Sunday, 29 March 2020

కరోనా కష్టాలు.. బుద్ధిగా భార్య చెప్పింది చేస్తోన్న ఆలీ

కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడేందుకు 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూ కరోనాపై పోరాడుతున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్‌ను సెలబ్రిటీలు కష్టంగా భావించడంలేదు. తమ కుటుంబ సభ్యులతో గడపడానికి దొరికిన క్షణాలుగా భావిస్తున్నారు. అందుకే, తమకు ఇష్టమైన పనులు చేస్తూ ఇన్నాళ్లు తమకోసం పనిచేసినవాళ్లకు కాస్త విశ్రాంతిని ఇస్తున్నారు. కమెడియన్ ఆలీ అయితే తన భార్య చెప్పిన పనులన్నింటినీ బుద్ధిగా చేసేస్తున్నారు. ఈ మేరకు ఒక ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలో ఇల్లు శుభ్రంచేసే ఆలీ మాప్ స్టిక్ పట్టుకుని ఉన్నారు. ఆయన భార్య సుల్తానా బేగం ఇల్లు శుభ్రంచేసే లిక్విడ్‌ను మాప్ బాక్స్‌లో పోస్తుండగా.. స్టిక్ పట్టుకుని ఇళ్లు ఒత్తగానికి సిద్ధంగా ఉన్నారు ఆలీ. తాను రోజూ కార్లు కడుగుతున్నానని, ఇంట్లో పని చేస్తున్నానని ఆలీ చెప్పారు. కూరగాయలు కట్ చేస్తున్నానని, ఇల్లంతా శుభ్రపరుస్తున్నానని వెల్లడించారు. అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నానన్నారు. తన భార్య ఏ పని చెబితే అది బుద్ధిగా చేసేస్తున్నానని.. వంట కూడా చేస్తున్నానని తెలిపారు. Also Read: ‘‘నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాడిని. నేను వంట చేయడం వల్ల నా రూమ్‌‌మేట్స్ నన్ను అద్దె కట్టమనేవాళ్లు కాదు. అప్పుట్లో నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాడిని. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vVRyvG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....