Friday, 28 August 2020

Nagarjuna బ‌ర్త్ డే స్పెష‌ల్ : ప్రియ‌మైన మ‌న్మ‌థుడు.. పురుషోత్త‌ముడెలా?‌

"కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే" సీతారాముడు రాస్తున్నాడు.. ఆమ‌ని వ‌ర్ణాల‌ను వేటూరి వివ‌రిస్తున్నాడు. ఈ రెంటి న‌డుమా..ఎన్నో సంతోషాలను గుర్తుతెచ్చుకుని త‌న పండుగ పుట్టిన రోజు పండుగ‌కు మ‌రో అర్థం వెతుకుతున్నాడు కింగ్ . నాన్న దిద్దిన ఓన‌మాలు.. రాఘ‌వుడు చేయించిన పాద పూజ‌లు ఏఎన్నార్ కు సెంటిమెంట్లు లేవు.. రాఘ‌వేంద్ర‌రావుకు సెంటిమెంట్ పండాల్సిందే అన్న‌ది ప‌ట్టు.. అలా ఓ స‌‌న్నివేశం.. అల్లాత‌త్వము న అల‌రారే రామ‌క‌థ.. అని రాశారు వేద‌వ్యాస.. సీన్ తీస్తున్నారు.. ఇప్ప‌టివ‌ర‌కూ నాన్న‌కు పాద‌పూజ చేయ‌లేదు ఇప్పుడు నీవు చేయాలి.. ఈ స‌న్నివేశాన చేయాలి.. అంటూ రాఘ‌వేంద్ర‌రావు(రాఘ‌వుడు)..చెప్పారు.. నాగార్జున‌కు (రామ‌దాసు పాత్ర‌ధారికి) అలా శ్రీ‌రామ దా సు చిత్రంలో క‌బీరు పాత్ర‌ధారి ఏఎన్నార్ కాళ్లు క‌డిగి నెత్తిన నీళ్లు చ‌ల్లుతాడు. నాన్నంటే అది.. కృష్ణా తీరాన నాన్న... కృ ష్ణా తీరం నుంచి భాగ్య న‌‌గ‌రి వ‌ర‌కూ నాన్న.. నాన్న.. ర‌మ‌ణుడి దారిలో న‌డి చాడు .. ముళ్ల‌పూడి రమ‌ణుడి దారిలో న‌డిచాడు.. నాన్న చెప్పిన దారిలో నాగార్జున న‌డిచాడు.. నాన్న పురుషోత్త‌ముడ‌య్యాడు.. పురుషోత్త‌ముడి క‌థ‌కు కార‌కంగా నిలిచాడు కొడుకు.. ప‌గ‌లే గ‌డిచినా రాత్రే విడిచినా ఈ నాన్న ద‌గ్గ‌ర ఆ కొడుకు ఓన‌మాలు నేర్చు కుంటూనే ఉంటాడు. అత‌డు అక్కినేని నాగార్జున నేడు జ‌న్మ‌దినం.. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాకుళం వాసి, ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభుమ హంతి వెల్ల‌డిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది. క‌న్నుల్లో నీ రూప‌మే ... కొత్త షో స్టార్ట్ అవుతుంది.. సీజ‌న్ నాలుగు అని పేరు పెట్టారు.. బిగ్ బాస్ రానున్నాడు.. అంత‌కుమునుపో త‌రువాతో ఇంకొన్ని కొత్త ప‌నుల‌కు శ్రీ‌కారం దిద్దాడు. నిదరెందుకే నిజ‌మెందుకే ఈ క‌ల‌ల గాలి నాకు హాయి ఊయ‌లే అని పాడుకున్నాడు.. ఓ పాట‌లో విన్న ‌విధంగా ఇప్పుడిలా గుర్తుకువ‌స్తున్నాయా వాక్యాలు.. క‌న్నుల్లో త‌న రూపాన్నీ దాచుకుని.. మ‌ది దాచుకున్న ర‌హ‌స్యాల‌ను వెల్ల డించాడు.. నిన్నే పెళ్లాడ‌తా అని అన్నాడు..కృష్ణ వంశీతో ఆ సిని మా..ఇంత‌కూ.. ఈ సోగ్గాడికి ఇప్పుడు వయ‌స్సెంత.. మ‌రి! భాష మౌనం అయితే భావం ఏమౌతుంద‌ని.. ఆ భావమే పాటవుతుంది.. అలాంటి శ్వాసల్లో .. అలాంటి పాట‌ల్లో ఎదిగి ఒదిగాడు.. న్యూ ఏజ్ ఫిల్మ్ కు కేరాఫ్ అయ్యాడు. ఆ క‌వి అన్న‌ట్లే ఎంద‌రో నీలి క‌న్నుల్లో తేలియాడాడు.. గ్రీకువీరుడ‌య్యాడు.. అక్కినేని రాకుమార డ‌య్యాడు.. రామ‌దాసుడ‌య్యాడు.. అన్న‌మ‌య్య సినిమాతో మ‌రొక మ లుపున‌కు చేరుకుని ఏడు కొండ‌ల వాడి దీవెన‌లందుకు న్నాడు.. సినిమా బాగున్నా