Thursday, 27 August 2020

రిజర్వేషన్లు తీసుకోవడం అంటే అడుక్కుతినడమే: పూరీ కామెంట్స్‌పై దళిత సంఘాల ఆగ్రహం

‘పేదలకు ఓటు హక్కు తీసేయాలి.. నిరక్షరాస్యులకు ఓటు పీకేయాలి.. తెల్ల రేషన్ కార్డులు ఉన్నోడు ఓటుకి అనర్హుడు. పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదు.. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు.. పుట్టాం కదా ఓటు గుద్దేస్తాం అంటే కుదరదు. లీడర్స్ జీవితాలను తాగుబోతుల చేతుల్లా ఎలా పెడ్తాం’.. ఈ మాటలు ఎవరో తాగుబోతు తాగి వాగుతున్నవి కాదు.. సన్సేషనల్ డైరైక్టర్ నోటి నుంచి వచ్చిన మంటపుట్టించే మాటలు. లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోడ్‌కాస్ట్ ఆడియోలతో తన అభిప్రాయలు తెలియజేస్తున్నారు. తాజాగా దేశంలో ఉన్న పేదలు, రిజర్వేషన్లపై సంచలన కామెంట్స్ చేశారు. అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజినీకాంత్ వీళ్లందరూ పేద కుటుంబంలోనే పెట్టారు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు.. పేదోడిగా చావడం తప్పు. ఈ దేశంలో గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్‌లు తీసుకుని చాలామందికి పేదోడిగా బతకడం అలవాటైపోయింది. గవర్నమెంట్ వాళ్లకి సాయం చేయడం కరెక్ట్ కాదు. అందుకే చిన్న చిన్న మార్పులు రావాలి. వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీవితం నీ చేతిలో ఎలా పెట్టమంటావ్ అని అడగాలి. నీకు రేషన్ కార్డ్ కావాలంటే ఓటు ఫెసిలిటీ కోల్పోతావ్ అని చెప్పాలి. చెప్తే వాడికి ఏది అవసరమో అదే తీసుకుంటారు. అప్పుడు నిజంగా కష్టంలో ఉన్నవాడు వైట్ కార్డ్ తీసుకుంటాడు. ఓటు హక్కు కావాలనుకున్నవాడు దాని కోసం కష్టపడతాడు. ఓటు హక్కు లేకపోతే సారా పేకెట్ ఉండదు. సారా ప్యాకెట్‌తో లీడర్‌ని డిసైడ్ చేసే బ్యాచ్ ఎలక్షన్‌కి ముందే కట్ అయిపోద్ది. లేకపోతే మన నాయకుల జీవితాలు తాగుబోతుల చేతుల్లో ఉంటాయి. పేద పిల్లలకు మినిమమ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. కాని ఉన్నత విద్య చదువుకోవాలంటే లోను ఇచ్చి దాన్ని రీప్లేస్ చేయాలని గవర్నమెంట్ అడగాలి. వాడు ఉద్యోగం చేసి గవర్నమెంట్ అప్పు తీర్చాలి. గవర్నమెంట్ ఫండ్ రూపాయితో సహా వస్తుంది. అప్పుడే స్టూడెంట్స్ ఒళ్లు దగ్గర పెట్టుకుని చదువుతారు. అలాగే రిజర్వేషన్లు కూడా కులాన్ని బట్టి ఇవ్వకూడదు.. పేదోడు ఏ కులంలో ఉన్నా.. సపోర్ట్ చేయాలి. వాళ్ల పిల్లలు చదువుకునేలా చేయాలి. బూత్‌లో ఓటేసే ప్రతి ఒక్కడు అవగాహనతో ఉండాలి. నిరక్షరాస్యులకు ఓటింగ్ తీసేయాలి. ఓటు వేయాలి అంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. పుట్టాం కదా గుద్దేస్తాం అంటే.. కుదరదు. అందరూ ఓటు హక్కు సంపాదించుకోవాలి. ప్రభుత్వాలని లీడర్స్‌ని అడుక్కోవడం మానేద్దాం. ప్రపంచంలో ఏ జంతువు మరే జంతువు దగ్గర చేయి చాచదు. తిండి కోసం కష్ట పడుతుంది లేదంటే చస్తుంది. నీ జాతిని తిడితే నీకు కోపం వస్తుంది కదూ.. మరి అదే జాతిని కించపరుస్తూ పేదోడిలా ప్రభుత్వం ముందు నిలబడటం తప్పుకాదా?? కష్టపడు.. నీ జాతి తలెత్తుకునేలా చేయి.. మా జాతికి రిజర్వేషన్లు వద్దు.. వేరే వాడికి ఇవ్వండి అని చెప్పేలా ఉందాం.. అప్పుడు మారుతుంది ఇండియా. కాళ్లు చేతులు బాగున్నప్పుడు మన చేతులు చాచొద్దు. నా ఒక్క కుటుంబాన్ని నేను చూసుకోలేనా?? ఆ ట్రైన్ పేరు ఏంటి గరీబ్ ఎక్స్ ప్రెస్‌నా?? నా దేశంలో అలాంటి పేరు తీసెయ్.. నా సాంప్రదాయం ఏంటి సంస్తృతి ఏంటి?? నాదేశంలో ఇలాంటి పేరు ఏంటి?? నీ యబ్బా.. అని అందరం చెప్పేలా ఉందాం.. జన గణ మన’ ఓ రేంజ్‌లో స్పీచ్ ఇచ్చారు దర్శకుడు పూరీ జగన్నాథ్. అయితే పూరీ కామెంట్స్‌పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన ఓ దర్శకుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి రాజ్యాంగాన్నే హేళన చేయడం దారుణం అని పూరీకి కౌంటర్లు ఇస్తున్నారు. పేదల ఏమైపోతారని ఆలోచించకుండా.. లీడర్ ఏమైపోతారని ధనిక వర్గాల కోసం తపన పడుతున్న పూరీపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. Read