నేడు టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వైల్డ్ డాగ్’ సెకండ్ లుక్‌ని విడుదల చేశారు. టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నాగార్జున.. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నారు. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మను పోలీస్ శాఖలో అందరూ అని పిలుస్తుంటారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజా పోస్టర్‌లో నాగార్జున గన్ గురిపెట్టి సీరియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఎన్ ఐ ఏ ఏజెంట్‌గా.. హీరోయిన్ ఆర్య పండిండ్ రా స్పెషల్ ఏజెంట్‌గా కనిపిస్తున్నారు. త్వరలో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32BFITN
No comments:
Post a Comment