ప్రముఖ తెలుగు సినీ హీరో నాగార్జునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ‘కింగ్’ 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో నాగార్జునకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ నాగార్జునకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని .. ముఖ్యమైన విషయాలు, వ్యక్తులపైనే ట్వీట్ చేస్తుంటారు. ముఖ్యంగా బర్త్ డే విషెస్‌లు చెప్పడం వంటివి చాలా అరుదు. కానీ, ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నాగార్జునకు సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు, నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వానికి నాగార్జున మద్దగా నిలిచారన్న ప్రచారం ఉంది. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ను కలిసి పరామర్శించిన, ఎన్నికల సందర్భంగా సహకారం అందించిన అతి కొద్ది మంది సినీ ప్రముఖుల్లో నాగార్జున కూడా ఒకరు. ఈ నేపథ్యంలో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lxLDlk
No comments:
Post a Comment