
సోషల్ మీడియా అకౌంట్స్ నేటి సమాజానికి ఎంతగా ఉపయోగకరమో అంతే ప్రమాదకరం కూడా. ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలకు తాము చెప్పదలచుకుంది చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడటం, సెలబ్రిటీలను ట్రోల్స్ చేయడం లాంటివి చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పవిత్ర కూడా అలాంటి వేధింపులే ఎదుర్కొందట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా ఖాతాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది పవిత్ర. నిజానికి పవిత్ర పూరికి ఇన్స్‌స్టాగ్రామ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. @Pavithra_Puri పేరుతో అకౌంట్ మెయిన్‌టైన్ చేస్తున్న ఆమె.. ఎప్పటికపుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ పోస్టులు పెడుతుండేది. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 104K దాకా దూసుకుపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్నట్టుండి తన ఇన్స్‌స్టాగ్రామ్ డిలీట్ చేస్తున్నానని, కొత్త అకౌంట్ @PavithraPuri ఓపెన్ చేస్తున్నానని తెలిపింది పవిత్ర. అలాగే తన పాత అకౌంట్ డిలీట్ చేయడానికి కారణాలు తెలుపుతూ ఓపెన్ అయింది. Also Read: తన పాత ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో చాలా సమస్యలు వస్తున్నాయని, కొందరు ఆకతాయిలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్న కారణంగా ఆ అకౌంట్ రద్దు చేసుకొని కొత్త అకౌంట్‌కి షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పింది పవిత్ర పూరి. అయితే అంత ఫాలోయింగ్ ఉన్న అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందనే దానిపై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఇప్పటికే కొడుకు ఆకాష్ పూరి సినీ గడప తొక్కిన నేపథ్యంలో కూతురు ఎప్పుడు కెమెరా ముందుకొస్తుంది అనేది హాట్ టాపిక్ అయింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32EapI2
No comments:
Post a Comment