Saturday, 29 August 2020

ఈ ఈజీ హెయిర్ మాస్క్‌తో మీ జుట్టు బలంగా పెరుగుతుంది..

వీకెండ్స్ టైం లో స్కిన్ కేర్, హెయిర్ కేర్ మీద ఎక్కువ సమయం కేటాయించి రిఫ్రెష్ అవ్వడానికి వీలు కుదురుతుంది. ఫేస్ పాక్స్, హెయిర్ మాస్క్స్, బాడీ కేర్... వీటిని ఎంజాయ్ చేయడానికి సరైన టైం వీకెండే. ఈ సారి మీరు ట్రై చేయడానికి మీకు ఒక పరిచయం చేస్తున్నాం. ట్రై చేసి చూడండి. జుట్టు బాగా ఒత్తుగా షైనీ గా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, డాండ్రఫ్ వంటివి సామాన్యం గా అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే. ఇవేమీ మ్యానేజ్ చేయలేని ప్రాబ్లంస్ కావు. అయితే, ఈ రెమిడీస్ కి చాలా టైం పట్టేస్తుంది అనుకుంటే మీ కోసం ఇక్కడొక సింపుల్ హెయిర్ మాస్క్ ఉంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీనే. అంతే, కాదు హెయిర్ కేర్ కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా మీతో పంచుకుంటున్నాం. అవేమిటో చదివేయండి మరి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు: * కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు * పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు * మూడు, నాలుగు - విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ (మీ జుట్టు పొడవుని బట్టి) హెయిర్ మాస్క్ వేసే పద్ధతి * ఒక బౌల్ తీసుకుని అందులో పదార్ధాలన్నీ వేసి జాగ్రత్తగా కలపండి. * ఈ పేస్ట్ ని డైరెక్ట్ గా స్కాల్ప్ కి అప్లై చేసి పది, పహిహేను నిమిషాలు మసాజ్ చేయండి. * ఒక షవర్ కాప్ పెట్టుకుని రాత్రంతా అలా వదిలేయండి. షవర్ కాప్ అందుబాటులో లేకపోతే మెత్తటి టవల్ చుట్టి నిద్రపోండి. * తెల్లవారిన తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేసి కండిషనర్ అప్లై చేయండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల లాభాలేమిటి? జుట్టు కుదుళ్ళు బలంగా ఉండాలంటే వాటికి కొబ్బరి నూనె తాలూకు పోషణ కంపల్సరీ. అప్పుడే జుట్టు ఒత్తుగా షైనీ గా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ నీ, జుట్టు పల్చబడడాన్నీ కూడా తగ్గిస్తుంది. దీన్ని పెరుగుతో కలపడం వల్ల స్కాల్ప్ కూల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. ఇక, విటమిన్ ఈ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. మనందరికీ హెయిర్ వాష్ ఎలా చేయాలో తెలుసు. ముందు ఆయిల్ మసాజ్, తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం, ఆ తరువాత కండిషనర్ అప్లై చేయడం, మళ్ళీ నీటితో హెయిర్ వాష్ చేసుకోవడం. అయితే, దీన్ని రివర్స్ చేసే ప్రాసెస్ కూడా ఒకటి ఉంది. దాన్నే రివర్స్ హెయిర్ వాష్ అంటారు. ఇందులో ముందు హెయిర్ కండిషన్ చేశాక షాంపూ చేస్తారు. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తున్నా కూడా జుట్టు నిర్జీవం గా కనపడే వారికి ఈ రివర్స్ హెయిర్ వాష్ బెస్ట్ ఆప్షన్. ముందే చెప్పినట్లుగా ఈ పద్ధతిలో ముందు కండిషనర్ అప్లై చేయాలి. అయితే, స్కాల్ప్ కి మాత్రం కండిషనర్ అప్లై చేయకూడదు. కేవలం జుట్టుకి మాత్రమే ఇలా చేయాలి. చేసిన తరువాత మొత్తం వాష్ చేసేయకుండా కేవలం కొద్ది గా వాటర్ మాత్రం చల్లి ఇంక షాంపూ చేసేసుకోండి. బాగా నురగ వచ్చేలా చేసి మీ తలస్నానాన్ని ఎంజాయ్ చేయండి. కొంత మందికి కండిషనర్ వాడడం ఇష్టముండదు. జుట్టు బరువుగా ఉంటుంది అంటారు వీరు. ఈ టెక్నిక్ తో మీ హెయిర్ హెల్దీ గా, లైవ్లీ గా కనపడుతుంది. ఒక్కొక్కసారి హడావిడిలో కండిషనర్ అప్లై చేశాక కంప్లీట్ గా దాన్ని వాష్ చేయకపోతే కండిషనర్ జుట్టు మీద ఉండిపోతుంది. ఈ టెక్నిక్ తో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే, ఇక్కడ కండిషన్ చేశాక షాంపూ చేస్తున్నారు కదా; దాంతో పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి మరి. ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ చేస్తే మంచిదా, లేదా నైట్ చేయాలా అని సందేహం కూడా రావచ్చు. అసలు హెయిర్ వాష్ ఎప్పుడు చేయాలి, పొద్దున్నా, సాయంత్రమా? పొద్దున్న తొందరగా ఆరుతుంది, సాయంత్రమైతే తీరుబడిగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఏది మంచిదో చూద్దాం రండి. రాత్రి పూట హెయిర్ వాష్ చేసుకుంటే నాచురల్ గా జుట్టు ఆరబెట్టుకోడానికి వీలుంటుంది. అదే పొద్దున్నైతే అంత టైం ఉండదు కాబట్టి హీటింగ్ టూల్స్ వాడాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఇలా హీటింగ్ టూల్స్ వాడడం మంచిది కాదు, అందుకే రాత్రి పూటే హెయిర్ వాష్ చేసుకోవడం మంచిది అని కొంత మంది అంటారు. రాత్రి హెయిర్ వాష్ చేస్తే ఎక్కువ సేపు తడిగా ఉంటుంది. తడి జుట్టు తో నిద్ర పోతే హెయిర్ కీ, హెల్త్ కీ కూడా మంచిది కాదు అని ఇంకొంత మంది అంటారు. ఒక్కొక్కరి జుట్టూ ఒక్కో తీరులో ఉంటుంది. మీ హెయిర్ కి ఏది సరిపోతుందో మీకే తెలుస్తుంది. అయితే, పొద్దున వాష్ చేస్తే జుట్టు నాచురల్ గా ఆరడానికి టైం ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవాలి. రాత్రి హెయిర్ వాష్ చేస్తే జుట్టు ఆరాక, చిక్కు తీసుకుని, ప్రాపర్ గా జుట్టు ని టై చేసుకుని అప్పుడు నిద్రకి ఉపక్రమించాలి. వారం లో ఒక సారి పొద్దూన్నా, ఒక సారి రాత్రీ హెయిర్ వాష్ చేస్తే మీకే తెలుస్తుంది, మీ హెయిర్ కి ఏది బాగా సూట్ అవుతుందో.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/34Ljrps

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk