కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని పెద్ద తగిలింది. షూటింగ్ బంద్ కావడంతో చాలా మంది నటీనటులు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న వేలాది మంది శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏరోజు ఆ రోజు పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే సినీ కార్మికులు చాలా మంది పరిస్థితి దయనీయంగా తయారైంది. అయితే ఇలాంటి వాళ్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సినీనటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే . పేదకళాకారుల ఆకలి తీర్చేందుకు 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాదు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయపడేందుకు త్వరలో జోలె పట్టి విరాళాలు సేకరించేందుకు ఆలోచన ఉన్నారట రోజా. ఇలాంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్న తమని దాతలు ఆదుకోవాలంటున్నారు పేద కళాకారులు. సినిమాల ద్వారా కోట్లు కోట్లు సంపాదించిన స్టార్ హీరోలు, బడా దర్శకులు, నిర్మాతలు కరోనాపై రూపాయి ఖర్చులేకుండా ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టిన వదిలేయకుండా పేదలకు సాయం చేసి వాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు రావాలని కోరుకుందాం. ఒక్కో సెలబ్రిటీ కనీసం పదిమంది పేద కళాకారులకు సాయం చేసినా.. ఫిల్మ్ నగర్ నుండి ఆకలి కేకలు వినిపించవు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2xpTmxz
No comments:
Post a Comment