Thursday, 30 July 2020

పాలు పట్టిస్తున్న మెగా కోడలు.. ఉపాసన ఒడిలో..!! వైరల్ అవుతున్న షాకింగ్ పిక్

రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా అందరికీ సుపరిచితం . సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ మెగా ఫ్యామిలీ విశేషాలను అందరి ముందుంచే ఆమె.. తాజాగా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసింది. తన ఒడిలో పులిని కూర్చోబెట్టుకొని స్వయంగా పాలు పట్టిస్తున్న పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రకృతి, అందులోని జీవాలంటే ఎంతో ప్రేమ చూపే మెగా కోడలు సందర్భంగా ఇలా చేసింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం (జులై 29) సందర్భంగా పులులపై ప్రేమను చాటుకుంటూ పులికి పాలు పట్టించింది ఉపాసన. ''పులి పిల్లకు పాలు పట్టడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. కానీ మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయను. అడవుల్లో కంటే జూ ల్లోనే పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వాటికి రక్షణ కల్పించాలి'' అని పేర్కొంటూ సందేశమిచ్చింది. Also Read: ఉపాసన షేర్ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇక రామ్ చరణ్ వారసత్వం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానలోకం.. ‘ఆ పులిలా మీ చేతిలో మెగా వారసుడు ఎప్పుడు ఉంటారని’ ఈ పిక్‌పై కామెంట్స్ పెడుతుండటం విశేషం. మరోవైపు కొందరు నెటిజన్లు 'ఇది చాలా ప్రమాదం మేడం, కాస్త జాగ్రత్త' అని కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. రామ్ చరణ్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను పంచుకుంటూనే సమజానికి ఉపయోగపడే పనులు చేస్తుంటుంది ఈ మెగా కోడలు. అంతేకాదు ఆరోగ్య చిట్కాలు, సంప్రదాయ పద్దతుల గురించి అందరికీ చెప్పడం ఆమె ప్రత్యేకత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33bwVtE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....