Sunday, 29 March 2020

బర్త్‌డే రేపు.. ఫ్రెండ్ అంటావ్ మళ్లీ: కీర్తి సురేష్ గాలి తీసేసిన నితిన్

హీరో నితిన్ సినిమాల్లో చాలా క్యూట్‌గా, లవర్ బోయ్‌లా కనిపిస్తారు కానీ.. బయట మాత్రం చాలా అల్లరి. అవతలవాళ్లని ఆటపట్టిస్తూ ఉంటారు. ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో రష్మిక మందనను ఎలా ఆటపట్టించారో మనం చూశాం. రష్మిక కుక్క బిస్కెట్లు తింటారంటూ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పేశారు. ఇది కాస్త బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కీర్తి సురేష్ గాలి తీసేశారు నితిన్. దీనికి కారణం ఆమె ఒక్కరోజు ముందు నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం. నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ‘రంగ్ దే’ అనే సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం (మార్చి 30న) నితిన్ పుట్టినరోజును పురష్కరించుకుని ఒక్కరోజు ముందు.. అంటే ఆదివారం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అర్జున్‌గా నితిన్, అనుగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. Also Read: అయితే, ఈ మోషన్ పోస్టర్‌ను ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విషింగ్ యు ఎ హ్యాపీ క్వారంటైన్ బర్త్‌డే అర్జున్! లవ్, అను’’ అని కీర్తి సురేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నితిన్ రిప్లై ఇచ్చారు. తన చమత్కారాన్ని ప్రదర్శించారు. ‘‘పుట్టినరోజు రేపు అను.. బెస్ట్ ఫ్రెండ్ అంటావు మళ్లీ.. రేపు విష్ చెయ్యి మళ్లీ.. బై’’ అని సీరియస్‌గా కామెడీగా ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. రచన, దర్శకత్వం వెంకీ అట్లూరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2X2M7qb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....