Sunday, 30 August 2020

S. Radha Krishna: నిర్మాత చినబాబు బర్త్ డే.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

నేడు (ఆగష్టు 31) టాలీవుడ్ ప్రొడ్యూసర్, మృదుస్వభావి . ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, పీఆర్‌ఓలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉండే ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ స్వీట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. చినబాబు అసలు పేరు . హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ స్థాపించి పలు సినిమాలు రూపొందించారు చినబాబు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు చినబాబు. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం 'ఆత్మకథ' సినిమా తీసి నష్టాలు మూటగట్టుకున్న ఆయన.. తిరిగి 'జులాయి' సినిమాతో మరోసారి నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ వెంటనే ''సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..'' సినిమాలతో లాభాల బాట పట్టారు. ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసిన చినబాబు నిర్మాతగా ఎదిగిన తీరు, సాధించి తీరాలనే ఆయన మొండితనం ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెబుతుంటారు చినబాబు. ఆయన పదునైన మాటలు తనను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఆయనతో ఎక్కువ సినిమాలు చేయాలనుందని అంటారాయన. కాగా ఇప్పటికే చినబాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ''జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..'' సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన స్థాపించిన బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ సక్సెస్‌ఫుల్ సినిమాలతో ముందుకెళ్తోంది. హారిక, హాసిని తన ఇద్దరు కూతుళ్ళ పేర్లు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చినబాబు. ఇండస్ట్రీలో మృదుస్వభావిగా పేరున్న చినబాబుకు మీ మా 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QAl40K

No comments:

Post a Comment

'Manoj Kumar Was Upset With Me'

'It is true Manoj Kumar was an excellent director with an unbeatable music sense.' from rediff Top Interviews https://ift.tt/ZNJps...