Thursday, 27 August 2020

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మందిలో ఐదుగురు యాంకర్లు!

బిగ్ సీజన్ 4 ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇస్తూ స్టార్ మా అఫీషియల్ ప్రోమో విడుదల చేయడంతో ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6 సాయత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుంది. తెలుగు టెలివిజన్‌లోఅత్యుత్తమమైన రేటింగ్స్ సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అదిపెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్ బాస్‌ను ఈసారి వినూత్న తరహాలో అందించనున్నారు. వంద రోజులకు పైగా బుల్లితెర అభిమానులకు వినోదాన్ని పంచనున్నారు. అయితే ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇక సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానికి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా నోయల్, టీవీ 9 దేవి నాగవల్లి, రఘు మాస్టర్, దేత్తడి హారిక తదితరులు పేర్లు గట్టిగా వినిస్తుండగా.. రీసెంట్‌గా 14 మందితో కూడి లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. 1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి (TV9 News Presenter Devi) 2. యాంకర్ లాస్య మంజునాథ్ (anchor lasya manjunath) 3. జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash) 4. గంగవ్వ (YouTube Gangavva) 5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ (Amma Rajasekhar) 6. సింగర్ నోయల్ (Noel Sean) 7. హీరోయిన్ మొనాల్ గుజ్జార్ (Actress Monal Gajjar) 8. యాంకర్, యూట్యూబ్ సంచలనం దేత్తడి హారిక (Dethadi Harika) 9. యాంకర్ అరియానా గ్లోరీ (Anchor Ariyana Glory) 10. యాంకర్ తనూజా పుట్టాస్వామి (Anchor Thanuja Puttaswamy) 11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్ (Syed Sohel Ryan) 12. యూట్యూబ్ స్టార్ మెహబూబా దిల్ సే (mehaboob dil se) 13. కరాటే కళ్యాణి (Karate Kalyani) 14. డైరెక్టర్ సూర్య కిరణ్ (Director Surya Kiran) అయితే ఈ 14 మందిలో సగానికిపైగా యాంకర్లు.. టీవీ ఇండస్ట్రీలకు చెందినవారే కాగా.. గతంతో పోల్చుచుంటే కాస్త సినీ గ్లామర్ తగ్గినట్టుగానే అనిపిస్తుంది. అయితే ఇది లిస్ట్‌లో ఉన్నవాళ్లు షోలు కనిపిస్తారా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకూ ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31xRnUr

No comments:

Post a Comment

'Rajinikant Never Jokes About His Superstardom'

'I believe that whether it is Rajini sir or Shah Rukh Khan or Dilip Kumarsaab, these stars are blessed with a cosmic energy. It's a ...