టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు... మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. శ్రీమంతుడు సినిమాలో లాగా నలుగురికి అండగా నిలబడ్డాడు. మహర్షిలా ఆపద సమయంలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచాడు. తాజాగా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల కోసం రూ. 25లక్షలు విరాళం ప్రకటించాడు మహేష్. లాక్ డౌన్ ప్రభావం రోజువారి ఆదాయం సంపాదించే సినీ కార్మికులపై ఎక్కువగా ఉంటుందన్నారు మహేష్. అందుకే... వాళ్ల కోసం రూ.25లక్షలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న పరిస్థితులుల్లో సినీ ఇండస్ట్రీకి చెందినవారంతా సీనీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మహేష్ రూ. కోటి సాయం అందించారు. ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షల చొప్పున ఆయన విరాళం ప్రకటించారు. కోవిడ్ 19పై కలిసికట్టుగా పోరాడదామని మహేష్ పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిద్దామన్నారు. ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం పెరుగుతుంది, మనం ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని అంతకుముందు మహేష్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ నుంచి కరోనా వైరస్ కోసం పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. నితిన్ రూ. 20 లక్షలు, చిరంజీవి రూ. కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ రూ. కోటి, రామ్ చరణ్ రూ.75 లక్షలు, పవన్ కళ్యాణ్ రెండు కోట్లు విరాళంగా ప్రకటించారు. అటు పలువురు ఉద్యోగులు కూడా తమ జీతాల్ని విరాళంగా ప్రభుత్వాలకు అందిస్తున్నారు. పలువురు క్రీడాకారులు సైతం కరోనా వేళ కదిలి వస్తున్నారు. పీవీ సింధు కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JnFGWl
No comments:
Post a Comment