ప్రముఖ నటి దేశ్‌ముఖ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు జెనీలియా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గడిచిన 21 రోజుల్లో నాలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దేవుడి దయవల్ల ఈరోజు నాకు కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ వ్యాధిపై పోరాటం నాకు చాలా సులభంగా అనిపించినప్పటికీ గత 21 రోజుల పాటు ఒంటరిగా గడపడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. మరొకరితో గడిపే సమయం ఉండదు. కేవలం డిజిటల్ ప్రపంచంలో మునిగితేలడం వల్ల ఒంటరితనాన్ని పోగొట్టొచ్చు. మళ్లీ తిరిగి నా కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్దకు చేరడం సంతోషంగా ఉంది. మన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచడమే నిజమైన బలం. అందరికీ ఇది అవసరం. త్వరగా పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి, ఫిట్‌గా ఉండండి. ఈ మహమ్మారిపై పోరాడటానికి ఇదొక్కటే మార్గం’’ అని జెనీలియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసిన జెనీలియా.. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాష్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన తరవాత జెనీలియా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లిన జెనీలియా.. అత్తింటి గౌరవాన్ని కాపాడేలా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. భర్త రితేష్, కొడుకులు రియాన్, రాహిల్‌లతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3b857bv
No comments:
Post a Comment