దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చైతన్య రథసారధి, మాజీ మంత్రి నందమూరి రెండో వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అకాల మరణం ఎప్పటికీ తీరని లోటంటూ గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హరికృష్ణకు నివాళులు అర్పించారు. అలాగే హరికృష్ణ తమ్ముడు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి అన్నయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో బాలయ్య అన్నయ్యను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన పోస్టు చేశారు. ‘‘తెలుగుదేశం స్థాపించిన తొలి దినాల్లో నాన్న గారికి చేదోడు వాదోడుగా ఉంటూ చెతన్య రథసారధి అయిన మా అన్న నందమూరి హరికృష్ణ గారు మన మధ్యనుంచి దూరం అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మశక్యం కావటం లేదు మనస్సు అంగీకరించటం లేదు. నాన్నకు తగ్గ తనయుడు, తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు అన్నయ్య హరికృష్ణ గారికి నా నివాళులు అర్పిస్తూ... జోహార్ నందమూరి హరికృష్ణ’’ అని బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అలాగే టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం హరికృష్ణకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘‘నందమూరి హరికృష్ణ గారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం. హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2G8zNy6
No comments:
Post a Comment