Monday 27 July 2020

Murder trailer: సమాధానం మీరే చెప్పండి అంటూ ఆ సన్నివేశాలన్నీ కళ్లముందుంచారు

వరుస సినిమాలతో సంచలనం సృష్టిస్తున్నారు వివాదాస్పద దర్శకుడు . ఎవరేమన్నా, ఎన్ని అడ్డంకులొచ్చినా తాను చెప్పాలనుకున్న కథ, చూపించాలనుకున్న సన్నివేశాలను చూపించే తీరుతా అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఇటీవలే 'పవర్ స్టార్' సీంయాతో వివాదాల సునామీ సృష్టించిన ఆయన.. '' అంటూ మరో సంచలన కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అమృత, మారుతీ రావుల విషాద గాదపై కన్నేసిన రామ్ గోపాల్ వర్మ.. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై 'మర్డర్' పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతీరావు- అమృత రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. వర్మ సమర్పణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి ఆసక్తి రేకెత్తించిన ఆర్జీవీ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి మర్డర్ జరిగిన తీరు, ఆ సన్నివేశాలన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించారు. Also Read: ఓ తండ్రి.. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు చెప్పిన మాట వినకుండా చేసిన ఓ పనితో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హత్య అన్నీ చూపిస్తూ రక్తికట్టించారు వర్మ. ''పిల్లలని ప్రేమించడం తప్పా?, తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?, పిల్లల్ని కనగలం కానీ వారి మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి అంటూ ట్రైలర్ ముగించారు వర్మ. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రణయ్ హత్యోదంతం తాలూకు పూర్తి విషయాలతో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. ఏకంగా 5 భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో ఈ మూవీ విడుదల కానుండటం విశేషం. కాగా గతంలో 'మర్డర్' సినిమాపై ఘాటుగా రియాక్ట్ అవుతూ అమృత తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది అని పేర్కొంటూ ఆమె ఆవేదన చెందింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g9uJq8

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz