టాలీవుడ్ ‘కింగ్’ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జునకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. Must Read: సీఎం జగన్ ట్వీట్ చేసిన దాదాపు 19 గంటల తర్వాత నాగార్జున స్పందించారు. సీఎం జగన్ డైనమిక్ లీడర్ అని, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమపూర్వక మాటలకు ధన్యవాదాలు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు తెలుసు.. మీ డైనమిక్ లీడర్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.’’ అని నాగార్జున రిప్లై ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌కు, నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వానికి నాగార్జున మద్దగా నిలిచారన్న ప్రచారం ఉంది. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ను కలిసి పరామర్శించిన, ఎన్నికల సందర్భంగా సహకారం అందించిన అతి కొద్ది మంది సినీ ప్రముఖుల్లో నాగార్జున కూడా ఒకరు. ఈ నేపథ్యంలో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. Don't Miss: Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DaXX9V
No comments:
Post a Comment