Also: పూరీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పలు దళిత సంఘాలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండగా.. రాజేష్ మహాసేన దళిత నాయకుడు పూరీని బండబూతులు తిడుతూ ప్రశ్నలు సంధించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘పూరీ జగన్నాథ్ దళితుల పట్ల ఎంత విషం దాచుకున్నాడో ఆయన మాటలను బట్టి అర్థమౌతుందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లంటే నీకు అంత చులకనా?? తెల్ల రేషన్ కార్డు ఉంటే ఓటు హక్కు తీసేయాలని అంటున్నావ్.. అదే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు నీ సినిమాలు చూడకపోతే.. బొచ్చు పట్టుకుని రోడ్డు మీదికి వస్తావ్.. నీ సినిమాలు చూసేది చప్పట్లు కొట్టేది.. హంగామా చేసిది.. మాస్ ఆడియన్స్.. మాస్ ఆడియన్స్ అంటే తెల్లరేషన్ కార్డ్ ఉన్నవాళ్లే.. మల్టీ ప్లెక్స్‌లలో సినిమాలు చూసేవాళ్లు కాదు. చదువులేని వాడికి ఓటు హక్కు ఉండకూడదంటున్నావ్ సరే.. మరి చదువుకోని వాడు పోటీ చేయకూడదని చెప్పగలవా?? చదువుకోని వాడి చేతిలో ఒక లీడర్ భవిష్యత్ ఎలా పెట్టాలనా?? చదువులేని వాడి చేతిలో ప్రజల జీవితాలు ఎలా పెట్టాలని ఆలోచించవా? ఆ ప్రశ్న కనుక వేశావ్ అనుకో.. ఇండస్ట్రీ నుంచి బయటకు గెంటేస్తారు. లీడర్లపై మాట్లాడలేక పేదలపై మాట్లాడతావా? రిజర్వేషన్లు కులాన్ని బట్టి కాక.. పేదరికాన్ని బట్టి ఇవ్వాలా?? మంచిదే కాని.. దాంతో పాటు అసలు కులం ఎందుకు ఉండాలి? రిజర్వేషన్లు రద్దు చేయాలన్నావ్ బాగానే ఉంది. మరి కులాన్ని రద్దు చేయాలని నీ నోటి నుంచి ఎందుకు రాలేదు? పుట్టుకతో వాడు అంటరాని వాడు.. తక్కువ వాడు అయినా పర్లేదు కాని.. నీ కులం అలాగే ఉండాలి.. కులం వల్ల వచ్చే రిజర్వేషన్లు వద్దా?? అసలు నువ్ మనిషివేనా?? ఒక జంతువు ఇంకో జంతువు దగ్గర చేయి చాపదా? పూరీ.. ఒక జంతువు ఇంకో జంతువు చేత ఎక్స్ పోజింగ్ చేయించి బతుకుతుందా?? జంతువు జంతువులాగే బతుకుతుంది.. దానికి కులం ఉండదు, మతం ఉండదు, లంచం ఉండదు.. తక్కువ ఎక్కువ ఉండదు.. మరి మనుషుల్లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి. ముందు అవి పోవాలి కదా..? అది మాట్లాడావా? పూరీ.. ? హీరోయిన్లు తొడల్ని చూపించి బతికే నువ్వు.. తెల్లరేషన్ కార్డ్ ఉన్న పేదల గురించి మాట్లాడతావా?? వాళ్లు సారా పేకెట్ల కోసం ఓటు వేస్తారని మాట్లాడే వెధవ్వి నువ్వు.. కనీసం నీకు కొంచెమైనా జాలి ఉందా.? వాళ్లని తాగుబోతులని అంటావా?? నువ్ తాగి తందనాలు ఆడవా? రిజర్వేషన్లు లేని వాళ్లు తాగడం లేదా?? తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవాళ్లే తాగుతున్నారా?? అంతెందుకు సినిమా ఫీల్డ్‌లో మీ దర్శకుల్లో ఎంతమంది దర్శకులు ఎస్సీ ఎస్టీ వాళ్లు ఉన్నారు? అసలు వాళ్లని రానిస్తున్నారా?? నీ హీరోయిన్లు తొడలపై డబ్బులు సంపాదిస్తున్నావ్ కాబట్టి.. నీ కొడుకుని చదివిస్తున్నావ్.. మరి రిక్షా తొక్కేవాడు కొడుకు పనిచేయకపోతే ఏం చేయాలి? అందుకే పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు. వీళ్లలో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా ఉన్నారు. వాళ్ల కోసమే రిజర్వేషన్లు. ఉన్నత విద్యకు గవర్నమెంట్ డబ్బులు తీసుకోవాలా? ఈ బోకు సలహాలు ఇస్తున్నావ్.. రాజ్యాంగం రాసిన వాళ్లకు ఇవన్నీ తెలియవా?? ప్రపంచాన్ని చదివిన వాళ్లురా వాళ్లు. వాళ్లని విమర్శించే స్థాయికి బూతు సినిమాలు తీసే నువ్ ఎదిగావా? అసలు దళితులు గురించి వాళ్ల జీవన విధానం గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే చెప్పుతో కొడతాం అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు దళిత సంఘ నాయకులు. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jp7ae6

No comments:

Post a Comment

The PT Teacher Behind Two WPL Stars

'Today when I see them talking to people from different countries confidently, I realise that education does not come from classrooms al...