టాలీవుడ్ ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట విషాదం నెలకొంది. కారుణ్య తల్లి జానకి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. బాలాపూర్ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఆమె మృతి చెందారు. జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్‌లోనే పనిచేసి రిటైర్ అయ్యారు. కారుణ్య తల్లి జానకి మరణవార్త తెలుసుకున్న పలువురు తమ విచారం వ్యక్తం చేశారు. పలువురు సింగర్స్ కారుణ్యకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కారుణ్య తల్లి అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. సైదాబాద్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కారుణ్య 2006లో సోనీ టీవీ నిర్వహించిన 'ఇండియన్ ఐడల్' కార్యక్రమంలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి ప్రముఖ గాయకుల సరసన నిలిచాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lt7U3P
No comments:
Post a Comment