మెగా పవర్ స్టార్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కోసం పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తనవంతుగా సాయం చేశాడు. రూ. 70 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు రామ్ చరణ్. తాజాగా పవన్ కళ్యాన్ ... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ. కోటి సాయం అందించాడు. బాబయ్ అడుగులోనే ఇప్పుడు అబ్బాయ్ కూడా కదిలాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ... తనవంతుగా తెలుగు రాష్ట్రాల కోసం పోరాడుతున్న ప్రభుత్వాలకు రూ.70 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. దేశ క్షేమం కోసం నిరంతం శ్రమిస్తున్న ప్రధాని మోదీపై ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి కూడా తమ శాయశక్తుల కరోనా వైరస్ నుంచి రాష్ట్రాల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెర్రీ కొనియాడారు. రేపు చెర్రీ బర్త్ డే. కరోనా నేపథ్యంలో ఇప్పటికే తన బర్త్ డే వేడుకలు నిర్వహించొద్దని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ఎవరో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని తెలిపాడు. ఆ సమయంలో కరోనా కోసం ఏదైనా సహాయక చర్యలు చేయాలని కోరాడు. ఇప్పుడు బర్త్ డేకు ముందు రామ్ చరణ్ కరోనా కోసం విరాళం ప్రకటించడంతో చెర్రీ అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. తమ హీరో సూపర్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు వరుసగా కరోనా వైరస్ కోసం డోనెషన్లు ప్రకటిస్తున్నారు. ముందుగా హీరో నితిన్ 20 లక్షల విరాళం ప్రకటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, వివి వినాయక్, త్రివిక్రమ్ ఇలా వరుసగా ఇండస్ట్రీకి చెందిన పలువురు కరోనా వైరస్ కోసం విరాళాలు అందిస్తున్నారు. రామ్ చరణ్ చేసిన ఈ గొప్ప పనిపై స్పందించారు. రామ్ చరణ్‌కు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మరోవైపు రామ్ చరణ్ సతీమణి కూడా భర్త ట్వీట్ పై స్పందించింది. ఇది ఎందరికో ఆదర్శనీయమని ట్వీట్ చేశారు. ప్రస్తుతమన్న ఇబ్బందికర పరిస్థితుల వెనుక ప్రతీ ఒకరు తమ వంతు సాయంగా నిలబడుతున్నారని ఉపాసన ట్వీట్ లో పేర్కొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QJ3t79
No comments:
Post a Comment