దేశంలో విలయతాండవం చేస్తున్న సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. ఇంకొందరు కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా గత రాత్రి టాలీవుడ్ నిర్మాత కన్ను మూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న బొగారి లక్ష్మీనారాయణ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించారు బోగారి లక్ష్మీనారాయణ. శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. పలు సినిమాల్లో విలన్ రోల్ పోషించిన శ్రవణ్ రాఘవేంద్రను ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం చేశారాయన. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Z5V4iH
No comments:
Post a Comment