ఒకప్పుడు సినిమాల్లో సందడి చేసిన మహేష్ సతీమణి నమ్రత.. ఇప్పుడు సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుకుగా పోస్టులు పెడుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా భర్త సినిమా ప్రాజెక్టులు, , గౌతమ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నమ్రత షేర్ చేసిన పిక్, దానిపై ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో గత నాలుగు నెలలకు పైగా భార్యా పిల్లలతో ఇంట్లోనే సరదాగా గడుపుతున్నారు మహేష్ బాబు. సాదారణంగానే షూటింగ్స్ చేస్తూ కూడా ఫ్యామిలీకి సమయం కేటాయించే ఆయన ఈ పూర్తి విరామాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ విశేషాలను ప్రేక్షకుల ముందుంచుతూ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది నమ్రత. ఈ క్రమంలో ఇప్పటికే తన పిల్లలు సితార, గౌతమ్‌లతో మహేష్ చేస్తున్న సరదా తాలూకు ఫోటోలు వైరల్ చేసిన నమ్రత.. తాజాగా మరో ఫోటో పోస్ట్ చేస్తూ 'నాన్న కూతురు సితార' అని ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఈ పిక్‌లో తన కూతురు సితారను ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతున్నట్లు కనిపిస్తున్నారు మహేష్ బాబు. అయితే ఇందులో మహేష్ సరికొత్త మేకోవర్ చూడొచ్చు. Also Read: ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలో 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hTqH64
No comments:
Post a Comment