సూపర్ స్టార్ కూతురు సూపర్ ఫాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచే తన చలాకీతనంతో ఘట్టమనేని ఫ్యాన్స్ అందరికీ దగ్గరైంది సితార. పాటలు పాడటం, డాన్సులేయడం, డైలాగ్స్ చెప్పడం ఇలా ఆల్ రౌండ్ ప్రతిభ చూపిస్తూ వావ్! అనిపించుకుంది. ముఖ్యంగా తన తండ్రి మహేష్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేస్తూ ఆకర్షిస్తున్న సితార పాప.. తాజాగా 'మైండ్ బ్లాక్' చేసే చిందులేసింది. Also Read: ఈ ఏడాది ఆరంభంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని డ్యాంగ్ డ్యాంగ్ పాటకు స్టెప్పేసి గతంలోనే ఫిదా చేసిన సితార.. ఈ సారి 'మైండ్ బ్లాక్' పాటకు డాన్స్ చేసి మరోసారి పరేషాన్ చేసేసింది. ఈ పాటలో హీరోయిన్ రష్మిక మందన వేసిన డాన్సింగ్ మూవ్‌మెంట్స్ అచ్చుగుద్దినట్లు దించేసింది సితార. ఈ వీడియోను నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. సితార చేసిన ఈ మెస్మరైజ్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూసి.. ''నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్'' అంటూ అదే సినిమాలోని డైలాగ్‌తో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మహేష్ బాబు.. కూతురు సితార, కొడుకు గౌతమ్‌లతో జాలీగా గడుపుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' అతి త్వరలో సెట్స్ మీదకు రానుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా ఫినిష్ అయ్యాక రాజమౌళితో సినిమా చేయనున్నారు మహేష్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hKhwoy
No comments:
Post a Comment