Friday, 27 March 2020

బాలయ్య హీరోయిన్‌కు కరోనా పరీక్షలు... నిజం కాదంటున్న హాట్ బ్యూటీ

తాజాగా శుక్రవారం రోజున టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌కు కరోనా వచ్చిందని టాక్ వచ్చింది. మీడియాలో ఆ వార్తలు గుప్పు మన్నాయి. సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవాళ తాజాగా టాలీవుడ్ హీరోయిన్ స్పందించింది. తనకు ఎలాంటి కరోనా లేదని క్లారిటీ ఇచ్చింది. లెజెండ్ సినిమాలో బాలయ్యతో నటించిన హీరోయిన్ . తాజాగా ఈ భామ ఆస్పత్రిలో మాస్క్‌తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో ఆమెకు కరోనా వచ్చిందంటూ పుకార్లు పుట్టించారు. నిమిషాల్లో వార్తను వైరల్ చేసి పడేశారు. దీంతో ఇప్పుడు లెజెండ్ భామ ఆ విషయంపై స్పష్టత ఇచ్చింది. తాను ఎలాంటి కరోనా పరీక్షలు చేయించు కోలేదని తెలిపింది. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది. ముఖానికి మాస్కు ధరించి ఓ ఆసుపత్రిలో ఉన్న ఫొటోను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తాను ఆసుపత్రికి వచ్చానని, అయితే, కరోనా పరీక్షల కోసం కాదని తెలిపింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా బాగానే ఉందని హాష్ ట్యాగ్స్ జత చేసింది. ఇంట్లోనే ఉండి, భద్రంగా ఉండాలంటూ తన అభిమానుల్ని, నెటిజన్స్‌ను కోరింది రాధిక. అయితే.. ఆస్పత్రికి ఎందుకు వచ్చానన్న విషయాన్ని మాత్రం రాధిక తెలపలేదు. దీంతో ఇప్పుడు ఆ విషయంపై ఆరా తీస్తున్నారు ఆమె ఫ్యాన్స్. తమిళనాడు వెల్లూరులో పుట్టిన రాధిక ఆఫ్టే... ఇప్పటివరకు పలు తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠి, ఇంగ్లీష్ సినిమాల్లో నిటించింది. అంతేకాదు పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసింది. 2009లో ఆఫ్టే తీసిన బెంగాలి సినిమాతో ఆమెకు స్టార్ డమ్ వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు. పుట్టింది తమిళనాడు అయినా... పెరిగింది, చదివింది అంతా పూణెలోనే. దీంతో కెరియర్ ప్రారంభంలో ఆఫ్టే కూడా అనేక ఒడిదుడుకుల్ని ఎదురుకొంది. ముంబైలో సినిమా ఛాన్సుల కోసం తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఓ మరాఠి సినిమాతో రాధిక దశ తిరిగింది. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JjHXBQ

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...