
కరోనా ప్రభావ పరిస్థితుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు హీరో నితిన్. తన స్నేహితురాలు, డాక్టర్ సంపత్ కుమార్, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 15న పెళ్లి, 16న దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌లో ఈ పెళ్లి వేడుకను అంగరంగవైభవంగా జరిపేందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌కు 100 మంది గెస్ట్‌లను కూడా ఆహ్వానించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో దుబాయ్‌తో పాటు అన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ డెస్టినేషన్ పెళ్లి దుబాయ్‌లో జరిపించమే ప్రధాన సమస్యగా మారడంతో హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా చేశారు. ‘‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిఉన్నాయో మీకు తెలుసు. అత్యవరస పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్ డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మిల్ని ప్రార్ధిస్తున్నాను. అంతే కాదు.. లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసి కట్టుకట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లలో మనం కాలు మీద కాలేసుకుని కూర్చుని మన కుటుంబంతతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్టు, ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ నితిన్’’ అంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు నితిన్. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తన వంతు సాయంగా రూ. 20 లక్షలు విరాళాన్ని ప్రకటించారు హీరో నితిన్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wK8mGt
No comments:
Post a Comment