ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాలు మరీ ఎక్కువయ్యాయి. సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే సినిమా అంతా బూతు సీన్లతో నింపేస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే మరీ శృతిమించిన అడల్ట్ సీన్స్ పెడుతుండటం చూస్తూనే ఉన్నాం. సెగలు పుట్టించే సీన్స్ పెట్టేసి యువతరానికి గాలం వేస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఇక ఈ సంగతి అటుంచితే మోడ్రన్ యువతి ''అబల కాదు సబల'' అనే కాన్సెప్ట్ తీసుకొని '' అనే ఓ మూవీ రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మగువ ట్రైలర్‌లో బూతు సీన్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని బిల్డింగ్‌కు తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేయడం, అయితే తెల్లారేసరికి ఆ అమ్మాయి ప్రాణాలతో బయట పడటాన్ని మధ్య మధ్యలో అడల్ట్ సీన్స్ పెట్టి ఆకర్షించే ప్లాన్ చేశారు. ''మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట.. నా మాట'' అనే హీరోయిన్ డైలాగ్‌తో ట్రైలర్ ముగించారు. Also Read: యూనివర్సల్ డ్రీమ్స్ బ్యానర్‌పై దర్శకత్వంలో రూపొందుతున్న 'మగువ' మూవీలో సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి తదితరులు నటించారు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ev9B0f
No comments:
Post a Comment