Thursday, 30 July 2020

Pawan Kalyan: పవన్ 3 పెళ్లిళ్లే చేసుకుంటా.. రేప్‌లు చేయలేదు, మీలా ఏడుగుర్ని మార్చలేదు: ఆమె ఫైర్ అయ్యింది!

‘‘ఎందుకో తెలీదు.. నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను? ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?’’.. పవన్‌పై రాసిన ఈ ప్రేమ కవిత చూస్తే ఆయనంటే ఎంత ప్రేమో.. ఆరాధనో.. పిచ్చో.. ఇట్టే అర్థమైపోతుంది ఆమె ఫాలోవర్స్‌కి. సందర్భం వచ్చిన ప్రతిసారి అనలేం కాని.. సందర్భం వచ్చినా రాకపోయినా.. పవన్‌పై ఉన్న భక్తిని చాటుకుంటూనే ఉంది ఈ ‘నచ్చావులే’ నటి. నిజానికి జనసేనలో ఉండాల్సిన ఆమె మొదట్లో ఆపార్టీ తరుపున ర్యాలీలు కూడా చేసింది. అయితే ఏమైందో ఏమోకాని బీజేపీ కండువా కప్పుకుంది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తీ కట్టడంతో ఫుల్ ఖుషీలో ఉంది మాధవీలత. ‘మీరు వస్తారని నాకు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ గారూ.. ఐ లవ్డ్ ఇట్’ అంటూ పవన్ బీజేపీతో దోస్తీ కట్టిన తరుణంలో ఘనంగా స్వాగతం పలికిన మాధవీలత.. ఈ మధ్య కాలంలో ఆయనపై ఈగవాలినా తట్టుకోవడం లేదు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ పవన్‌ని కించపరిచేలా ‘పవర్ స్టార్’ సినిమా తీసినందుకు వర్మను ఓ రేంజ్‌లో ఏకిపారేసింది మాధవీలత. ఫర్ ఎవర్ పీకే లవ్స్ అంటూ.. వర్మా.. ఏంటి నీకీ కర్మ?? పీకేని ఏం పీకలేక పనికిమాలిన సినిమాలు. నీకు పర్శనల్‌గా ఆయనపై పగ ఉంటే.. అతనితో తేల్చుకో. చేతకాని కహానీ ఎందుకు? అయినా ఆయన్ని ఏమీ పీకలేని వాళ్లు ఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడుస్తున్నారు’ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే మాధవీలత పవన్ గురించే కాదు.. సోషల్ ఇష్యూస్‌పై తనకు తెలిసిన పరిధిలో పోస్ట్‌లు పెడుతూ విమర్శల పాలు కావడం తరుచూస్తున్నాం. ఈమెకు నెటిజన్లకు మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్‌లో జరుగుతూ ఉంటుంది. ఈమె ఏ పోస్ట్ పెట్టినా.. దానిపై వర్గర్ కామెంట్స్ రావడం.. దానిపై ఈమె సీరియస్ అవ్వడం.. బండ బూతులు తిట్టడం షరా మామూలే. రీసెంట్‌గా ఆమె మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తూ.. ఓ ఫార్వర్డ్ మెసేజ్‌ను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ‘కామాంధుల చూపులు నన్ను కాల్చి బూడిద చేస్తూంటే.. నొప్పిని చెప్పుకోలేను.. బాధని బయట పెట్టుకోలేను.. అన్యాయం చేసినోళ్లు ఆబోతుల్లా కామంతో రంకేలు వేస్తుంటే.. పాపం నాకోసం REST IN PEACE అని స్టేస్టేటస్సుల్లో ట్విట్టర్లో ఫేసు బుక్కుల్లో రాసుకుంటూ నన్ను గోడలపై పోస్టర్లా అతికిస్తారు’ అంటూ కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న మెసేజ్‌ను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది మాధవీలత. మాటలు లేవు...ఆ పదాలకు... కన్నీటి ధారలే....సమాధానాలు అంటూ మాధవీలత పోస్ట్‌పై కొంతమంది నెటిజన్లు స్పందిస్తుండగా.. ఈ ఇష్యూలోకి మాధవీలత ఆరాధించే పవన్ కళ్యాణ్‌ని తీసుకుని వచ్చాడు ఓ నెటిజన్. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. నాలుగో ఆమెగా పూనమ్ కౌర్‌తో ఎఫైర్ నడుపుతున్న పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటావు.. నువ్వ ఆడవాళ్ల రక్షణ గురించి మాట్లాడటం.. చాలా వింతగా ఉందని షేక్ జకీర్ అనే నెటిజన్ వివాదాస్పద కామెంట్ చేయడంతో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఘాటు రిప్లై ఇచ్చింది మాధవీలత. షేక్ జకీర్.. అతను వాళ్లను రేప్ చేశాడా?? హింసించాడా?? ఇష్టపడి చేసే అమ్మాయిలకి స్వేచ్ఛ ఉంది. ఈ సమాజంలో మగాడికి ఎంత హక్కు ఉందో ఆడవాళ్లకు అంతే హక్కు ఉంది. ఆమెకు నచ్చితే ఏమైనా చేయొచ్చు. ఆమెకు నచ్చకపోతే నేరం. అతను ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. డైవర్స్ ఇచ్చిన తరువాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఆయన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను వాళ్లనేం రేప్ చేయలేదు. మీ వాళ్ల లా ఏడు పెళ్లిళ్లు చేసుకుని మొన్నటి వరకూ తలాక్.. తలాక్.. అని వదిలించుకునే దుర్మార్గపు సాంప్రదాయం ఉన్న మీరు మాట్లాడటం జోక్’ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది మాధవీలత. ‘స్వేచ్ఛపేరుతో పదిమందిని పెళ్ళిచేసుకుంటే కూడా కరెక్ట్ అనే కాన్సెప్ట్ బలే ఉంది.. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఒకటే భార్య భర్త.. విదేశీ సంస్కృతిని బీజేపీలో విలీనం చేస్తారా మరి..? మాధవి గారు కూడా ఒకటే పెళ్లి చేసుకోవాలని మనవి.... !!’ అంటూ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు మరో నెటిజన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3faaLu3

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O