ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం యంగ్ హీరోయిన్ మాధవీలతకు ఓ అలవాటు. ఇష్యూ ఏదైనా సరే తనదైన కోణంలో స్పందిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్ కమ్ పొలిటీషియన్. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారాన్ని టాలీవుడ్‌కి కూడా లింక్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోనూ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని, టాలీవుడ్ అంతా డ్రగ్స్ మత్తులో ఊగిపోతోందని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ బయటకురావడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూలోకి ఎంటరైన హీరోయిన్ కంగనా రనౌత్.. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నోరువిప్పి టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ మాఫియా ఉందని, ఇక్కడ ఏ పార్టీ జరిగినా డ్రగ్స్ తప్పకుండా వాడతారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగక తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని పేర్కొంది. ''ఇతర దేశాల మారక ద్యవ్యాలు ఎందుకు? ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరు బయటపెట్టరు. అది సరే కానీ.. తెలంగాణ NCB మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. పీతకన్ను కాకుండా సీరియస్ కన్ను వేయండి. మన ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది. అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు'' అని పేర్కొన్న మాధవీలత.. చివరగా ''నాకు భయంగా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని. ఎవరు డ్రగ్స్ జోలికి పోరు ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం.. ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వేదిలెయ్ అని భయపెడతాయి కదా ఆఫీసర్స్‌ని. సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తుందేమో'' అంటూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులపై సెటైర్స్ వేసింది మాధవీ. Also Read: గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం పెద్ద రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలామంది సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ కేసు వివరాలు వెల్లడించకుండా అధికారులు మెల్లగా సైలెంట్ కావడంతో అది మిస్టరీ గానే మిగిలింది. మళ్ళీ ఇప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ చూస్తుంటే మరోసారి రచ్చ కావడం ఖాయమే అని తెలుస్తోంది. సో.. చూడాలి మరి మాధవీలత చేసిన ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారనేది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32F3UVh
No comments:
Post a Comment