లాక్‌డౌన్ వేళ ఎక్కువ సమయం విరామం దొరకడంతో ఇన్నాళ్లుగా వాయిదాపడిన పనులను పూర్తిచేస్తున్నారు నటీనటులు. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టేసి స్లిమ్ లుక్ లోకి మారుతున్నారు. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి పీటలెక్కుతూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలు తమ తమ ఇష్ట సఖులను పెళ్లాడగా.. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కంప్లీట్ చేసుకొని పెళ్లికి రెడీ అయింది. ఇదే బాటలో లేడీ కమెడియన్ కూడా తన ప్రియుడితో రోకా వేడుకను సీక్రెట్‌గా ఫినిష్ చేసేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రహస్య నిశ్చితార్థం తాలూకు వివరాలు తెలుపుతూ స్వయంగా తనకు కాబోయే భర్త ఫోటోను, నిశ్చితార్ధ సంగతులను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది విద్యుల్లేఖ. లాక్‌డౌన్ వేళ ఓ రేంజ్ వర్కవుట్స్ చేసి బాడీ తగ్గించిన ఆమె.. తన ప్రియుడితో పెళ్లికి రెడీ అయింది. ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్‌తో సైలెంట్‌గా నిశ్చితార్ధ కార్యక్రమాన్ని కానిచ్చేసింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. Also Read: ఆగష్టు 26వ తేదీన తమ నిశ్చితార్థం జరిగినట్లు దాదాపు 5 రోజుల తర్వాత వెల్లడిస్తూ ప్రియుడితో దిగిన పిక్ షేర్ చేసింది రామన్. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు పేర్కొన్న ఆమె.. లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పింది. మా నిశ్చితార్థం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు అని చెబుతూ విద్యుల్లేఖ పోస్ట్ పెట్టింది. తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. తండ్రి వలె కెమెరా ముందు సత్తా చాటిన ఆమె పలు తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటించి హాస్యం పండించింది. రీసెంట్‌గా ఆమె ''విశ్వమిత్ర, అర్జున్ సురవరం, వెంకీ మామ, మత్తు వదలరా'' సినిమాల్లో కనిపించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bdBRjK
No comments:
Post a Comment