Saturday, 29 August 2020

మూడేళ్ల నుంచీ నేను గర్భవతినే.. బేబీ బయటకు రానంటోంది: సమంత

అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన కొన్ని నెలలకే ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయి. సమంత గర్భం దాల్చారంటూ ఇప్పటికే చాలా సార్లు వదంతులు వచ్చాయి. సమంత కూడా వాటిని ఖండిస్తూ వచ్చారు. తాజాగా సమంతకు మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చాట్ సెషన్‌ను నిర్వహించారు. తన ఫాలోవర్లు అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. అయితే, ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్న.. దానికి సమంత ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ‘మీరు గర్భం దాల్చారా’ అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమంత చాలా సమయస్ఫూర్తితో, చమత్కారంగా సమాధానం ఇచ్చారు. తాను 2017 నుంచీ గర్భం దాలుస్తూనే ఉన్నాను అని ఇప్పటి వరకు వచ్చిన వదంతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ సమంత రిప్లై ఇచ్చారు. ‘‘నేను 2017 నుంచీ గర్భవతినేనని భావిస్తు్న్నాను. ఈ బేబీ నిజంగా బయటికి రావడానికి ఇష్టపడటం లేదని నా భావన’’ అని సమంత వీడియో ద్వారా రిప్లై ఇచ్చారు. నాగచైతన్య, సమంత వివాహం 2017 అక్టోబర్ 6న గోవాలో జరిగింది. ఆ తరవాత ఈ జంట హనీమూన్‌కు విదేశాలకు వెళ్లింది. ఇక ఆ తరవాత సమంత ప్రెగ్నెన్సీ వార్తలు మొదలైపోయాయి. గడిచిన మూడేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని చూసి చూసి సమంతకు కూడా విసుగొచ్చినట్టుంది. అందుకే, మళ్లీ అదే ప్రశ్న అడిగేసరికి వెటకారంగా సమాధానం ఇచ్చారు. ఇక, సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను అంగీకరించారు. నయనతారతో కలిసి ఆమె నటించబోతున్నారు. Also Read: మరోవైపు, ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన సమంత.. ఇటీవలే తన డబ్బింగ్‌ను పూర్తిచేశారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, గుల్ పనగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి సమంత అడుగుపెడుతున్నారు. ఇక, అశ్విన్ సరవణన్ దర్శకత్వంలోనూ ఒక తమిళ సినిమాను సమంత అంగీకరించారు. హారర్ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రసన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EOxxv2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....