Monday, 27 July 2020

ఎదురుపడిన అమ్మాయి తొడలు చూపించమనడం.. నటుడు హర్షవర్ధన్ బోల్డ్ కామెంట్స్

మందుగా నటుడు, దర్శకుడు, రచయిత, కమెడియన్ అయిన ఎవర్ని ఉద్దేశించి ఈ మాట అన్నారో తరువాత చూద్దాం కాని.. ముందుగా ఆయన ఏమన్నారో చూద్దాం.. ‘అమ్మాయిల తొడలే కాదు.. చిటికిన వేలు గోరు కూడా అపురూపమే, ఆహ్లాద భరితమే.. ఐతే!! అమ్మాయిలు తమ అందాలని.. అర్హత ఉన్న వాళ్ళకే చూపించాలి అనుకుంటారా? చూడటానికి వెంపర్లాడే ప్రతీ మగాడికి చూపించాలి అనుకుంటారా? పోర్న్ స్టార్స్, నటీమణులు, మోడల్స్, ఈవెంట్స్‌కి వేసుకునే పార్టీ వెర్స్ వాళ్ళ వాళ్ళ ఛాయిస్‌కి కట్టుబడి వేసుకుంటారు అనుకోవాలా.. ?లేక.. ఆడపుట్టుక మగాడి నయనానందంకి మాత్రమే ఉపయోగపడేది అన్న 'నగ్న' సత్యాన్ని అర్ధం చేసుకుని నడచుకుంటారా? నాకు ఎదురు పడిన అమ్మాయిని తొడలు చూపించమని బోల్డ్ గా (?) అడగడం.. నా అర్హతా ? అహమా ? ఆరాధనా..? శృంగారమా? చమత్కారమా ? పురోగతా? పురుషుని హక్కా ? నా సరదా సంగతి సరే.. నేను మెచ్చిన అమ్మాయికి, నన్ను మెచ్చిన అమ్మాయికి తేడా లేదా?’’ అంటూ హర్షవర్థన్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. అక్షరాలను ఇంత ‘నగ్నం’గా కూర్చిన తరువాత కూడా ఇది ఎవరి గురించి అనే సెకండ్ థాట్ లేనేలేదు. ‘నగ్నం’ మూవీ దర్శకుడు, బూతు దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మని ఉద్దేశించే అని కింది కామెంట్స్ బాక్స్‌లో స్పందనలు చూస్తే అర్థమైపోతుంది. వర్మ బోల్డ్ సమాధానాలు ఇస్తున్నారు కదా... అని ఆయన్ని పదే పదే బోల్డ్ ప్రశ్నలు వేస్తున్న మీడియాకూడా వర్మను సగం నాశనం చేస్తుంది. మీరు ఎంతమందితో సెక్స్ చేశారు.. మీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం.. అమ్మాయిల్లో మీకు బాగా నచ్చే పార్ట్ ఏంటి?? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగిన వర్మను మరింత బూతు దర్శకుడిగా మార్చేస్తున్నారు. అసలు ఈ ఇష్యూలు వర్మది ఎంత తప్పు ఉందో.. అలాంటి ప్రశ్నలు అడిగే వాళ్లది అంతే తప్పు అంటూ హర్షవర్థన్ పోస్ట్‌పై కామెంట్ చేస్తున్నారు. ఇక ఆడదాని అందం, ఆమె వస్త్రధారణపై హర్షవర్థన్ చేసిన కామెంట్‌కి స్పందిస్తూ.. ‘ఆడపుట్టుక మాత్రమే నయనానందకరం కాదీ లోకంలో... మనసుని ఆహ్లాద పరిచేది ఏదైనా నయనానందకరమే...అసలు పురి విప్పిన మగ నెమలిలోని అందం...జూలున్న సింహంలోని అందమైన ధీరత్వం ఆ ఆడ జాతిలో లేనేలేవు ఇక డబ్బు తీసుకొని ఒక విధికి వచ్చినపుడు డబ్బిచ్చిన వారిదే పై చేయి ఉంటుంది...ఉండాలి కూడా..ఎందుకంటే పెట్టుబడి పెట్టినోడికి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఇక ఎదురుపడిన వాళ్ళందర్నీ ఫలానా చూపించు అని ఎవరూ అడగరు.. పరిస్థితులు ముఖ్యంగా స్థితులు ప్రధాన కారణాలు. ఇరువురి అవగాహనతో ఏదైనా జరుగుతుంది’ అంటూ మరో నెటిజన్ స్పందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39xUP3z

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...