Sunday, 30 August 2020

ప్రభాస్‌పై అమెరికన్ పాప్ సింగర్ ప్రశంసలు.. బిగ్ థ్యాంక్స్ చెప్పిన రెబల్ స్టార్

పాన్ ఇండియా స్టార్ హీరోగా, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘’. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ గతేడాది ఆగస్టు 30న విడుదలైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బాగానే వసూలు చేసింది. అయితే, తెలుగు సహా ఇతర భాషల్లో రాణించలేకపోయింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూలుచేసింది. ఇదిలా ఉంటే, నేటితో ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే, హీరో ప్రభాస్ తన డైహార్డ్ ఫ్యాన్స్‌కి, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, అమెరికన్ పాప్ సింగర్, మోడల్ మెర్సీకి కూడా ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ఒక కారణం ఉంది. సాహోలో ‘బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ వచ్చే ఇంగ్లిష్ సాంగ్‌ను మెర్సీ ఆలపించారు. ‘సాహో’ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మెర్సీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఆమె పాడిన సాంగ్‌ను కూడా పోస్ట్ చేశారు. మెర్సీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ‘సాహో’ సెలబ్రేషన్స్‌తో నింపేశారు. ఇప్పటి వరకు అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ప్రభాస్ ఒకరని మెర్సీ కొనియాడారు. నిజాయతీగా చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తని ప్రశంసించారు. ప్రభాస్‌తో మరోసారి కలిసి పనిచేయాలనుందని పేర్కొన్నారు. అలాగే, ‘సాహో’ వంటి సినిమాలో తనకు పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని మెర్సీ అన్నారు. చాలా మంచి టీమ్‌తో తాను పనిచేశానని సంతోషంగా చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gL4ndE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....