Friday 27 March 2020

కరోనా కష్టం.. సూపర్ మార్కెట్‌లో అల్లు అర్జున్.. అవసరం అలాంటిది మరి

కరోనా వైరస్‌ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇంట్లో వాళ్లు ఉండటం కంటే మరో మార్గం లేదని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా గత రెండు వారాలుగా కరోనా భయంతో చాలామంది జనం ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉంటున్నారు. సాధారణ జనంతో పాటు.. సెలబ్రిటీలు సైతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. షూటింగ్‌లు అన్నీ బంద్ కావడంతో ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. వంటచేసేవాళ్లు కొందరైతే.. ఇళ్లను శుభ్రం చేసుకునే వాళ్లు మరికొందరు పిల్లలతో ఆడుకుంటూ స్టార్ హీరోలు సోషల్ మీడియాలో సెల్ఫ్ క్వారంటైన్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం సడలింపు ఇచ్చాయి ప్రభుత్వాలు. ఈ సమయంలో జాగ్రత్తలు పాటిస్తు తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కునే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ తన ఫ్యామిలీకి కావాల్సిన సరుకులు కోసం సాధారణ వ్యక్తిగా జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.45లో ఉన్న సూపర్ మార్కెట్‌కి వచ్చారు. ముఖానికి మాస్క్ కట్టుకుని, చేతులకు గ్లౌజ్ ధరించి సూపర్ మార్కెట్‌లో వస్తువులు తీసుకుంటున్న అల్లు అర్జున్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత స్టార్ సెలబ్రిటీ హోదా ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఫ్యామిలీ కోసం నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్, పిల్లలకు చాక్లెట్స్, స్నాక్స్, మిల్క్ తదితర సరుకుల్ని కొనుకోలు చేశారు అల్లు అర్జున్. కాగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతి సందర్భంలోనూ సాయం చేయడానికి ముందు ఉండే.. అల్లు అర్జున్ కరోనా కష్టంలోనూ తన మంచి మనసును చాటుకున్నారు. కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా రూ. 1.25 కోట్లు భారీ విరాళం ప్రకటించారు అల్లు అర్జున్. గతంలో కేరళ వరదలు, చెన్నై వరదల సమయంలోనూ అల్లు అర్జున్ పాతిక లక్షల చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3avQQVe

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc