Thursday 26 March 2020

చరణ్ వీడియో కోసం వర్క్‌ ఫ్రమ్ హోం.. తమిళ డైలాగులు ఇరగదీసిన తారక్

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో చాలా మంది ఇళ్లలో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. అయితే, తమ అవసరాన్ని బట్టి కొంత మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఈ లాక్‌డౌన్ సమయంలో తమ చిత్రాలకు సంబంధించి వాళ్ల స్క్రిప్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. వీరిలో RRR సినిమా టీమ్ కూడా ఉంది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RRR నుంచి ఆయనకొక సర్‌ప్రైజ్ వీడియో ఇవ్వబోతున్నట్టు నిన్న ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆ వీడియోను విడుదల చేయనున్నట్టు చెప్పారు. కానీ, అది కాస్త ఆలస్యమైంది. అయితే, దీనికి కారణం వర్క్ ఫ్రమ్ హోం అని అర్థమవుతోంది. ఎందుకంటే, సరిగ్గా ఈ వీడియో విడుదల చేయాల్సిన సమయంలో సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, తమిళ మాటల రచయిత మధన్ కార్కి ట్వీట్లు చేశారు. RRR మూవీ కోసం తాము ఇంటి నుంచే పనిచేస్తున్నట్టు వెల్లడించారు. Also Read: RRR మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈరోజు వీడియోను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. రామ్ చరణ్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ వీడియోను ఇవ్వడానికి ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి, ఆయా భాషల మాటల రచయితలు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. తమిళ వర్షన్ వీడియో కోసం పనిచేసినప్పుడు రాజమౌళి, కీరవాణి, మధన్ కార్కి కలిసి వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ తమిళ డైలాగ్ డెలివరీని పర్యవేక్షించారు. Also Read: అయితే, ఎన్టీఆర్ తమిళ డైలాగ్ డెలివరీ చూసి రచయిత మధన్ కార్కి ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ‘‘RRR మూవీ కోసం దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు యం.యం.కీరవాణితో కలిసి ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాను. రీమోట్ ద్వారా వాయిస్ రికార్డింగ్‌ను పర్యవేక్షించాం. తమిళ డైలాగులను తారక్ అద్భుతంగా చెప్పారు. సినిమాలో ఆయన వాయిస్‌ను వినడానికి సిద్ధంగా ఉండండి’’ అని తమిళ ప్రేక్షకులను ఉద్దేశించి మధన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, రామ్ చరణ్ స్పెషల్ వీడియోను ప్రేక్షకులకు అందించడానికి రాజమౌళి అండ్ టీం ఎంత కష్టపడుతోందో అర్థమవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QQJGmB

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz