షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా స్టార్ హీరోలు మాత్రం భయపడుతున్నారు. తమ మూలంగా యూనిట్ సభ్యులు రిస్క్‌లో పడకూడదని భావించి ఇంకా ఏ స్టార్ హీరో షూటింగ్ మొదలుపెట్టలేదు. కానీ, అక్కినేని నాగార్జున ధైర్యం చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఆయన మేకప్ వేసుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న తొలి స్టార్ హీరో నాగార్జునే. అయితే, ఇప్పుడు ఆయన బాటలోనే అక్కినేని నడుస్తున్నట్టు సమాచారం. నాగచైతన్య, తమ ‘లవ్ స్టోరీ’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుందట. అన్ని జాగ్రత్తలూ చాలా కఠినంగా పాటిస్తూ ఈ షూటింగ్ చేయనున్నారని అంటున్నారు. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. 15 రోజుల షెడ్యూల్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని టాక్. Also Read: ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే తక్కువ మంది సిబ్బందితో పూర్తిచేయాలని శేఖర్ కమ్ముల టీమ్ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా, ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QAiLe7
No comments:
Post a Comment