే కాదు ఇలలో కూడా పొందవచ్చు.
వాల్నట్ ఆయిల్ ను హెయిర్ కు అప్లై చేసుకోవడంతో పాటు వాల్నట్ హెయిర్ మాస్క్ లను కూడా మీ రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్ లో కలిపితే మంచి రిజల్ట్స్ పొందవచ్చు. మీ హెయిర్ ట్రబుల్స్ అన్నిటికీ వాల్నట్స్ గుడ్ బై చెప్పేస్తాయి. సో, ఇంకోసారి మీ హెయిర్ ట్రబుల్స్ మిమ్మల్ని వెక్కిరిస్తే మౌనంగా ఉండొద్దు. వాల్నట్స్ అనే అస్త్రాన్ని వాటిపై ప్రయోగించండి. హెయిర్ ట్రబుల్స్ ఇక మీ వైపుకే చూడడానికి భయపడతాయి. మీ శిరోజాలకు వాల్నట్స్ తో ప్రొటెక్షన్ లేయర్ ను అప్లై చేసుకోండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/39DjfsQ

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk