Sunday, 30 August 2020

మా తాతయ్య చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. భాస్కర్ సాయం చేశాడు: ‘జబర్దస్త్’ నరేష్

‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ గురించి పరిచయం అవసరంలేదు. టీనేజ్ కుర్రాడే అయినా జన్యులోపంతో ఐదేళ్ల కుర్రాడిలా ఉంటాడు. అదే అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. తనలోని లోపాన్ని తనకు అనువుగా మలుచుకొని కమెడియన్‌గా రాణిస్తున్నాడు నరేష్. ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో నటించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో సైతం ఈవెంట్లు చేస్తూ వినోదాన్ని పంచుతున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో కలిసి తన ‘హోం టూర్’ వీడియో చేశాడు నరేష్. తన ఇంటిలో ఉన్న సామానులు, తనకు వచ్చిన ట్రోపీల గురించి నరేష్ వివరించాడు. ఈ క్రమంలో అమెరికాలో తనకు వచ్చిన తొలి షీల్డ్‌ను నరేష్ చూపించాడు. ఈ షీల్డ్ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. అమెరికా ఈవెంట్‌కు వెళ్లే సమయంలో తన తాతయ్య చనిపోయారని.. అయితే, ఆ సమయంలో తాతయ్య అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బుల్లేవని నరేష్ వెల్లడించాడు. అప్పుడు భాస్కర్ అన్న దగ్గర అప్పు తీసుకున్నానని తెలిపాడు. Also Read: తాతయ్య కార్యక్రమాలు పూర్తయని తరవాత అమెరికా ఈవెంట్‌కు వెళ్లానని.. అక్కడ ఇచ్చిన డబ్బులతో భాస్కర్ అప్పు తీర్చానని నరేష్ చెప్పాడు. అమెరికాలో తాను చేసిన తొలి ఈవెంట్ కూడా అదేనని, అందుకే ఆ షీల్డ్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. నిజానికి నరేష్ తన ఇంటిని షీల్డ్స్‌తో నింపేశాడు. కళాకారుడికి డబ్బుల కన్నా ఈ షీల్డ్స్ అంటేనే ప్రాణమని చెప్పుకొచ్చాడు. త్వరలోనే తాను ఒక పెద్ద ఇల్లు కొంటానని అన్నాడు. ప్రస్తుతం నరేష్ ఉంటోన్న ఇంటిని కింది వీడియోలో చూడొచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jmVV5W

No comments:

Post a Comment

'Consumers should not pay higher taxes for clean tech'

'We are not asking for incentives, but at least taxation can be aligned such that the rupee tax on consumers remains the same.' fr...