బాగుండ‌క పోయినా వాటి ఫ‌లితాల‌కు సం బంధం లేదు.. అయినా ఈ రాకుమారుడు వెన్నెల్లో ఆడ పి ల్లల‌తో ఆడుకున్నాడు.. అంద‌మ‌యిన ప్రేమ కావ్యాల‌కు చిరునా మాలు రాసి అంతా తానే అయ్యాడు. ఆ పాటల్లో ప‌ల్లెలు పచ్చందనాలూ, ఆ పాటల్లో కొన్ని ఆధునిక సంప్ర‌దాయాలూ, ఆ సినిమాల‌లో కొన్ని ప్ర‌యోగ‌రీతులు ఎంతో పేరు తెచ్చాయి. ఎంతో ఉన్నతుణ్ని చేసేందుకు స‌హ‌క‌రించాయి. టెలివిజ‌న్ మాధ్య‌మాన ..ఓ సారి చిరూతో అన్నారాయ‌న ఇలా మీరూ నాతో డ‌బ్బులు పెట్టండి ఏం కాదు మంచి లాభాలొస్తాయి అని! ఆ మాట న‌చ్చి మాటీ వీ అధిప‌తిగా చిరు నిలిచారు. నిమ్మ‌గ‌డ్డ మొద‌లైన దిగ్గ‌జ వ్యాపారుల‌తో క‌లిసి ఆ సంస్థ‌ను ఉన్న‌తికి తీసుకువెళ్లారు. మ‌రోవైపు టెలివిజ‌న్ మాధ్య‌మాల‌కే ఓ సంచ‌ల‌నంగా నిలిచి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే కార్య‌క్ర‌మానికి రూపుదిద్దారు. సామాన్యుల క‌థ‌ల ‌కు క‌న్నీళ్ల‌కు వారి జీవితాల‌కు కొన్ని అర్థాలు వెతికి వారిలో కొత్త ఉత్సాహం నింపారు.. సామాన్యులంతా అక్క‌డ సెల‌బ్రిటీలు అ య్యారు.. సెల‌బ్రిటీలూ ఈ షో చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. నాగార్జున బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అవును! ఎవరు కాద‌న్నారు..కానీ కొన్ని జీవితాల‌కు బ్యాక్ బోన్ కూడా! ఓ షోలో ఓ పార్టిసిపెంట్ త‌న స్వ‌హ‌స్తాల‌తో చెప్పులు కుట్టి బ‌హుమ‌తిగా ఇస్తే గుండెల‌కు హ‌త్తుకున్నాడు. సాలూరు స్వ‌స్థ‌లంగా ఉండే ఓ సాఫ్ట్ వేరు కుర్రాడి జీవితాన్ని అంద‌రికీ చెప్పి స్ఫూర్తినింపాడు.ఇలా ఎన్నో.. ఆ ఇద్ద‌రు మార్చారు శివ సినిమా లేక‌పోతే ఆయ‌న లేడు.. వెరీ రొటీన్ రామూ లేక‌పోతేనే శివ లేదు.. ఇంకా రొటీన్.. ఎవ‌రు లేక‌పోయినా ఆ సినిమా లే దు ఇది పెర్ఫ‌క్ట్ .. ఇంజినీరింగ్ చ‌దివిన కుర్రాడు ఒక‌డు.. ఇంకొక‌డూ అదే బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన వాడు.. విజ‌య‌వాడ కాలేజీ గుర్తుల‌తో సినిమా.. ఇళయ‌రాజా ప్రాణం పోశాడు.. మ‌ళ్లీ ప్రాణం పోశాడు ఈసారి గీతాంజ‌లితో.. మ‌ణి మ‌ళ్లీ లైఫ్ ఇచ్చాడు.. ఆ ఇద్దరూ లేకుంటే.. అంద‌మ‌యిన జీవితానికి ఎన్ని అర్థాలు వెతికి తీరేవాడా! వారే జీవితానికో మ‌లుపు.. వారు మ‌రింత మెరుగుద‌లకు కార ణం. ఈవేళ ఇంకొన్ని కొత్త ప్ర‌యత్నాల్లో ఆయ‌న ఉన్నారు. మంచి మామ, మంచి నాన్న ఈ రెండూ మంచిత‌నాలూ ఆయ‌నలో ఉన్నాయి. అవే అక్కినేని వారింటి వార‌సుడికి వెల‌లేని సంప‌ద‌లు కావాలి... నాగార్జున అను న‌వ యువ సామ్రాట్..కు జ‌న్మ‌దిన శు భాకాంక్ష‌లు.. సౌంద‌ర్యాలు చిందే యామిని వేళ‌ల్లోనూ.. సంధ్యా కాంతుల్లో శ్రీ‌ర‌స్తుల స‌రిగ‌మ‌ల్లోనూ..ఇంకొన్నింటిని పోగేస్తూ.. మధురిమ‌లు వింటూ వింటూ.. - ర‌త్న‌కిశోర్ శంభుమహంతి


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lt5Jx8

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk