కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రముఖ నటుడు, స్టార్ వార్స్ ఫేమ్ ఆండ్రూ జాక్ మృతిచెందారు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో ఆయన సర్రేలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్ మెకలాగ్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఆయన మృతి తీరని లోటన్నారు. 76 ఏళ్ల జాక్ స్టార్ వార్స్ ఎపిసోడ్ 7,8లలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హేమ్స్ వర్త్ లకు డయలెక్ట్ కోచ్ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్ కోచ్( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న జాక్ భార్య గేబ్రియల్ రోజర్స్ కూడా ఆయన మృతిపై స్పందిచారు. రెండు రోజుల క్రితం జాక్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 లక్షల మంది కరోనా బారిన పడగా, 42వేల మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో ప్రముఖ నటులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో 45 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై తీవ్ర ఆందోళన నెలకొంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aBpNHV
No comments:
Post a Comment