Friday, 31 July 2020

బ్రేకింగ్: ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఈ రోజు (శనివారం) ఉదయం 6 గంటలకు ఆయన మరణించినట్లు సమాచారం. వయసు పైబడటంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా 'లవ్ స్టోరీ' సినిమా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అతిత్వరలో ఈ 'లవ్ స్టోరీ' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DkR2e6

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...