మెగా బ్రదర్ గారాలపట్టి కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. ఆగష్టు 13 వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే త్వరలో వియ్యంకుడు కాబోతున్న ఐజీ ప్రభాకర్ రావు డేరింగ్ నెస్ గురించి తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో విడుదల చేశారు నాగబాబు. ఈ వీడియోలో కాబోయే వియ్యంకుడిపై ప్రసంసలు కురిపించారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల (ఆగష్టు) 31న రిటైర్డ్ కాబోతున్న ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ గారికి.. అభినందనలు తెలియజేస్తున్నా. వారితో త్వరలో వియ్యం అందుకోబోతున్నా. మా ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్ మెంట్‌తో తెలియని అనుబంధం ఉంది. మా నాన్న పోలీస్‌గా పనిచేశారు. మా నాన్నగారి కోరిక ఏంటంటే.. మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరొకర్ని ఐపీఎస్ చేయాలని.. కాని ఎవరం ఆ ఫీట్ సాధించలేకపోయాం. కాని ఇన్నాళ్లకు ప్రభాకర్ గారితో వియ్యం అందుకునే ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా ఓ పోలీస్ మా ఫ్యామిలీలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన 1990లో సర్వీస్‌లో చేరారు. అంతకు ముందు ప్రైవేట్ జాబ్ చేసేవారు. కాని పోలీస్ అవ్వి.. ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకున్నారు. అలాగే గ్రూప్ 1లో ఆఫీసర్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టారు. రీసెంట్‌గా ఆయన కరోనా ముందు వరకూ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో.. గుంటూరలో ఓ రౌడీ షీటర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్లి రౌడీయిజాన్ని కట్టడి చేశారు. అలాగే రాజమండ్రిలో టెర్రరిస్ట్‌లు చొరబడినప్పుడు వాళ్లని చాలా చాకచక్యంగా పట్టుకుని జాతీయ స్థాయిలో సన్సేషన్ అయ్యారు. రాయలసీమలో పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ వల్ల వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ వాళ్లతో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్ మెంట్‌కి సంబంధించిన వ్యక్తులు అంటే ఒకింత భయం ఉంటుంది. కాని ఆయన్ని చూసిన తరువాత ఇంత సాఫ్ట్‌గా ఉన్నారేంటి అనిపిస్తుంది. చాలా కూల్‌గా నవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే.. ప్రభాకర్ రావు గారి అబ్బాయి చైతన్యకి మా అమ్మాయి నిహారికను ఇవ్వడం. ఈ మధ్యలో వీరిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది.. త్వరలో పెళ్లి జరగబోతుంది. ఇంత మంచి ఫ్యామిలీకి మా అమ్మాయి కోడలుగా వెళ్లడం ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులతో వియ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. బావగారూ.. మీ రిటైర్డ్ మెంట్ అయిన తరువాత కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ వీడియో సందేశం ద్వారా తనకు కాబోయే బావగారిపై ప్రసంసలు కురిపించారు నాగబాబు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gMi0ti
No comments:
Post a Comment