Sunday 2 August 2020

ఫేస్ మాస్క్ వాడితే మొటిమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..

మనకి మాస్క్ తెలుసు. అంటే, ఇంతకుముందు తెలియకపోయినా ఇప్పుడు మాస్క్ తెలియని వారూ, మాస్క్ లేని వారూ, మాస్కులు యూజ్ చెయ్యని వారూ ఎవరూ లేరు. డిజైనర్ మాస్కులూ, డ్రెస్ కి మాచ్ అయ్యే మాస్కులూ కూడా వచ్చేసిన రోజులివి. కానీ, ఈ మాస్క్ ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల వచే యాక్నే వస్తుంది. అందుకే సోషల్ మీడియాలో మాస్క్నే అంటున్నారు. ఫేస్ మాస్క్ మన నోరూ, ముక్కూ, బుగ్గలని బాగా కవర్ చేస్తుంది. దాని పని అదే. ఆ ప్రాసెస్ లో మాస్క్ మన స్కిన్ కి హత్తుకుని ఉంటుంది. తల తిప్పినప్పుడూ, కిందకి వంగి లేచినప్పుడూ, తల ఎత్తి చూసినప్పుడూ, హెల్మెట్ పెట్టుకున్నప్పుడూ తీసినప్పుడూ ... ఈ మాస్క్ కదులుతుంది. దానికి తోడు మాస్క్ కి ఉన్న ఎలాస్టిక్ వల్ల స్కిన్ మీద కొంత ప్రెషర్ ఉంటుంది. దాంతో అది స్కిన్ కి రాసుకున్నట్లు అవుతుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల కొంతమంది యాక్నే బారిన పడుతున్నారు. అంతేకాక రీయూజబుల్ మాస్కులని కానీ, కర్చీఫ్స్‌ని ఉతికి మళ్ళీ వాడుతుంటాం కదా. ఎక్కడైనా డిటర్జెంట్ ఉండిపోతే మూడు నాలుగు గంటల పాటూ వేసుకున్న తరువాత అది మనం పీల్చి వదిలిన గాలితో, చెమటతో కలిసి స్కిన్ ని ఇరిటేట్ చేస్తుంది. అయితే, మరి ఈ మాస్క్నే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 1. మీ శరీర తత్వానికి సరిపడే ఫ్యాబ్రిక్ తో చేసిన మాస్క్ వాడాలి. మన వెదర్ ని దృష్టిలో పెట్టుకుని ముఖానికి గాలి తగిలేలాగా ఉండాలి. 2. ఒక మాస్క్ ని మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ వాడకూడదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు ఇంకా ముందే మాస్క్ మార్చుకుంటే మంచిది. మాస్క్ ధరించిన తరువాత ఫేస్ షీల్డ్ పెట్టుకుంటే మాస్క్ ని కదపకుండా ఉండచ్చు. 3. సన్ లైట్ లో చాలా వరకూ క్రిములు పోతాయి. అందుకని వాడిన ప్రతి సారీ మాస్క్ ని ఉతక్కుండా, కనీసం నాలుగు గంటలు ఆ మాస్క్ కి సూర్య రశ్మి తగిలేలా ఉంచితే సరిపోతుంది. కొన్ని మాస్క్ లు పెట్టుకుంటే వాటిని తిప్పి తిప్పి వాడొచ్చు. ఉదాహరణకి, మీ దగ్గర ఐదు మాస్కులు ఉన్నాయనుకోండి. మీరు రోజుకి రెండు మూడు గంటల కంటే ఎక్కువ ఇంటి బయట గడపకపోతే మీకు రోజుకో మాస్క్ సరిపోతుంది. ఇంటికి వచ్చాక ఆ మాస్క్ ని ఎండలో ఆరబెట్టండి. ఆరో రోజున ఇన్ఫెక్షన్స్ గురించి ఎలాంటి భయం లేకుండా మొదటి రోజు వేసుకున్న మాస్క్ వాడుకోవచ్చు. ఈ మాస్క్నే ని ఎలా క్లీన్ చేయాలి? క్లియరసెంట్ అప్లై చేయడం బెస్ట్ పద్ధతి. లేదంటే, గంధం అరగదీసి యాక్నే ఉన్న ప్లేస్‌లో అప్లై చేయండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2Pf41Rk

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...