‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా సత్తా చాటిన ‘జబర్దస్త్’ కమెడియన్ మరో సినిమాను పట్టాలెక్కించారు. సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కాబోతోంది. Also Read: ఈ సినిమా గురించి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. ‘‘హీరో సుధీర్, నా కాంబినేషన్‌లో రాబోతోన్న రెండో సినిమా ఇది. ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. సప్తగిరి ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. చక్కటి సంగీతం, యూత్‌ని ఆకట్టుకునే పాటలు, అదిరిపోయే కామెడీ పంచ్‌లు హైలెట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అన్ని కమర్షియల్ హంగులతో, సీనియర్ నటీనటులందరి కలయికతో ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. మా నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఖర్చుకు వెనకాడకుండా మంచి మంచి లొకేషన్స్‌లో చిత్రాన్ని రూపొందించడానికి సహకరిస్తున్నారు’’ అని తెలిపారు. కాగా, ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, రాజ్‌బాల తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lu17XM
No comments:
Post a Comment