టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య. ‘మనం’ చిత్రంతో అక్కినేని ఫ్యామిలీకి ఎవర్ గ్రీన్ చిత్రం అందించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు నాగచైతన్య. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ నాగార్జునకు బర్త్ డే విషెష్ అందించారు నాగార్జున. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నాగచైతన్యకు ఇది 20వ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రంలో చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఫిదా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల మరోసారి తన లక్కీ హీరోయిన్ సాయి పల్లవి రిపీట్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2G9LSmH
No comments:
Post a Comment