టాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బాస్ 4 హోస్ట్ అక్కినేని ఈరోజు (ఆగస్ట్ 29న) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన 60వ పుట్టినరోజును స్పెయిన్‌లో జరుపుకున్న కింగ్ నాగార్జున.. ఈ బర్త్‌డేను మాత్రం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియో మెసేజ్‌ను నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఆసక్తికర అంశం ఉంది. తాను 31వ ఏట అడుగుపెట్టినట్టు చెబుతూ నాగార్జున ఈ వీడియోను మొదలుపెట్టారు. ‘‘ఈవాళ నా 31వ పుట్టినరోజు. నిన్నటి నుంచి ఎంతో మంది విషెస్.. ప్రేమ, అభిమానంతో మెసేజ్‌లు నాకు పంపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకో విషయంపై చాలా హ్యాపీగా ఉన్నాను. ఐదున్నర నెలలు తరవాత మళ్లీ పని చేయబోతున్నాను. షూటింగ్‌కి వెళ్లబోతున్నాను. ఏ షూటింగ్ అంటే.. బిగ్ బాస్ సీజన్ 4’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు నాగార్జున. అయితే, తన వయసు 31 అంటూ చెప్పిన అక్కినేని వారి చమత్కారానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కింగ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎంతో మంది ట్విట్టర్ ద్వారా నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నేచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, శ్రీవిష్ణు, సీరత్ కపూర్, హేమంత్ మధుకర్, నాగచైతన్య, అఖిల్ తదితరులు ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31E8AeP
No comments:
Post a Comment