Monday, 31 August 2020

ప్రణబ్ ముఖర్జీలో ఆ విలక్షణత ఎంతో ఆకట్టుకుంది.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి

మాజీ రాష్ట్రపతి, భారతరత్న (84) సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రాజకీయ కోవిదుడి మరణం యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ప్రణబ్ దా మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా ప్రణబ్ ఇకలేరనే వార్త తెలియగానే జనసేన అధినేత, సినీ నటుడు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇందులో ప్రణబ్ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో తనదంటూ సొంత ముద్రను ప్రణబ్ ముఖర్జీ వేసుకొన్నారని పవన్ పేర్కొన్నారు. అంతటి దిగ్గజ నేత మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. Also Read: అదే ప్రకటనలో ప్రణబ్ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆయన రాజకీయాల్లో విలక్షణమైన ధ్రువతారగా వెలిగారని పేర్కొన్నారు. దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా పండిట్ల కుటుంబపరంగా వస్తున్న దేవార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వదినాల్లో ఆ సంప్రదాయం కొనసాగించే విలక్షణత తనను ఆకట్టుకుందని పవన్ తెలిపారు. మరోవైపు ప్రణబ్ మృతిపై స్పందిస్తూ.. ఆయన మరణ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. భారత రాజకీయ కోవిదుడు ఇకలేరనే వార్తతో దేశం మూగబోయిందని, ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని మహేష్ తెలిపారు. అలాగే మంచు లక్ష్మి, మోహన్ బాబు, బండ్ల గణేష్, తాప్సి తదితరులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lACwR8

No comments:

Post a Comment

The PT Teacher Behind Two WPL Stars

'Today when I see them talking to people from different countries confidently, I realise that education does not come from classrooms al...