బాలీవుడ్ యువ నటుడు బలవన్మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ మరణం వెనుక కొందరి హస్తం ఉందని ఆరోపణలు గుప్పుమనడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని సీబీఐ రంగంలోకి దిగింది. అయితే సుశాంత్ సూసైడ్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కార్నర్ చేస్తూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆమెను లోతుగా విచారిస్తూ కూపీ లాగుతున్నారు సీబీఐ అధికారులు. ఈ పరిస్థితుల్లో చేసిన ఓ ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తోంది. ఇటు సుశాంత్‌కి, అటు రియా చక్రవర్తికి న్యాయం జరగాలంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. తాను ఇటీవల రియా, రాజ్‌దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ మొత్తం చూశాక దీనిపై స్పందించాలా వద్దా అని దీర్ఘంగా ఆలోచించి ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ తన భావాలను అందరి ముందుంచింది మంచు లక్ష్మి. ఇందులో ఆమె ప్రస్తావించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యాయి. ఓ అమ్మాయిని ఒంటరి చేసి రాక్షసురాలిగా చిత్రీకరిస్తున్నారని రియాను ఉద్దేశిస్తూ లక్ష్మి పెట్టిన సందేశంపై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె పోస్ట్ చేసిన సందేశం వివరంగా చూస్తే.. ''సుశాంత్ సూసైడ్ కేసులో నిజానిజాలేంటో తనకు తెలియదు. అయితే వాటిని తెలుసుకోవాలనుకుంటున్నా. సుశాంత్‌కు న్యాయం చేయాలని సీబీఐ సహా అన్ని రకాల ఏజెన్సీలు, అధికారులు కష్టపడుతున్న తీరు హర్షనీయం. కాకపోతే నిజానిజాలు బయటకురాకుండానే ఒకరిని నిందించడం, వేరొకరి ఫ్యామిలీని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదనేది నా అభిప్రాయం. మీడియా కథనాలు చూసి రియా కుటుంబం పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. జీవితంలో ఇలాంటి సందర్భాల్లోనే సహచరులు అండగా నిలబడాలి. రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు. అసలు విషయం బయటకొచ్చే దాకా ఆమెను నిందించడం ఆపండి'' అని మంచు లక్ష్మి పేర్కొంది. Also Read: అయితే లక్ష్మి మాటలకు తాప్సి లాంటి కొందరు సెలబ్రిటీలు మద్దతిస్తుండగా.. కొంతమంది సుశాంత్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సూసైడ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు మీరు మద్దతు ఇవ్వడమేంటని మంచు లక్ష్మిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31IWgtQ
No comments:
Post a Comment